కేశినేని నాని

వికీపీడియా నుండి
(కేశినేని శ్రీనివాస్ (నాని) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కేశినేని నాని (శ్రీనివాస్)
కేశినేని నాని


లోక్‌సభ సభ్యుడు
ముందు లగడపాటి రాజగోపాల్
నియోజకవర్గం విజయవాడ
పదవీ కాలం
2014 మే 16 - 2019 జూన్ 16
పదవీ కాలం
2019 జూన్ 12 - 2024 జనవరి 10

వ్యక్తిగత వివరాలు

జననం (1966-01-22) 1966 జనవరి 22 (వయసు 58)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ వైకాపా, తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కేశినేని పావని
సంతానం 2
నివాసం విజయవాడ
వెబ్‌సైటు https://mpvijayawada.com

కేశినేని నాని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయవేత్త, వ్యాపారవేత్త. [1] ఇతని అసలు పేరు కేశినేని శ్రీనివాస్. అతను 17 వ లోక్‌సభలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[1]

ప్రారంభ, వ్యక్తిగత జీవితం

[మార్చు]

కేశినేని నాని 1966 జనవరి 22 న విజయవాడలో కేశినేని రామస్వామి, ప్రసూనాంబ దంపతులకు జన్మించాడు. అతని బాల్యమంతా తన తోబుట్టువులతో కలిసి విజయవాడ నగరంలోనే గడిపాడు.అతను 1992 ఏప్రిల్ 16న పావనిను (ఎంఎల్ఎ) వివాహం చేసుకున్నాడు. నాని, కేశినేని దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

జీవిత గమనం

[మార్చు]

రాజకీయ జీవితం

[మార్చు]

నాని మొదటగా 2008 అక్టోబరు 26న ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. అతను ప్రజా రాజ్యం పార్టీకి 3 నెలలు మాత్రమే తన సేవలను కొనసాగించాడు.2009 జనవరిలో దానిని విడిచిపెట్టాడు. ఆ తర్వాత అతను 2009లో తెలుగుదేశం పార్టీలో 2009 చేరాడు. 2014 సాధారణ ఎన్నికలలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంటు సభ్యునిగా పోటీచేసి గెలుపొందాడు. 2019 సాధారణ ఎన్నికలలో తిరిగి అదే నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. 17 వ లోక్‌సభలో సభ్యుడిగా ఉన్న నాని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడుగా ఉన్నాడు.[2] అంతకు ముందు ప్రివిలేజెస్ కమిటీ, అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాడు.

తెదేపాలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కేశినేని నాని 2024 జనవరి 10 న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికీ రాజీనామా చేశాడు.[3] ఆ తరువాత వైకాపాలో చేరి 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి, స్వయానా తమ్ముడూ అయిన కేశినేని శివనాథ్‌ చేతిలో 2,82,085 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] ఆ తరువాత, జూన్ 10 న, ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.[5][6]

రాజకీయేతర జీవితం

[మార్చు]

కేశినేని ట్రావెల్స్ ను కేశినేని నాని తాత కేశినేని వెంకయ్య 1928 లో ప్రారంభించాడు. అది 90 సంవత్సరాల నుండి వారసత్వంగా నడుపుతున్న కేశినేని ట్రావెల్స్ ను 2018 మార్చి 31న మూసివేశాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Lok Sabha Profile of Kesineni Srinivas (Nani)".
  2. Bandari, Pavan Kumar (2019-12-10). "Centre appoints TDP MP Kesineni Nani as member of ICMR committee". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-22.
  3. Andhrajyothy (10 January 2024). "టీడీపీకి, లోక్‌సభ సభ్యత్వానికి కేశినేని రాజీనామా". Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.
  4. The News Minute (4 June 2024). "Lok Sabha polls: Two-time ex-TDP MP Kesineni Nani loses to brother in Vijayawada" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  5. Hindustantimes Telugu (10 June 2024). "కేశినేని నాని కీలక నిర్ణయం-రాజకీయాలకు గుడ్ బై". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  6. EENADU (10 June 2024). "రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన కేశినేని నాని". Retrieved 10 June 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]