Jump to content

కీర్తి భట్

వికీపీడియా నుండి
కీర్తి భట్
జననం
కీర్తి కేశవ్ భట్

(1999-06-02) 1999 జూన్ 2 (వయసు 25)
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మనసిచ్చి చూడు టీవీ సిరీస్
కార్తీక దీపం తెలుగు టీవీ సిరీస్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6

కీర్తి కేశవ్ భట్ (జననం 1999 జూన్ 2), ప్రధానంగా కన్నడ, తెలుగు టెలివిజన్‌లలో పనిచేసే భారతీయ నటి. ఆమె 2017లో ఐస్ మహల్‌తో తొలిసారిగా నటించింది. స్గార్ మాలో అక్టోబరు 2019 నుండి జూన్ 2022 వరకు ప్రసారమైన మనసిచ్చి చూడు ధారావాహికలో భాను పాత్ర,[1] మరో తెలుగు టీవీ సిరీస్ కార్తీక దీపంలో డా.హిమ కార్తీక్ పాత్రలో ఆమె బాగా పేరు పొందింది. 2022లో, ఆమె తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో పోటీదారుగా పాల్గొని 2వ రన్నరప్‌గా నిలిచింది.[2][3] 2023లో సంక్రాంతి థాకథాయ్ అనే మ్యూజిక్ వీడియోని అనూప్ మీనన్, లక్ష్మి హోయసల్ లతో కలిసి ఆమె చేసింది.[4]

2023లో ఆమె ఇండియన్ జెమ్ అచీవర్ గా యష్ ఇంటర్నేషనల్ అవార్డ్ గెలుచుకుంది.

ప్రారంభ జీవితం

[మార్చు]

కీర్తి భట్ 1999 జూన్ 2న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది.[5] 2017లో ఆమె కుటుంబ సభ్యులు ప్రమాదానికి గురయ్యారు. ఆమె తండ్రి, తల్లి, సోదరుడు, కోడలు.. ఇలా తన మొత్తం కుటుంబాన్ని కోల్పోయింది.[6] ఆగస్టు 2023లో, ఆమె నటుడు విజయ్ కార్తీక్‌తో వివాహ నిశ్చితార్థం చేసుకుంది.[7]

కెరీర్

[మార్చు]

కీర్తి భట్ 2017లో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది, ఆమె తన మొదటి కన్నడ తొలి చిత్రం ఐస్ మహల్‌ని చేసింది. 2019 నుండి 2022 వరకు, ఆమె స్టార్ మా సోప్ ఒపెరా మనసిచ్చి చూడులో భానుమతిగా ప్రధాన పాత్రను పోషించింది.[8] 2021లో, ఆమె స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైన మరో ధారావాహిక 100% లవ్‌ లోనూ నటించింది. ఆమె స్టార్ మా పరివార్ లీగ్ సీజన్ 3లో పాల్గొన్నది.

2022లో, స్టార్ మా తెలుగు టీవీ సిరీస్ కార్తీక దీపంలో మానస్ నాగులపల్లిగా, మనోజ్ కుమార్ సరసన ఆమె డా.హిమ కార్తీక్ పాత్రను పోషించింది.[9] సెప్టెంబరు 2022 నుండి, ఆమె స్టార్ మా రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో పాల్గొన్నది.[10]

మార్చి 2023లో, ఆమె స్టార్ మా టెలివిజన్ సిరీస్ మధురానగరిలో రాధ పాత్రలో కనిపించింది.[11]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర భాష మూలాలు
2017 ఐస్ మహల్ కనక కన్నడ [12]
2019 పాయింట్ అవుట్
TBA కానేయగిద్దాలే కావేరి [13]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్ మూలాలు
2019-2022 మనసిచ్చి చూడు భానుమతి [14]
2022 కార్తీకదీపం డా. హిమ కార్తీక్ [15]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 పోటీదారు 2వ రన్నరప్ [16]
2023-ప్రస్తుతం మధురానగరిలో రాధ [17]

