Jump to content

కేశవ్ మహరాజ్

వికీపీడియా నుండి
కేశవ్ మహరాజ్
2019 లో యార్క్‌షైర్ తరఫున బౌలింగు చేస్తున్న మహరాజ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కేశవ్ ఆత్మానంద్ మహరాజ్
పుట్టిన తేదీ (1990-02-07) 1990 ఫిబ్రవరి 7 (వయసు 34)
డర్బన్, క్వాజులు నాటల్, దక్షిణాఫ్రికా హైస్కూల్: నార్త్‌వుడ్ బాయ్స్ హై స్కూల్
ఎత్తు179 cమీ. (5 అ. 10 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 327)2016 నవంబరు 3 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2023 మార్చి 8 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 120)2017 మే 27 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2023 జనవరి 29 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.16
తొలి T20I (క్యాప్ 94)2021 సెప్టెంబరు 10 - శ్రీలంక తో
చివరి T20I2022 నవంబరు 6 - నెదర్లాండ్స్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.16
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006–presentక్వాజులు-నాటల్
2009–presentడాల్ఫిన్స్
2018లాంకషైర్
2018–presentడర్బన్ హీట్
2019యార్క్‌షైర్
2023డర్బన్ సూపర్ జయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 49 27 25 155
చేసిన పరుగులు 1,129 159 69 3,965
బ్యాటింగు సగటు 15.68 14.45 13.80 20.22
100లు/50లు 0/5 0/0 0/0 2/17
అత్యుత్తమ స్కోరు 84 28 41 114*
వేసిన బంతులు 9,575 1,345 503 31,766
వికెట్లు 158 29 22 586
బౌలింగు సగటు 31.99 37.03 27.50 27.04
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 9 0 0 37
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0 8
అత్యుత్తమ బౌలింగు 9/129 3/25 2/21 9/129
క్యాచ్‌లు/స్టంపింగులు 16/– 4/– 12/– 58/–
మూలం: Cricinfo, 14 March 2023

కేశవ్ ఆత్మానంద్ మహరాజ్ (జననం 1990 ఫిబ్రవరి 7) దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ క్రికెటరు.

మహరాజ్ టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.

అతను 2006 [1] లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2016 నవంబరులో తొలి టెస్టు ఆడాడు.

అతను ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్, దిగువ వరుసలో ఆడే బ్యాటరు. దేశీయ క్రికెట్‌లో క్వాజులు-నాటల్, డాల్ఫిన్స్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

2021 జూన్‌లో, దక్షిణాఫ్రికా తరపున టెస్టు మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండవ బౌలర్‌గా మహరాజ్ నిలిచాడు. [2] 2021 సెప్టెంబరులో, శ్రీలంకతో జరిగిన రెండవ వన్‌డేలో, మహరాజ్ మొదటిసారి దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. [3] 2021 సెప్టెంబరులో మహరాజ్, శ్రీలంకపై తన T20I రంగప్రవేశం చేసాడు. ఆ మ్యాచ్‌లో అతను జట్టుకు నాయకత్వం కూడా వహించాడు.[4]

జీవితం తొలి దశలో

[మార్చు]

కేశవ్, డర్బన్ బీచ్‌లో ఆత్మానంద్, కాంచనమాల దంపతులకు జన్మించాడు. [5] అతని పూర్వీకులు భారతదేశం, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందినవారు. 1874 లో వారు డర్బన్‌ చేరుకున్నారు [5]

దేశీయ కెరీర్

[మార్చు]

2006-07లో క్వాజులు-నాటల్ తరపున 16 సంవత్సరాల వయస్సులో మహరాజ్ ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [6] అతను 2009-10లో డాల్ఫిన్స్ జట్టుకు పదోన్నతి పొందాడు.

2010 ఏప్రిల్-మేలో దక్షిణాఫ్రికా అకాడమీతో కలిసి మహరాజ్ బంగ్లాదేశ్‌లో పర్యటించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అకాడమీతో జరిగిన రెండు నాలుగు-రోజుల మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. అతను T20 మ్యాచ్‌లలో ఒకదానిలో బౌలింగ్‌ను ప్రారంభించి, నాలుగు ఓవర్లలో 12 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు. [7] అతను 2010-11లో పర్యాటక బంగ్లాదేశ్ A జట్టుపై దక్షిణాఫ్రికా A తరపున ఆడాడు.

