కూనంనేని సాంబశివరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూనంనేని సాంబశివరావు
కూనంనేని సాంబశివరావు


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 సెప్టెంబర్ 8 - ప్రస్తుతం
ముందు చాడ వెంకట్ రెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 నుండి 2014 వరకు,3 డిసెంబర్ 2023 ప్రస్తుతం
ముందు వనమా వెంకటేశ్వరరావు
తరువాత జలగం వెంకటరావు
నియోజకవర్గం కొత్తగూడెం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1956
చుంచుపల్లి, చుంచుపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ సీపీఐ
తల్లిదండ్రులు వెంకట రత్తయ్య

కూనంనేని సాంబశివరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009,2023లో కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కూనంనేని సాంబశివరావు విశాలంధ్ర దినపత్రికలో డెస్క్ జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత కొత్తగూడెంలో విశాలంధ్ర విలేకరిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత జర్నలిజం నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1984లో సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా పని చేసి 1987లో కొత్తగూడెం మండల పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. కూనంనేని సాంబశివరావు 2004లో సుజాత నగర్ నియోజకవర్గం నుండి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

కూనంనేని సాంబశివరావు 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుండి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014,2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోపాటి చేసి ఓడిపోయాడు.[3] కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేసి 2022 సెప్టెంబర్ 8న సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.[4]

ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 26547 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికై[5], 2023 డిసెంబర్ 16న ప్యానెల్ స్పీకర్‌గా నియమితుడయ్యాడు.[6][7]

కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ ఆవరణలో

మూలాలు

[మార్చు]
  1. Ceo Telangana (2009). "Kunamneni Sambasiva Rao Affidavit" (PDF). Archived from the original (PDF) on 16 April 2022. Retrieved 16 April 2022.
  2. Sakshi (26 October 2013). "ఖాకీ వర్సెస్ ఖద్దర్". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  3. Result University (2018). "Kothagudem Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  4. Namasthe Telangana (8 September 2022). "సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Namaste Telangana (16 December 2023). "ప్యానల్‌ స్పీకర్లుగా ప్రకాశ్‌రెడ్డి, బాలూ నాయక్‌." Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  7. TV9 Telugu (16 December 2023). "ప్యానెల్ స్పీక‌ర్లు స‌భ‌కు ఎప్పుడు అధ్యక్షత వ‌హిస్తారు? వారికి ఉండే అర్హతలు ఏంటీ..?". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)