Jump to content

తుర్కపల్లి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°40′50″N 78°48′56″E / 17.680662°N 78.81546°E / 17.680662; 78.81546
వికీపీడియా నుండి
తుర్కపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, తుర్కపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, తుర్కపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, తుర్కపల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°40′50″N 78°48′56″E / 17.680662°N 78.81546°E / 17.680662; 78.81546
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం తుర్కపల్లి
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 33,797
 - పురుషులు 17,014
 - స్త్రీలు 16,783
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.52%
 - పురుషులు 62.39%
 - స్త్రీలు 36.24%
పిన్‌కోడ్ 508116


తుర్కపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] తుర్కపల్లి, ఈ మండలానికి కేంద్రం. ఇది భువనగిరి పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మండల గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 33,797 - పురుషులు 17,014 - స్త్రీలు 16,783. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 186 చ.కి.మీ. కాగా, జనాభా 33,797. జనాభాలో పురుషులు 17,014 కాగా, స్త్రీల సంఖ్య 16,783. మండలంలో 8,008 గృహాలున్నాయి.[3]

మండలంలోని ఆలయాలు

[మార్చు]

మండలంలోని వెంకటాపురంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. సుప్రసిద్ధ యాత్రా స్థలం యాదగిరిగుట్ట ఇక్కడికి 14 కి.మీ.దూరంలో ఉంది

మండలంలోని ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  • తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్), జర్నలిస్టు
  • బోరెడ్డి అయోధ్యరెడ్డి - ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో)[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. Andhrajyothy (13 December 2023). "సీఎం సీపీఆర్వోగా అయోధ్యరెడ్డి". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.