2012–13 ఇప్పటివరకు మహరాజ్ బ్యాట్‌తో అత్యుత్తమ సీజన్. ఆ సీజనులో అతను, రెండు సెంచరీలతో సహా 48.10 సగటుతో 481 ఫస్ట్-క్లాస్ పరుగులు చేశాడు. [8] క్వాజులు-నాటల్ నార్తర్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను, 119 బంతుల్లో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో 12 పరుగులిచ్చి 5 వికెట్లు కూడా తీసుకున్నాడు.[9]


2014–15లో కేప్ కోబ్రాస్‌తో జరిగిన మ్యాచ్‌లో డాల్ఫిన్‌ల కోసం, మహరాజ్ తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌, మ్యాచ్ గణాంకాలను సాధించాడు: ఇన్నింగ్సులో 58కి 6, మ్యాచ్‌లో 145కి 10. ఆ మ్యాచ్‌ డాల్ఫిన్స్ గెలిచింది, అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. [10] అతను 26.18 సగటుతో 44 ఫస్టు క్లాస్ వికెట్లతో ఆ సీజన్‌ను ముగించాడు. [11]

2013లో మహరాజ్, సస్సెక్స్ ప్రీమియర్ లీగ్‌లో కక్‌ఫీల్డ్ తరపున ఆడాడు. 2015 లో లాంక్షైర్ లీగ్‌లో నెల్సన్ ప్రొఫెషనల్‌గా ఆడాడు.[12] 2015 ఆఫ్రికా T20 కప్ కోసం క్వాజులు-నాటల్ క్రికెట్ జట్టులోకి అతన్ని తీసుకున్నారు.[13]

2016-17 సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో, వారియర్స్‌తో డాల్ఫిన్స్ తరఫున ఆడుతూ, మహరాజ్ 72 పరుగులు చేశాడు. ఆపై డాల్ఫిన్స్‌కు ఇన్నింగ్స్ విజయంలో 89 పరుగులకు 7, 68 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. అతను ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, ఒక మ్యాచ్‌లో 13 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. . [14]

2018 అక్టోబరులో, మజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషన్ కోసం డర్బన్ హీట్ జట్టులో మహరాజ్ ఎంపికయ్యాడు. [15] [16]

2018లో లాంక్షైర్ తరపున ఆడిన తర్వాత మహరాజ్, 2019 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యార్క్‌షైర్ తరపున ఐదు మ్యాచ్‌లు ఆడాడు, 18.92 సగటుతో 38 వికెట్లు పడగొట్టాడు. దాంతో జట్టు 5వ స్థానంలో నిలిచింది. [17]

2019 సెప్టెంబరులో, 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం డర్బన్ హీట్ జట్టు కోసం మహరాజ్ జట్టులో ఎంపికయ్యాడు. [18] 2021 ఏప్రిల్లో, అతను దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు క్వాజులు-నాటల్ జట్టులో ఎంపికయ్యాడు. [19]

2023 ఫిబ్రవరి 27న, అతను LV= కౌంటీ ఛాంపియన్‌షిప్, వైటాలిటీ t20 బ్లాస్టు పోటీల కోసం విదేశీ రిజిస్ట్రేషన్‌పై మిడిల్‌సెక్స్‌లో చేరాడు.

అకిలెస్ స్నాయువు గాయం కారణంగా అతను తరువాత వైదొలగవలసి వచ్చింది.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2016 అక్టోబరులో, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో మహరాజ్ ఎంపికయ్యాడు. అతను 2016 నవంబరు 3న ఆస్ట్రేలియన్‌తో తన తొలి టెస్టు ఆడి, మూడు కీలక వికెట్లు తీయడం ద్వారా మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. [20] అతను పెర్త్‌లో టెస్టుల్లో టెస్టు రంగప్రవేశం చేసిన మొదటి స్పెషలిస్టు స్పిన్నర్. [21]

2017 మార్చి 10న, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, మహరాజ్ టెస్టుల్లో తన తొలి ఐదు వికెట్ల పంటను సాధించాడు. [22] న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌కి ఇది ఏడవది.[23]

2017 ఏప్రిల్లో, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్, 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో మహరాజ్ ఎంపికయ్యాడు. [24] [25] అతను 2017 మే 27న ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా తరపున తన వన్‌డే ప్రవేశం చేసాడు [26]