ప్రత్యేక పాత్రలు

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర ఛానెల్ నోట్స్
2020 జాఠారో జాతర కీర్తి భట్ డిస్నీ+ హాట్‌స్టార్ అతిథి పోటీదారు
2021 100% లవ్ స్టార్ మా
స్టార్ మా పరివార్ ఛాంపియన్‌షిప్
స్టార్ మా పరివార్ లీగ్ సీజన్ 3 శేఖర్ మాస్టర్ తో యుగళ నృత్య ప్రదర్శన
మా వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక ప్రదర్శన
పండగే పండగ
స్టార్ మా పరివార్ అవార్డులు శేఖర్ మాస్టర్ తో యుగళ నృత్య ప్రదర్శన
స్టార్ట్ మ్యూజిక్ సీజన్ 3 అతిథి పోటీదారు
2022 మా సంక్రాంతి వేడుక ప్రత్యేక నృత్య ప్రదర్శన
బిబి జోడి పోటీదారు డిస్నీ+ హాట్‌స్టార్ మహేష్ బాబు కాళిదాసుతో కపుల్ షో
ఇస్మార్ట్ జోడి సీజన్ 2 కీర్తి భట్ స్టార్ మా మహేష్ బాబు కాళిదాసుతో కపుల్ షో
మొగుడ్స్ vs పెల్లామ్స్ మహేష్ బాబు కాళిదాసుతో కపుల్ షో
బిగ్ బాస్ ఇంటిలో మా పరివార్ పోటీదారు డిస్నీ+ హాట్‌స్టార్ సెలబ్రిటీస్ షో
శ్రీదేవి డ్రామా కంపెనీ అతిథి పోటీదారు ఈటీవి మహేష్ బాబు కాళిదాసుతో ప్రత్యేక నృత్య ప్రదర్శన
ఈ వర్షం సాక్షిగా కీర్తి భట్ డిస్నీ+ హాట్‌స్టార్ అతిథి పోటీదారు
సూపర్ సింగర్ జూనియర్ స్టార్ మా మానస్ నాగులపల్లితో ప్రత్యేక నృత్య ప్రదర్శన
2023 ఆదివారం విత్ స్టార్ మా పరివారం కీర్తి భట్ అతిథి పోటీదారు
జెమిని మేళా కీర్తి భట్ జెమిని టీవి యాంకర్ రవికిరణ్‌తో కలిసి కీర్తి భట్
మా బోనాలు జాతర కీర్తి భట్ స్టార్ మా అతిథి పోటీదారు
వినాయక చవితి
ఆదివారం విత్ స్టార్ మా పరివారం
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవి
ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ మా
2024 సూపర్ జోడి జీ టీవి
శివంగివే

మూలాలు

[మార్చు]
  1. "'మనసిచ్చిచూడు' సీరియల్ 500 ఎపిసోడ్". Samayam Telugu. Retrieved 2022-03-21.
  2. Sakshi (4 September 2022). "ఆట మొదలైంది.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌ వీళ్లే!". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
  3. "Bigg Boss Telugu 6 contestant Keerthi Keshav Bhat". The Times of India (in ఇంగ్లీష్). 2022-09-04. Retrieved 2022-09-04.
  4. "Kannada, Telugu stars come together for this special Sankranti song". Times Of India (in ఇంగ్లీష్). 2023-01-08. Retrieved 2023-01-08.
  5. "Bigg Boss Telugu 6 contestant Keerthi Keshav Bhat: From losing her family in a road accident to winning hearts with her TV performances, all you need to know about the actress". The Times of India (in ఇంగ్లీష్). 2022-09-04. Retrieved 2022-09-04.
  6. "Keerthi Keshav Bhat: Sadly.. the entire family of this serial actress died in a car accident!". News 18 (in ఇంగ్లీష్). 2021-07-21. Retrieved 2021-07-21.
  7. "Actress Keerthi Keshav Bhatt starts prepping for her wedding day with Vijay Karthik". The Times of India (in ఇంగ్లీష్). 2023-08-18. Retrieved 2023-08-18.
  8. "అన్న చనిపోతే తమ్ముడితో పెళ్లి." Sakshi. 2019-10-16. Retrieved 2022-03-21.
  9. "Watch: Karthika Deepam actress Archana Ananth shares first promo post generation leap; new look of Hima and Sourya". Times of India. 2022-03-18. Retrieved 2022-03-18.
  10. "Bigg Boss 6 Telugu Voting Updates: Keerthi Bhatt is the first contestant of BB 6 Telugu". The News Crunch. 2022-09-04. Retrieved 2022-09-04.
  11. "Latest teaser of Keerthi Keshav Bhat's 'Madhuranagarilo' is out; watch". Times of India. 2023-02-28. Retrieved 2023-02-28.
  12. "Ice Mahal complete Nice title". Indiaglitz (in ఇంగ్లీష్). 2017-09-05. Retrieved 2017-09-05.
  13. "Om Saiprakash, who supported the film 'Kanereadhu'; It's a love story in search!". Vijay Karnataka (in ఇంగ్లీష్). 2021-12-07. Retrieved 2021-12-07.
  14. "Manasichichudu' serial 500 episode". The Times of India (in ఇంగ్లీష్). 2021-09-18. Retrieved 2021-09-18.
  15. "Karthika Deepam March 21 Episode: Bigg Boss Manas Hero Entry.. Hima Birthday Celebrations, Sourya Dadagiri!". The Times of India (in ఇంగ్లీష్). 2022-03-21. Retrieved 2022-03-21.
  16. "Karthika Deepam Hima: 'Karthika Deepam' Sisters who share Bigg Boss". The Times of India (in ఇంగ్లీష్). 2022-09-30. Retrieved 2022-09-30.
  17. "Madhura Nagarilo Telugu Serial On Star Maa Channel Launching On 14 March At 02:00 PM". India TV news (in ఇంగ్లీష్). 2023-03-11. Retrieved 2023-03-11.