Jump to content

కే.కే. మహేందర్ రెడ్డి

వికీపీడియా నుండి
(కొండం కరుణ మహెందేర్రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
కే.కే. మహేందర్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1961 జులై 10
నామాపూర్, ముస్తాబద్ మండలం, రాజన్న జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కే నారాయణ రెడ్డి , అహల్య
జీవిత భాగస్వామి పద్మ
వృత్తి తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు

కోండం కర్ణ మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[2][3] 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండం కరుణ మహేందర్ రెడ్డి గారు 59,557 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు.[4]

బాల్యం మరియు విద్యాభ్యాసం

[మార్చు]

కేకే మహేందర్ రెడ్డి పూర్తి పేరు కొండం కరుణ మహేందర్ రెడ్డి. ఆయన స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం. 1961 జూలై 10 నాడు కొండం నారాయణరెడ్డి అహల్య దంపతులకు మహేందర్ రెడ్డి గారు జన్మించారు. నారాయణరెడ్డి కి మొత్తం ఆరుగురు సంతానం, మహేందర్ రెడ్డి అందరికంటే చిన్నవారు. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. మహేందర్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం ఆయన స్వగ్రామం నామాపూర్ లో జరిగింది. అక్కడ ఏడవ తరగతి వరకు మాత్రమే ఉండేది, దీంతో ఆయన ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు, స్కూల్ కు వెళ్లేందుకు ప్రతిరోజు నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది దీంతో 9వ తరగతిలో టిసి తీసుకొని వేరే స్కూల్లో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా దేవరుప్పల గ్రామంలో 9 ,10 తరగతి చదువుకున్నారు. పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం సిద్దిపేట జూనియర్ కాలేజీలో చేరారు. మహేందర్ రెడ్డి అనంతరం 1980 - 83 మధ్య సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో డిగ్రీని చదువుకున్నారు.  PDSU విద్యార్థి సంఘంలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు. 1983లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో MSc ఆంత్రోపాలాజీ లో చేరారు. అదే సమయంలో సివిల్స్ పరీక్ష కూడా రాశారు. ప్రిలిమ్స్ లో ఎంపికై మెయిన్స్ వరకు వెళ్లారు. తర్వాత ఎంఎస్సీ చివరి సంవత్సరంలో డిస్కంటిన్యూ చేసి "లా" చదవడం కోసం 1986లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు.1989లో ఆయన న్యాయ శాస్త్ర పట్టా అందుకున్నారు. అనంతరం అదే సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు, అప్పటినుంచి న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతున్నారు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

కే.కే. మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో, పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో సిరిసిల్ల నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ పై 171 ఓట్ల స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత ఆగస్టు 4న పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2010లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ చేతిలో ఓడిపోయాడు.

కే.కే. మహేందర్ రెడ్డి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2011లో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత 2018, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల నుండి పోటీ చేసి 29 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (10 November 2023). "పట్టు వదలని విక్రమార్కులు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. Eenadu (17 November 2023). "కేటీఆర్‌-హరీశ్‌ మెజారిటీ పోటీ". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  3. Eenadu (25 November 2023). "ఓట్లు కొల్లగొట్టారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
  4. https://results.eci.gov.in/AcResultGenDecNew2023/statewiseS296.htm
  5. కొవ్వూరు, రాజు (august 2023). నిలువెత్తు నిజాయితీపరుడు కేకే మహేందర్ రెడ్డి. hyderabad. p. 26. {{cite book}}: Check date values in: |year= (help)