కున్వర్ డానిష్ అలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కున్వర్ డానిష్ అలీ
కున్వర్ డానిష్ అలీ


పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు కన్వర్ సింగ్ తన్వర్
తరువాత కన్వర్ సింగ్ తన్వర్
నియోజకవర్గం అమ్రోహా

బహుజన్ సమాజ్ పార్టీ, లోక్‌సభ నాయకుడు
పదవీ కాలం
6 నవంబర్ 2019 – 13 జనవరి 2020
నియోజకవర్గం అమ్రోహా

వ్యక్తిగత వివరాలు

జననం (1975-04-10) 1975 ఏప్రిల్ 10 (వయసు 49)
హాపూర్,ఉత్తరప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2024 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు *బహుజన్ సమాజ్ పార్టీ (2019-2023)
  • జనతాదళ్ (సెక్యులర్) (2019 వరకు)
జీవిత భాగస్వామి జుబియా డానిష్
సంతానం 3
నివాసం హాపూర్, ఉత్తరప్రదేశ్
పూర్వ విద్యార్థి జామియా మిలియా ఇస్లామియా
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

కున్వర్ డానిష్ అలీ ( జననం 10 ఏప్రిల్ 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

కున్వర్ డానిష్ అలీ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాIలో చదువుతున్నప్పుడు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ యువ జనతాదళ్‌తో ఛత్ర జనతాదళ్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాలలో అడుగు పెట్టాడు. కున్వర్ డానిష్ అలీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము నుండి లో‍క్‍సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేయడంతో జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి సలహా మేరకు ఆయన 2019లో బహుజన్ సమాజ్ పార్టీలో చేరి[3], 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్‌ను ఓడించి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

కున్వర్ డానిష్ అలీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆయనను 2023లో బీఎస్‌పీ నుండి సస్పెండ్ చేసింది.[4] ఆయన ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి,[5] 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Amroha". Results ECI. Archived from the original on 25 May 2019. Retrieved 24 May 2019.
  2. TV9 Bharatvarsh (2024). "अमरोहा लोकसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (17 March 2019). "JD(S) mediator Kunwar Danish Ali joins BSP". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  4. Mana Telangana (9 December 2023). "ఎంపి డానిష్ అలీని బహిష్కరించిన బిఎస్‌పి". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  5. "Danish Ali joins Congress, likely to be its pick in Amroha". 21 March 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  6. "2024 Loksabha Elections Results - Amroha". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.