కె.జి.యఫ్ చాప్టర్ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.జి.యఫ్ చాప్టర్ 1
సినిమా పోస్టర్
దర్శకత్వంప్రశాంత్ నీల్
రచనప్రశాంత్ నీల్
నిర్మాతవిజయ కిర్గందూర్
తారాగణంయశ్. శ్రీనిధి శెట్టి
ఛాయాగ్రహణంభవన గౌడ్
కూర్పుశ్రీకాంత్
సంగీతంరవి బుస్రూర్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుKRG స్టూడియోస్ (కన్నడ)

ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ & AA ఫిల్మ్స్ (హిందీ) విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (తమిళ్) వరాహీ చలన చిత్రము (తెలుగు)

గ్లోబల్ యునైటెడ్ మీడియా (మలయాళం)
విడుదల తేదీ
20 డిసెంబర్ 2018 (యునైటెడ్ స్టేట్స్ & కెనడా)

21 డిసెంబర్ 2018 (భారతదేశం)

5 ఫిబ్రవరి 2019 (డిజిటల్ విడుదల)
సినిమా నిడివి
155నిమిషాలు
దేశంభారత దేశం
భాషలుకన్నడ తెలుగు, మలయాళం
బడ్జెట్80కోట్లు
బాక్సాఫీసు243-250 కోట్లు

తారాగణం

[మార్చు]

1981లో కోలారు బంగారు గనులును ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను తయారు చేసుకున్నాడు. 2018లో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ సాధారణ యువకుడు ఫీల్డ్స్‌ ఎలా అధినేత అయ్యాడనే క్రమంపై పుస్తకం రాస్తాడు దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. దానిపై పరిశోధన చేసే ఓ ప్రతికాధినేతకు ఆ పుస్తకాన్ని రాసిన జర్నలిస్ట్ కథను వివరించడంతో కథ మొదలవుతుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సూర్యవర్ధన్‌కి ఓ విలువైన రాయి దొరుకుతుంది. అది బంగారం ఉన్న ప్రాంతం అని తెలుసుకున్న సూర్య వర్దన్ స్థలం 99 ఏళ్లకు లీజుకు తీసుకుని పటిష్ఠమైన కాపలాను పెట్టుకుని బంగారం తవ్వే పని ప్రారంభిస్తాడు. చుట్టు పక్కల గ్రామాల్లోని నివసించే ప్రజలను తీసుకొచ్చి వారిని బానిసలుగా మార్చి పనులు చేయిస్తుంటాడు. అనుకోకుండా సూర్యవర్ధన్‌కి పక్షవాతం వస్తుంది. దాంతో అందరూ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌పై అధిపత్యం సాధించాలని చూస్తుంటారు. అయితే సూర్యవర్ధన్ కొడుకు గరుడ అందరినీ తన కంట్రోల్‌లో ఉంచుకుని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అధిపతిగా ఉంటాడు. అయితే సూర్యవర్ధన్‌కు నమ్మకంగా ఉన్న ఐదు మంది గరుడను చంపి ఆ బంగారు గనులకు నాయకులుగా ఎదగాలని నిర్ణయించుకుంటారు.

రామకృష్ణ పవన్‌ చిన్న వయసులోనే తండ్రి లేకపోవడంతో తల్లి పెంపకంలోనే పెద్దవుతాడు. పద్నాలుగేళ్ల వయసుకే తల్లి క్యాన్సర్ వ్యాధితో చనిపోతుంది. పెద్ద హోదాలో బ్రతకాలంటే డబ్బు అవసరం అని తెలుసుకున్న రామకృష్ణ ముంబయి చేరుకుని అక్కడ షూ పాలిష్ చేస్తుంటాడు. ముంబైలో అలీ, శెట్టికి మధ్య అధిపత్య పోరు సాగుతుంటుంది. శెట్టి పక్షాన నిలబడ్డ రామకృష్ణ. రాకీగా ఎదుగుతాడు. ఎదిగే క్రమంలో రాకీ బలాన్ని తెలుసుకున్న రాజ్యవర్ధన్ తనను బెంగళూరుకి పిలిపిస్తాడు. గరుడను చంపే పనిని అప్పగిస్తాడు. బెంగళూరులో చంపడానికి ప్రయత్నించిన యష్ అవకాశాన్ని కోల్పోతాడు. అందుకే తనను చంపడానికి కె.జి.ఎఫ్ వెళతానంటాడు. రాజ్యవర్ధన్ అతని మనుషులు కూడా సరేనంటారు. కె.జి.ఎఫ్ రాకీ ఎలా ప్రవేశించి గరుడను. హతమార్చుతాడు. రాకీని అతి పెద్ద నేరస్థుడుగా భారత సైన్యంకి ఆదేశాలు జారీ చేసి అరెస్టు చేయాలని కొరుతుంది.[1]

బాక్స్ ఆఫీస్

[మార్చు]

అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాల జాబితా KGF ఒకటి. విడుదలైన మొదటి రోజున చాప్టర్ 1 కన్నా 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది, ఇది కన్నడ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యధికంగా ప్రారంభమైంది, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ చిత్రం రోజులో 5 కోట్ల రూపాయలు సంపాదించింది. మొదటి వారాంతపు వసూళ్లు దాదాపు అన్ని రూపాల నుండి ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల రూపాయలు వసూలు చేసింది., ఇది కన్నడ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో 100 కోట్ల మార్కును దాటి మొదటి చిత్రం అయింది. ఇది 50 రోజుల పాటు 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది, భారతీయ బాక్స్ ఆఫీసు వద్ద ఎనిమిది అత్యధిక వసూళ్లు చేసిన దక్షిణ భారతీయ చిత్రంగా నిలిచింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-05. Retrieved 2019-05-05.
  2. "Entertainment News, Bollywood News, Top Celebrity Entertainment TV News & Gossip".