కొలకలూరు రామశేషశర్మ
స్వరూపం
కొలకలూరు రామశేషశర్మ, సుప్రసిద్ధ రంగస్థల నటులు.
జననం
[మార్చు]వీరు 1948లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కొలకలూరు లో జన్మించారు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]చిన్నవయసులోనే దొంగవీరుడు నాటకంలో మురళి పాత్రతో రంగప్రవేశం చేశారు. కళాశాల విధ్యను ముగించుకొని పూర్తిస్థాయిలో నాటకరంగానికి వచ్చారు.
1983లో కొలకలూరు లో 'శివశేషసాయి నాట్యమండలి' స్థాపించి అనేక పౌరాణిక నాటకాలు వేవారు.
వల్లూరి వెంకట్రామయ్య చౌదరి దగ్గర మాయల ఫకీరు పాత్రను నేర్చుకుని అనేక చోట్ల ఏకపాత్రాభినయం చేశారు. ప్రస్తుతం కొలకలూరు లో వైధ్య వృత్తి చేసుకుంటూ వీలున్నప్పుడు నాటకాలలో పాల్గొంటున్నారు.
నటించిన నాటకాలు
[మార్చు]- దొంగవీరుడు (మురళి)
- రైతుబిడ్డ
- చిల్లరకొట్టు చిట్టెమ్మ
- నటనాలయం
- ఎవరుదొంగ
- నటన
- సమాధికట్టిస్తాం చందాలివ్వండి
- మోహినీ భస్మాసుర (భస్మాసుర)
- సత్యహరిశ్చంద్ర (విశ్వామిత్రుడు, కాలకౌశికుడు)
- మహర్షి-యోహాన్ (ఫిలిప్ రాజు, మహామంత్రి)
మూలాలు
[మార్చు]- కొలకలూరు రామశేషశర్మ, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 227.