Jump to content

తీన్మార్ మల్లన్న

వికీపీడియా నుండి
చింతపండు నవీన్ కుమార్
తీన్మార్ మల్లన్న


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జూన్ 2024 - 29 మార్చి 2027
ముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 17 జనవరి 1982
మాధాపురం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ
తల్లిదండ్రులు చింతపండు భాగయ్య
జీవిత భాగస్వామి కొండాపురం మాతమ్మ
సంతానం 2
నివాసం హైదరాబాద్
వృత్తి జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు

తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన 1982 జనవరి 17న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

తీన్మార్ మల్లన్న ఎన్ టీవీ, ఐ న్యూస్ వంటి ఛానెల్స్ లో పనిచేసి 2012లో వి6 న్యూస్లో ప్రసారమైన తీన్మార్ వార్తల ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు. అనంతరం 10 టీవీలో కొంతకాలం పనిచేసి సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

తీన్మార్ మల్లన్న వి6 న్యూస్ ఛానల్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం - వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు.[1] తీన్మార్ మల్లన్న 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ - ఖమ్మం - వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యాడు.[2][3][4][5] తీన్మార్ మల్లన్న 2021 డిసెంబరు 7న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6][7][8]

తీన్మార్ మల్లన్న 2023 నవంబర్ 8న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[9] ఆయన 2024లో జరిగిన వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[10][11][12][13]

తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభలో తీన్మార్ మల్లన్న

పాదయాత్ర

[మార్చు]

తీన్మార్ మల్లన్న 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి రెండు సంవత్సరాల ప్రజల్లోనే ఉంటానని 2021, జూలై 18న ఘటకేసర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రకటించాడు.[14]

అరెస్ట్

[మార్చు]

హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు 2021 ఆగస్టు 27న తీన్మార్​ మల్లన్నను అరెస్ట్ చేశారు.[15]

మూలాలు

[మార్చు]
  1. The News Minute (9 October 2019). "Meet 'Teenmaar Mallanna,' the journalist taking on TRS and Cong in Huzurnagar bye-poll" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  2. Sakshi (21 March 2021). "ఓడి.. గెలిచిన తీన్మార్‌ మల్లన్న". Archived from the original on 26 July 2021. Retrieved 26 July 2021.
  3. Sakshi (19 March 2021). "ఎమ్మెల్సీ కౌంటింగ్‌: మూడో ప్రాధాన్యం తప్పదా?". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  4. The Times of India (20 March 2021). "Teenmar show: Mallanna dances up a vote storm | Hyderabad News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  5. V6 Velugu (21 March 2021). "దొరల పాలన ఖతం చేస్తం" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (8 December 2021). "బీజేపీలో చేరిన తీన్మార్‌ మల్లన్న". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
  7. Eenadu (7 December 2021). "భాజపాలో చేరిన తీన్మార్‌ మల్లన్న". Archived from the original on 2021-12-07. Retrieved 8 December 2021.
  8. V6 Velugu (9 November 2023). "కాంగ్రెస్​లో చేరిన తీన్మార్​ మల్లన్న .. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ!". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023. {{cite news}}: zero width space character in |title= at position 10 (help)CS1 maint: numeric names: authors list (link)
  9. Hindustantimes Telugu (8 November 2023). "కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  10. EENADU (7 June 2024). "పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్‌ మల్లన్న విజయం". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  11. The Hindu (8 June 2024). "Mallanna wins graduate MLC seat even as Rakesh Reddy gives tough fight" (in Indian English). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  12. Andhrajyothy (8 June 2024). "పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  13. ABP Desham (8 June 2024). "పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  14. EENADU (18 July 2021). "తెలంగాణలో తీన్మార్‌ మల్లన్న పాదయాత్ర". EENADU. Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  15. V6 Velugu (27 August 2021). "తీన్మార్ మల్లన్న అరెస్ట్" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)