Jump to content

అడ్డగూడూర్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°24′00″N 79°22′35″E / 17.400012°N 79.376403°E / 17.400012; 79.376403
వికీపీడియా నుండి
అడ్డగూడూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, అడ్డగూడూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, అడ్డగూడూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, అడ్డగూడూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°24′00″N 79°22′35″E / 17.400012°N 79.376403°E / 17.400012; 79.376403
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం అడ్డగూడూర్
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 142 km² (54.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 25,849
 - పురుషులు 12,901
 - స్త్రీలు 12,948
పిన్‌కోడ్ 508277

అడ్డగూడూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం.[1] అడ్డగూడూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 47 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.its a very good village in ever[3]

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు

[మార్చు]

లోగడ అడ్డగూడూర్ గ్రామం నల్గొండ జిల్లా భువనగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని మోతుకూరు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అడ్డగూడూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+10 (పదకొండ) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

ఈ మండల వైశాల్యం 142 చ.కి.మీ. కాగా, జనాభా 25,849. జనాభాలో పురుషులు 12,901 కాగా, స్త్రీల సంఖ్య 12,948. మండలంలో 6,618 గృహాలున్నాయి.[5]

మండలంలోని ప్రముఖులు

[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. జానకిపూర్
  2. చిన్నపడిశాల
  3. వెల్దేవి
  4. రేపాక (పి) దాచారం
  5. కంచనపల్లి
  6. అడ్డగూడూర్
  7. చౌల్ల రామారం
  8. ధర్మారం
  9. సింగారం (పి) వెల్దేవి
  10. చిర్రగూడూర్
  11. కోటమర్తి

రెవెన్యూ గ్రామాలు కాని గ్రామాలు

[మార్చు]
  1. బొడ్డుగూడెం

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. Eenadu (15 February 2024). "యాదాద్రి జిల్లా వాసికి నాలుగు గిన్నిస్‌ రికార్డులు". Archived from the original on 15 February 2024. Retrieved 15 February 2024.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-20.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]