2017 మేలో క్రికెట్ సౌతాఫ్రికా వార్షిక అవార్డులలో మహరాజ్ అంతర్జాతీయ నూతన సంవత్సర క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. [27] 2017 అక్టోబరులో, బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో, టెస్టుల్లో తన 50వ వికెట్‌ను తీసుకున్నాడు. [28]

2018 జూలైలో, శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో, మహరాజ్ 129 పరుగులకు 9 వికెట్లు తీసుకుని తన అత్యుత్తమ టెస్టు బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. శ్రీలంకలో టెస్టు ఇన్నింగ్స్‌లో పర్యాటక బౌలరు సాధించిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలవి.[29] అతను దక్షిణాఫ్రికా తరఫున ఆసియాలో ఆడుతూ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కూడా నమోదు చేశాడు. [30] [31] అతని 129 పరుగులకు 9 వికెట్లు హ్యూ టేఫీల్డ్ తర్వాత ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు సాధించిన రెండవ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించినప్పటి నుండి దక్షిణాఫ్రికాకు చెందిన అత్యుత్తమ టెస్టు బౌలింగ్ గణాంకాలవి.[32] [33] రంగనా హెరాత్ తర్వాత టెస్టు ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన రెండో ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా నిలిచాడు. [34]


2018 ఆగష్టులో, శ్రీలంకతో జరిగిన ఏఖైక మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో మహరాజ్ ఎంపికయ్యాడు గానీ అతను మ్యాచ్‌లో ఆడలేదు. [35]

2019 అక్టోబరులో, భారత్‌తో జరిగిన సిరీస్‌లో, మహరాజ్ టెస్టు క్రికెట్‌లో తన 100వ వికెట్‌ను తీసుకున్నాడు. [36]

2020 నవంబరులో, ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టులో మహరాజ్ ఎంపికయ్యాడు. [37] [38]

2021 జూన్ 21న, దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌లో చేసిన పర్యటనలో రెండవ టెస్టు మ్యాచ్ నాల్గవ రోజున, 1960లో లార్డ్స్‌లో జియోఫ్ గ్రిఫిన్ తర్వాత, మహరాజ్ దక్షిణాఫ్రికా యొక్క రెండవ టెస్టు హ్యాట్రిక్ సాధించాడు. [39] [40] అప్పటి వరకూ T20Iలలో ఆడనప్పటికీ, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు దక్షిణాఫ్రికా జట్టులో మహరాజ్‌ను ఎంపిక చేశారు. [41] [42] అతను 2021 సెప్టెంబరు 10న శ్రీలంకపై, జట్టు కెప్టెన్‌గా తన తొలి T20I ఆడాడు.[43] T20Iలలో తన మొదటి బంతికే వికెట్ తీసుకున్నాడు. [44] శ్రీలంకతో వన్‌డే సిరీస్‌ను 2-1తో కోల్పోయిన దక్షిణాఫ్రికా, 3-0తో టి20 సిరీస్‌ను గెలుచుకోవడంలో అతను దోహదపడ్డాడు.[45]

