Jump to content

కృష్ణా జిల్లా గ్రామదేవతలు

వికీపీడియా నుండి

గ్రామదేవత అంటే గ్రామాన్ని కాపాడి, రక్షించే దైవ శక్తి అని గ్రామ ప్రజల నమ్మకం. గ్రామస్తుల కష్టాలు తీర్చి, పంటలను కాపాడి, శత్రువుల నుండి రక్షించే శక్తిగా గ్రామదేవతను పూజిస్తారు. గ్రామాలు, పట్టణీకరణ నగరీకరణ మధ్య విస్తరిస్తున్న కృష్ణా జిల్లాలో గ్రామ దేవతలు నగరదైవ శక్తులుగా పరిణితి చెందుతున్నారు. అయినా గ్రామాలలో జరిపినట్టే ప్రజలు ఉత్సవాలు, సంబరాలు జరుపుతున్నారు. గ్రామ దేవత కోపమే వర్షాలు పడకపోవటానికి, అరిష్టాలకి కారణం అని గ్రామస్థులు భావిస్తారు. ఆమె కోపం తీర్చేందుకు బలులు, సంబరాలు, ఉత్సవాలు ఏకాధికం చేస్తారు. కృష్ణా జిల్లా గ్రామదేవతల మీద అయితే తెలుగులో సినిమాలు కూడా వచ్చాయి.

గ్రామదేవతల కథలు

[మార్చు]

పోషించే దేవతను పోచమ్మ అని కొలిచారు. ఈమె కాళికాదేవి స్వరూపం అని నమ్ముతారు. స్ఫోటకం, పొంగు లాంటి వ్యాధులకు పోచమ్మను అధిదేవత అంటారు. స్ఫోటకం పోస్తే ఆ సమయంలో పోచమ్మ-అమ్మతల్లి-ఆటలమ్మ-ఆటపాటలమ్మ-తట్టుతల్లి-మహమ్మారి సోకిందని భావించి ఆమెను చల్లార్చటం కోసం చద్ది సమర్పిచుకుంటూ ఉంటారు. ఊరి జనమంతా ఈ వ్యాధులు ప్రబలినపుడు జాతరలు, ఉత్సవాలు, సంబరాలు జరిపి అమ్మవారిని తృప్తిపరుచుకుంటారు. మైసమ్మ పశువుల దేవత. మహాలక్ష్మి, మహిషమ్మ పదాలే గ్రామస్తుల నోట మైసమ్మగా అయ్యాయి. పశువులు తప్పిపోవడం అనేది గ్రామ దేవత కోపంనకు సూచన గా భావిస్తారు , పశువులు తప్పిపోయినపుడు వ్యాధులు సోకి మరణిస్తున్నపుడు, మైసమ్మకు మొక్కుకుంటారు. గేదెమహాలక్ష్మి అని పిలిచేది ఈ మైసమ్మనే. కృష్ణా జిల్లాలోని దాదాపు 160 గ్రామాల చారిత్రక ప్రాధాన్యతలు, పండుగలు, ఉత్సవాల గురించిన వివరాలు 1961 సెన్సస్ లో కనిపిస్తాయి.[1] ఈ వివరాల్ని పరిశీలించినపుడు 47 గ్రామదేవతల పేర్లు కనిపిస్తాయి.
ఈ 47 గ్రామదేవతల పేర్లు :

  1. అంకమ్మ పేరంటాలు
  2. అచ్చమ్మ - పాపయ్య
  3. అచ్చమ్మ - వాసిరెడ్డి
  4. అలివేలమ్మ
  5. అద్దంకి నాంచారమ్మ
  6. ఇరుమలమ్మ
  7. కోటమహిషమ్మ
  8. కొండమారెమ్మ (వానదేవత)
  9. కుంతిదేవి (గొంతేలమ్మ)
  10. గోగులమ్మ
  11. గంటాలమ్మ
  12. గంగానమ్మ
  13. చంద్రమ్మ
  14. తుంగ పల్లెమ్మ
  15. తిరుపతమ్మ - గోపయ్య
  16. తుమ్మలమ్మ
  17. నాంచారమ్మ
  18. నూకాలమ్మ
  19. నీరమ్మ
  20. పెద్దమ్మ
  21. పోలేరమ్మ
  22. పుట్లమ్మ
  23. పెద్దింటమ్మ
  24. పల్లాలమ్మ
  25. బుచ్చమ్మ
  26. బతకమ్మ
  27. మద్దిరామమ్మ
  28. మావుళ్ళమ్మ
  29. మారెమ్మ
  30. మాలచ్చమ్మ
  31. ముత్యాలమ్మ
  32. ముక్కొల్లు మహాకాళమ్మ
  33. పెనమకూరు మంగమ్మ
  34. ముప్పాళమ్మ
  35. యల్లమ్మదేవత
  36. రంగమ్మ పేరంటాలు
  37. లంకమ్మ
  38. వీరమ్మ పేరంటాలు
  39. వాకాలమ్మ
  40. వేలమ్మ
  41. శ్రీలక్ష్మీ పేరంటాలమ్మ
  42. సరోజనమ్మ
  43. బాలసన్యాసమ్మ
  44. చల్లలమ్మ
  45. యాపారమ్మ
  46. మామిళ్ళమ్మ
  47. ఎల్లారమ్మ

మూలాలు

[మార్చు]
  1. 1961 సెన్సస్ ఆఫ్ ఇండియా రెండవ వాల్యూం, ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్