కె.ఎస్. నారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.ఎస్. నారాయణ
కె.ఎస్. నారాయణ


మాజీ పార్లమెట్ సభ్యుడు
పదవీ కాలం
1977 – 1984
నియోజకవర్గం హైదరాబాదు

మాజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు (సికింద్రాబాదు)
పదవీ కాలం
1957 నుండి 1972 వరకు (మూడుసార్లు)

వ్యక్తిగత వివరాలు

జననం 1926 మే 12
సికింద్రాబాద్‌, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపి

కె.ఎస్. నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1957 నుండి 1972 వరకు సికింద్రాబాదు శాసనసభ నియోకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 1977 నుండి 1984 వరకు హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్య[మార్చు]

నారాయణ 1926, మే 12న తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్‌లో జన్మించాడు. తండ్రిపేరు కిష్టయ్య. సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజ్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను, హైదరాబాదులోని నిజాం కశాశాలలో ఉన్నత (బి.ఏ.) విద్యను, న్యాయ కళాశాలలో న్యాయవిద్య (ఎల్.ఎల్.బి.)ను పూర్తిచేశాడు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నారాయణకు 1940లో లక్ష్మీదేవితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఉద్యమ జీవితం[మార్చు]

1942లో 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నాడు. 1947-48 సమయంలో సుమారు 15 నెలలపాటు జైలుశిక్షను కూడా అనుభవించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నారాయణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులను నిర్వర్తించాడు. కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు శాసనసభ నియోకవర్గం నుండి వరుసగా మాడుసార్లు (1957, 1962, 1967 ఎన్నికల్లో) ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తరువాత 1977లో జరిగిన లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి ఎంపీగా గెలుపొందాడు.[3] 1980లో జరిగిన లోకసభ ఎన్నికల్లో హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ (ఐ) పార్టీ[4] తరపున పోటీచేసి ఎంపీగా గెలుపొందాడు.[5]

ఎమ్మెల్యేగా[మార్చు]

సంవత్సరం నియోజకవర్గ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
1957 20 సికింద్రాబాద్ జనరల్ కె.ఎస్. నారాయణ భారత జాతీయ కాంగ్రెస్ 14765 జె.వెంకటేశం పి.ఎస్.పి. 4026
1962 217 సికింద్రాబాద్ జనరల్ కె.ఎస్. నారాయణ కాంగ్రెస్ 20596 జి.ఎం.అంజయ్య ఎస్ఓసి 4951
1967 214 సికింద్రాబాద్ జనరల్ కె.ఎస్. నారాయణ భారత జాతీయ కాంగ్రెస్ 14871 బి.ఎస్.ఎం.సింగ్ ఇండిపెండెంట్ 8658

ఎంపీగా[మార్చు]

లోక్‌సభ పదవి కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
ఆరవ లోక్‌సభ 1977-80 కె.ఎస్. నారాయణ భారత జాతీయ కాంగ్రెస్ 1,56,295 సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ స్వతంత్ర పార్టీ 91,227
ఏడవ లోక్‌సభ 1980-84 కె.ఎస్. నారాయణ భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) 1,66,868 ఏలె నరేంద్ర జనతా పార్టీ 1,35,304

నిర్వర్తించిన పదవులు[మార్చు]

 1. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1956 వరకు)
 2. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (ప్రారంభం నుండి)
 3. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (1958-60)
 4. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి (1977-78)
 5. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు (1978-79)
 6. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి
 7. ఐ.ఎన్.టి.యు.సి. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
 8. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ (1957-58)
 9. అంచనాల కమిటీ చైర్మన్ (1966-67 మరియు 1971-72)
 10. పరిశ్రమలు, వ్యవసాయం, ప్రాంతీయ కమిటీ సహకార సబ్‌కమిటీ సభ్యుడు
 11. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ సభ్యుడు

మూలాలు[మార్చు]

 1. "K.S. NARAYANA - HYDERABAD - Lok Sabha Election Results 1980". www.electiontak.in. Retrieved 2022-03-18.
 2. "Members Bioprofile (K.S. Narayana)". loksabhaph.nic.in. Archived from the original on 2022-03-18. Retrieved 2022-03-18.
 3. "Hyderabad Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Retrieved 2022-03-18.
 4. "Hyderabad Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Retrieved 2022-03-18.
 5. "Shri K.S. Narayana MP biodata Hyderabad | ENTRANCEINDIA". 2018-12-26. Archived from the original on 2022-03-18. Retrieved 2022-03-18.