మూలాలు

[మార్చు]
  1. "Keshav Maharaj: The foodie who smashed the colour barrier". Hindustan Times (in ఇంగ్లీష్). 2016-11-03. Retrieved 2021-09-14.
  2. "Keshav Maharaj takes SA's first Test hat-trick in more than 60 years as Proteas eye victory". News24. Retrieved 21 June 2021.
  3. "South Africa need a spin intervention against improving Sri Lanka". ESPN Cricinfo. Retrieved 4 September 2021.
  4. Mjikeliso, Sibusiso. "Proteas skipper Keshav Maharaj on dream T20 debut: 'My team-mates made my job easy'". Sport. Retrieved 2021-09-14.
  5. 5.0 5.1 "Forefathers of cricketer Keshav Maharaj came to South Africa as indentured labourers - Mumbai Mirror". mumbaimirror.indiatimes.com. Archived from the original on 2018-01-15.
  6. "Keshav Maharaj lives his father's dream". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-09-14.
  7. "South Africa Academy in Bangladesh 2010". CricketArchive. Retrieved 25 March 2015.
  8. "Batting in each season by Keshav Maharaj". CricketArchive. Retrieved 25 March 2015.
  9. "Northerns v KwaZulu-Natal 2012–13". CricketArchive. Retrieved 25 March 2015.
  10. "Cape Cobras v Dolphins 2014–15". CricketArchive. Retrieved 25 March 2015.
  11. "Bowling in each season by Keshav Maharaj". CricketArchive. Retrieved 25 March 2015.
  12. "South African all rounder signs as Nelson's pro for 2015 season". Pendle Today. Archived from the original on 3 ఏప్రిల్ 2015. Retrieved 25 March 2015.
  13. KwaZulu-Natal Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  14. "Warriors v Dolphins 2016–17". Cricinfo. Retrieved 8 October 2016.
  15. "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
  16. "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
  17. Booth, Lawrence, ed. (2020). Wisden Cricketers' Almanack 2020 (157th ed.). London, UK: Bloomsbury. p. 717. ISBN 978-1-4729-7288-0. OCLC 1105153124.
  18. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 September 2019. Retrieved 4 September 2019.
  19. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.
  20. "South Africa tour of Australia, 1st Test: Australia v South Africa at Perth, Nov 3-7, 2016". ESPN Cricinfo. Retrieved 3 November 2016.
  21. "Maharaj - first spin debutant at Perth". ESPN Cricinfo. Retrieved 3 November 2016.
  22. "Honours even after Williamson's hundred". ESPN Cricinfo. Retrieved 10 March 2017.
  23. "A rare hundred, a rarer five-for". ESPN Cricinfogff. Retrieved 10 March 2017.
  24. "South Africa picks Morkel for ICC Champions Trophy 2017". International Cricket Council. 19 April 2017. Retrieved 19 April 2017.
  25. "Morkel, Maharaj in South Africa squad". ESPN Cricinfo. Retrieved 19 April 2017.
  26. "South Africa tour of England, 2nd ODI: England v South Africa at Southampton, May 27, 2017". ESPN Cricinfo. Retrieved 27 May 2017.
  27. "De Kock dominates South Africa's awards". ESPN Cricinfo. Retrieved 14 May 2017.
  28. "New-look SA attack takes on weakened tourists". ESPN Cricinfo. Retrieved 5 October 2017.
  29. Staff, CricketCountry (2018-07-20). "Keshav Maharaj stuns SL with 8/116". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 20 July 2018.
  30. "SL 277-9: Keshav Maharaj's eight wickets throttles Sri Lanka". SA Cricket | OPINION | PLAYERS | TEAMS | FEATURES | SAFFAS ABROAD (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-20. Retrieved 20 July 2018.
  31. "Live Cricket Score: Sri Lanka vs South Africa, 2nd Test, Day 1, Colombo, Maharaj creates historical moment with 8 wicket haul". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 20 July 2018.
  32. "Maharaj's nine-for: South Africa's second-best". ESPNcricinfo. Retrieved 22 July 2018.
  33. "Bowling records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo". Cricinfo. Retrieved 22 July 2018.
  34. "Bowling records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo". Cricinfo. Retrieved 22 July 2018.
  35. "Chance for South Africa to finish Sri Lanka tour on a high". International Cricket Council. Retrieved 13 August 2018.
  36. "Keshav Maharaj Gets His 100th Wicket Dismissing Ajinkya Rahane During IND vs SA, 2nd Test 2019 Day 2". Latestly. Retrieved 11 October 2019.
  37. "Uncapped Glenton Stuurnman in South Africa white-ball squads". ESPN Cricinfo. Retrieved 6 November 2020.
  38. "CSA name Proteas squad for inbound England tour". Cricket South Africa. Retrieved 6 November 2020.[permanent dead link]
  39. "Keshav Maharaj Becomes First South African to Take a Test Hat-Trick Since 1960, Achieves Feat During WI vs SA 2nd Test Day 4". Latestly. Retrieved 21 June 2021.
  40. "Keshav Maharaj takes hat-trick against West Indies in second Test, becomes 2nd South African to accomplish this feat". SportsTiger. Retrieved 21 June 2021.
  41. "T20 World Cup: South Africa leave out Faf du Plessis, Imran Tahir and Chris Morris". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
  42. "Morris, du Plessis miss out, Maharaj included in South Africa's T20 World Cup squad". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-14.
  43. "1st T20I (N), Colombo (RPS), Sep 10 2021, South Africa tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 10 September 2021.
  44. "Collective effort helps South Africa take 1-0 series lead". International Cricket Council. Retrieved 10 September 2021.
  45. "Openers demolish Sri Lanka after bowling strangle as South Africa sweep series". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-09-14.