కునియిల్ కైలాష్‌నాథన్
కునియిల్ కైలాష్‌నాథన్ | |
---|---|
കുനിയിൽ കൈലാസനാഥൻ | |
25వ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ | |
Assumed office 2024 ఆగస్టు 07 | |
ముఖ్యమంత్రి | ఎన్ రంగస్వామి |
అంతకు ముందు వారు | సీ.పీ. రాధాకృష్ణన్ (అదనపు ఛార్జీ) |
వ్యక్తిగత వివరాలు | |
జననం | వడకర, కోజికోడ్ జిల్లా, కేరళ, భారతదేశం | 1953 మే 25
జాతీయత | భారతదేశం |
కళాశాల | వేల్స్ విశ్వవిద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయం |
వృత్తి | రిటైర్డ్ IAS అధికారి |
కునియిల్ కైలాష్‌నాథన్ (జ.1953 మే 25) ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేస్తున్న రిటైర్డ్ 1979 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.[1] గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీకి అదనపు ప్రధాన కార్యదర్శిగా 2013 వరకు పనిచేశారు. అతను 2024 జూన్ 30 వరకు గుజరాత్ సి.ఎం.ఒ. ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
ప్రారంభ జీవితం, కుటుంబం
[మార్చు]అతను ఊటీలో పెరిగాడు, అక్కడ అతని తండ్రి భారత తపాలాశాఖలో పనిచేశారు.[2]
వృత్తి జీవితం
[మార్చు]కునియిల్ కైలాష్‌నాథన్ 1981 సెప్టెంబరు 1న జూనియర్ అసిస్టెంట్ కలెక్టరుగా టైమ్ స్కేలుపై తన వృత్తిని ప్రారంభించారు. అతను సురేంద్రనగర్ (1985) సూరత్ (1987) జిల్లాల కలెక్టరుగా పనిచేశారు.[3]
అతను గుజరాత్ మారిటైమ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశాడు. అర్బన్ సెక్టార్‌లో, అతను 1999 నుండి 2001[4] a వరకు అహ్మదాబాద్ మునిసిపల్ కమీషనర్‌గా, గుజరాత్ అర్బన్ డెవలప్‌మెంట్, అర్బన్ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ (యుడిడి) ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. యుడిడిలో ఉన్నప్పుడు, అతను అహ్మదాబాద్ కోసం బస్ రాపిడ్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసిన స్టీరింగ్ కమిటీకి అధ్యక్షత వహించాడు.
అతను 2013 మే 31న గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)లో అదనపు ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసాడు.[5] దానితో 33 సంవత్సరాల సేవను ముగించాడు. అయినప్పటికీ, అతను సిఎంఒలో చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగాడు, అతని కోసం ఒక పోస్ట్ సృష్టించబడింది. 2024 జూన్ 30 వరకు అక్కడ పనిచేశారు.[6]
కైలాష్‌నాథన్ 2024 ఆగస్టు 07న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.[3][7]
విద్య
[మార్చు]అతను యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ (MSc కెమిష్ట్రీ), యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ (MA ఎకానామిక్స్) నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను కలిగి ఉన్నాడు. [8]
మూలాలు
[మార్చు]- ↑ Bureau, The Hindu (2024-08-07). "Kailashnathan sworn-in as Lt. Governor of Puducherry". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-09-05.
- ↑ "The most powerful Indians in 2014: No. 81-90". 13 March 2014. Retrieved 25 May 2014.
- ↑ ఇక్కడికి దుముకు: 3.0 3.1 "K Kailashnathan takes oath as L-G of Puducherry". web.archive.org. 2024-09-05. Archived from the original on 2024-09-05. Retrieved 2024-09-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Period wise Municipal Commissioners". Archived from the original on 6 June 2014. Retrieved 25 May 2014.
- ↑ "The men who rule Modi's Gujarat". www.thehindu.com. 7 May 2014. Retrieved 25 May 2014.
- ↑ Jha, Satish. "Ex IAS Kailashnathan bids adieu to Gujarat CM office where he served for 11 years after retirement on multiple extensions". Deccan Herald. Retrieved 2024-07-01.
- ↑ Service, Express News (2024-08-07). "K Kailashnathan takes oath as L-G of Puducherry". The New Indian Express. Retrieved 2024-09-05.
- ↑ "Company Overview of Gujarat State Financial Services Limited". Retrieved 25 May 2014.