కె.జి.రామనాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.జి.రామనాథన్
జననంనవంబరు 13, 1920
హైదరాబాదు, బ్రైటిష్ ఇండియా
మరణంమే 10, 1992 (వయస్సు 71)
ముంబాయి, భారతదేశము
నివాసంకొలాబా
పౌరసత్వంభారతీయులు
రంగములునంబర్ థియరీ
విద్యాసంస్థలుTIFR
చదువుకున్న సంస్థలుప్రైన్సెటన్ విశ్వవిద్యాలయం.
పరిశోధనా సలహాదారుడు(లు)ఎమిల్ ఆర్టిన్
డాక్టొరల్ విద్యార్థులుసి.పి.రామానుజన్
కనకనహళ్లి రామచంద్ర
ముఖ్యమైన పురస్కారాలుపద్మభూషణ

కొల్లగుంట గోపాల అయ్యర్ రామనాథన్ (నవంబరు 13, 1920 - మే 10, 1992) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆయన గణిత శాస్త్రంలోని "నంబర్ థియరీ"లో ప్రసిధ్దులు. ఆయన రచనలు భారతదేశంలో గణిత శాస్త్ర పరిశోధనల అభివృద్ధికి తోడ్పడినాయి.

జీవిత విశేషాలు[మార్చు]

కె.జి.రామనాథన్ దక్షిణ భారతదేశం లోని హైదరాబాదులో జన్మించారు. ఆయన హైదరాబాదు నిజాం కళాశాలలో బి.ఎ చదివారు.మద్రాసు లయోలా కాలేజి నుండి ఎం.ఎ (గణిత శాస్త్రం) ను 1942లో చేసారు.తొలుత అన్నామలై విశ్వవిద్యాలయంలో అసిస్టెంటు లెక్చరర్ గా (1945-46), హైదరాబాదు లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా (1947-48) పనిచేసి పి.హె.డి నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆయన అమెరికాలోని ప్రిన్సెటన్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పూర్తిచేసారు. ఆయన డాక్టరల్ అడ్వైజర్ "ఎమిల్ ఆర్టిన్". ఆయన ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో "హెర్మన్ వైల్", "కార్ల్ సైగెల్: లతొ కలసి పనిచేసారు. ఆయన 1951లో భారతదేశానికి తిరిగివచ్చి కొలాబా లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో కె.చంద్రశేఖరన్ బృందంలో పనిచేసారు.

ఆయన జయలక్ష్మీ రామనాథన్ ను వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు.వారు అనంత్, మోహన్. కె.జి.రామనాథన్ కు నలుగురు మనుమలు.

కెరీర్[మార్చు]

TIFR లో ఆయన భారతదేశంలో యువ గణితశాస్త్రవేత్తల బృందంతో కలసి "నంబర్ థియరీ"ని అనేక సంవత్సరాలపాటు అభివృద్ధి చేసారు. ఆయన శ్రీనివాస రామానుజన్ యొక్క ప్రచురించిన, ప్రచురితం కాని పనులపై ఆసక్తి చూపారు. ఆయన "ఆర్కా అరిథెమెటికా"కు 30 సంవత్సరముల పాటు ఎడిటోరియల్ సభ్యునిగా యున్నారు. ఆయన 1985 లోTIFR నుండి పదవీవిరమణ చేసారు.

అవార్డులు[మార్చు]

రామనాథన్ 30 సంవత్సరాల సర్వీసులో అనేక అవార్డులను పొందారు.

కొన్ని ప్రచురణలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

  1. "Hand book of santhiswaroop bhatnagar prize winners, Ramanathan, K Gopala - Quadratic form; Modular functions and discontinuous groups work on Ramanujan's notes" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2016-05-13.