Jump to content

కొమ్ము పాపయ్య

వికీపీడియా నుండి
కొమ్ము పాపయ్య

శాసనసభ్యుడు
పదవీ కాలం
1978 – 1983
నియోజకవర్గం రామన్నపేట నియోజకవర్గం, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

మరణం సెప్టెంబర్ 6, 2017
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్
నివాసం హైదరాబాద్, తెలంగాణ
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

కొమ్ము పాపయ్య తెలంగాణ రాష్ట్రంకు చెందిన చెందిన మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు. 1978, 1983లో రామన్నపేట నియోజకవర్గం నుంచి భారతీయ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడమేకాకుండా, 1983లో అంజయ్య మంత్రివర్గంలో విద్యుత్తు శాఖ మంత్రిగా నెల రోజులు పనిచేశాడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

పాపయ్య యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూర్ మండలం, బొడ్డుగూడెం లోని కొమ్ము రామయ్య, రామక్కలకు జన్మించాడు. బొడ్డుగూడెం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న పాపయ్య, భువనగిరి లో పీయూసీ, హైదరాబాద్ లోని నిజాం కళాశాల లో డిగ్రీ పూర్తిచేశాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం లో న్యాయశాస్త్రం చదివాడు

కుటంబం

[మార్చు]

పాపయ్య యాదవ్‌కు భార్య భారతమ్మ, కుమారులు వాసు నారాయణ, జగన్మోహన్, కూతురు ప్రభావతి ఉన్నారు. చిన్నకుమారుడు జగన్మోహన్ అమెరికాలో సాప్గ్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, పెద్దకుమారుడు హైద్రాబాద్‌లో వ్యాపారం చేస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలు కలిగిన పాపయ్య కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడు. దాంతో కాంగ్రెస్ పార్టీ 1978 అసెంబ్లీ ఎన్నికల్లో పాపయ్యను రామన్నపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి గుర్రం యాదగిరి రెడ్డి పై విజయం సాధించాడు. 1983లో అదే నియోజకవర్గం నుండి సీపీఐ అభ్యర్థి కె. సుశీలదేవి పై గెలుపొంది, అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య మంత్రివర్గంలో విద్యుత్తు శాఖ మంత్రిగా నెలరోజులు పనిచేసాడు. ఇందిరాగాంధీ అనుచరుడిగా ఉన్న పాపయ్య, హకా కార్పొరేషన్ ఛైర్మెన్ గా, నేషనల్ సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేసాడు.

మరణం

[మార్చు]

అనారోగ్యంతో పాపయ్య హైదరాబాద్‌ లోని నాగోల్ లోగల తన స్వగృహంలో 2017, సెప్టెంబర్ 6 న మరణించాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (27 November 2023). "ఒక నెల మంత్రి". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  2. నమస్తే తెలంగాణ. "మాజీ మంత్రి పాపయ్య కన్నుమూత". Retrieved 13 September 2017.[permanent dead link]
  3. ఆంధ్రజ్యోతి. "మాజీ మంత్రి కొమ్ము పాపయ్య మృతి". Archived from the original on 11 April 2020. Retrieved 13 September 2017.
  4. మన తెలంగాణ. "మాజీ మంత్రి కొమ్ము పాపయ్య మృతి". Archived from the original on 11 September 2017. Retrieved 13 September 2017.