కైగల్ జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కైగల్ జలపాతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిత్తూరు జిల్లాలో వున్నది.

ఉనికి[మార్చు]

ఈ జలపాతం కైగల్ గ్రామానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది సముద్ర మట్టానికి 633 మీటర్లు ఎత్తులో వున్నది. (2,079 అడుగులు) స్థానికంగాదీనిని దుముకు జలపాతాలు అంటారు. ఇక్కడి నీరు రాళ్లపైనుండి దుముకుతూ క్రింద పడుతుండడము వలన దీనికి ఆ పేరు వచ్చింది.

విశేషాలు[మార్చు]

ఇది సహజ జలపాతం. 40 అడుగుల ఎత్తులో ఒక పెద్ద రాయి నుండి వస్తుంది. ఇది ఎల్లవేళలా ప్రవహిస్తుంటుంది. కాని వర్షాకాల సమయములో ఇందులో ప్రవాహము ఎక్కువగా వుంటుంది. జలపాతం క్రింద అనేక సహజ కొలనులు ఉన్నాయి. ఇది ఒక అరణ్య ప్రాంతము గనుక, అక్కడి వృక్షాలు, కొండలు, పక్షులు ప్రకృతి దీని అందాన్ని ఇనుమడింప జేస్తున్నది. ఇది కైగల్ ప్రవాహం ద్వారా ఏర్పడుతున్నది. కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రవహించే రెండు ప్రవాహాలలో ఇది ఒకటి. రెండోది కౌండిన్య . ఇది తీర్థం పంచాయితి, బైరెడ్డి పల్లి మండల క్రింద వస్తాయి.

ఈ జలపాతాన్నివర్షాకాలం జూన్ నుండి అక్టోబరు మద్యన సందర్శించడానికి చాల బాగుంటుంది. ఈ పరిసర ప్రాంతాలు మంచి పిక్ నిక్ ప్రదేశము. ఈ జలపాతం దేవదొడ్డి, కైగల్ గ్రామం మధ్యలో ఉంది. కైగల్ వరకు బస్సులో వెళ్ళవచ్చు. . ఇక్కడ నుండి, ఒక దాదాపు రెండు కిలోమీటర్ల దట్టమైన అరణ్యంలో కాలినడక దారిలో నడవాలి. అక్కడే ఈ జలపాతం వున్నది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]