Jump to content

కుందూరు నాగార్జున రెడ్డి

వికీపీడియా నుండి
కుందూరు పెద్ద నాగార్జున రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు జంకె వెంకట రెడ్డి
నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1981
మార్కాపురం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కుందూరు పెద్ద కొండారెడ్డి, సుబ్బమ్మ
జీవిత భాగస్వామి కల్పనా

కుందూరు పెద్ద నాగార్జున రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో మార్కాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కేపీ నాగార్జున రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, మార్కాపురంలో జన్మించాడు. ఆయన ఒకటి నుంచి నాల్గో తరగతి వరకు మాత్రమే మార్కాపురం పట్టణంలోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో, 5నుంచి 10వ తరగతి వరకు నంద్యాల పబ్లిక్‌ స్కూల్‌లో, ఇంటర్మీడియట్ గుంటూరు వికాస్‌లో, ఇంజినీరింగ్‌ కర్నాటకలోని షిమోగా యూనివర్శిటీలో, ఎం.ఎస్‌ అమెరికాలోని టెక్సాస్‌లో పూర్తి చేసి 2007-2010 వరకు కాలిఫోర్నియా లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి వచ్చి మాచర్లలోని న్యూటన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో డైరెక్టర్‌గా ఉన్నాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కె.పి.నాగార్జునరెడ్డి తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ తరుపన పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన తండ్రి కుందూరు పెద్ద కొండారెడ్డి 1985, 1989, 1999, 2004లో మార్కాపురం ఎమ్మెల్యేగా పని చేశాడు.

నాగార్జునరెడ్డి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గిద్దలూరు నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి చేతిలో 973 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (8 April 2019). "నేను ఎమ్మెల్యేనైతే..!". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  3. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  4. Election Commision of India (22 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Giddalur". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.