అరుణ్ పాండియన్
అరుణ్ పాండియన్ | |
---|---|
అరుణ్ పాండ్యన్ | |
లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు | |
In office 2011 మే 11 – 2016 మే 11 | |
అంతకు ముందు వారు | ఎం. వి. ఆర్. వీర కబిలన్ |
తరువాత వారు | ఎం. గోవిందరాసు |
నియోజకవర్గం | పేరవురాణి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1958 జూలై 13 |
జీవిత భాగస్వామి | విజయ పాండియన్ |
సంతానం | కవిత పాండియన్, కిరణ పాండియన్, కీర్తి పాండియన్ |
బంధువులు | రమ్య పాండియన్ (మేనకోడలు) |
వృత్తి | నటుడు, చిత్ర దర్శకుడు, సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు |
అరుణ్ పాండియన్ భారతీయ నటుడు, చిత్రనిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన విమర్శకుల ప్రశంసలు పొందిన ఊమై విజిగల్ (1986) చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసాడు. పలు చిత్రాలలో నటించిన ఆయన ఆ తరువాత, ఫిల్మ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన లండన్‌కు చెందిన ఐంగారన్ ఇంటర్నేషనల్‌కి చీఫ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు, అయితే, తరువాత అతను తన సొంత ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ&పి గ్రూప్స్‌ని ప్రారంభించాడు.
ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ (సిఫా) కార్యదర్శిగా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎగుమతిదారుల సంఘం (సిఫియా)కి అధ్యక్షుడుగా కూడా వ్యవహరిస్తున్నాడు.[1][2]
విద్యాభ్యాసం
[మార్చు]ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్స్ పట్టా పొందాడు.[3]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]కొన్ని తెలుగు చిత్రాలు
[మార్చు]- ప్రేమశిఖరం (1992)
- నక్షత్రపోరాటం (1993)
- దాడి (1993)
- నేరం (1994)
- దొంగలరాజ్యం (1994)
- కమెండో (1995)
- నాగ శక్తి (1998)
- పోలీస్ (1999)
- నాగులమ్మ (2000)
- ఈతరం నెహ్రూ (2000)
రాజకీయం
[మార్చు]ఆయన 2011 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) అభ్యర్థిగా పెరవురని నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5][6][7][8] 2016 ఫిబ్రవరి 21న, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరుణ్ పాండియన్ తో సహా మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సమర్పించారు.[9] 2016 ఫిబ్రవరి 25న, పార్టీ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)లో చేరారు.[10][11]
వ్యక్తిగతం
[మార్చు]ఆయన తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ డి. పి. చెల్లయ్య, వీరు తిరునెల్వేలిలో నివసించేవారు.[12] ఆయన దివంగత సోదరుడు సి. దురై పాండియన్, అరుణ్ పాండియన్ ప్రధాన పాత్రలో నటించిన ఉజియన్ (1994) చిత్రానికి దర్శకత్వం వహించాడు.[13] ఆయనకి కవిత పాండియన్, కిరణ పాండియన్, కీర్తి పాండియన్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[14] ఆయన కుమార్తె కీర్తి పాండియన్ తో పాటు మేనకోడలు రమ్య పాండియన్ నటీమణులుగా తమిళనాట ఎదుగుతున్నారు..
మూలాలు
[మార్చు]- ↑ "South Indian Film Financiers Association launched". Cinema Express.
- ↑ "Arun Pandian elected as the President of South Indian Film Exporters Association". 29 August 2017.
- ↑ [1][dead link]
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Find Tamil Actor Arun Pandian Filmography, Movies, Pictures and Videos | Jointscene.com". Archived from the original on 4 August 2010. Retrieved 2009-11-10.
- ↑ The Hindu : States / Tamil Nadu : Two more DMDK MLAs meet Jayalalithaa
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2 April 2013. Retrieved 2012-10-10.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2 April 2013. Retrieved 2013-01-13.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Tamil Nadu: Ten dissident MLAs resign, to join AIADMK". Deccan Chronicle. 21 February 2016. Retrieved 27 May 2018.
- ↑ "Ten former DMDK, PMK and PT MLAs join AIADMK in Tamil Nadu". The Times of India. 25 February 2016. Retrieved 27 May 2018.
- ↑ "Tamil Nadu Assembly: 10 Opposition MLAs to join AIADMK". The Indian Express. 18 March 2016. Retrieved 27 May 2018.
- ↑ [2][dead link]
- ↑ "Costume Designer turned to an actress!". entertainment.chennaipatrika.com. 2015-02-28. Retrieved 2016-11-08.
- ↑ [3][dead link]