కొల్లూరి సోమశంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొల్లూరి సోమశంకర్
కొల్లూరి సోమశంకర్
జననం
కొల్లూరి సోమశంకర్

(1973-09-04) 1973 సెప్టెంబరు 4 (వయసు 50)[1]
ఇతర పేర్లుశంకర్‌నాగ్
విద్యబి.ఎ.,
హ్యూమన్ రీసోర్స్ డెవెలప్‌మెంట్‌లో పి.జి.డిప్లొమా
క్రియాశీల సంవత్సరాలు1998 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు రచయిత,
అనువాదకుడు
జీవిత భాగస్వామివడ్లమాని నాగమణి
పిల్లలుశుభద,
అనన్య
తల్లిదండ్రులు
 • కొల్లూరి రవిరామచంద్రబోసు (తండ్రి)
 • వరలక్ష్మి (తల్లి)
వెబ్‌సైటుhttp://www.teluguanuvadam.com

కొల్లూరి సోమశంకర్ కథారచయిత, అనువాదకుడు. ఇతడు హిందీ, ఇంగ్లీషు భాషలనుండి తెలుగులోనికి, తెలుగు నుండి హిందీలోనికి కథలను అనువదించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

కొల్లూరి సోమశంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించాడు. ఇతని చదువు హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో సాగింది. ఇతడు బి.ఎ. చదివాక "మానవ వనరుల అభివృద్ధి" అనే అంశంపై స్నాతకోత్తర డిప్లొమా చేశాడు.[2] హిందీలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి భాషాప్రవీణ పట్టాను పొందాడు.[3] ప్రస్తుతం హైదరాబాదులో ఒక అంతర్జాల పత్రికలో పనిచేస్తున్నాడు.

రచనలు[మార్చు]

ఇతడు 1998 నుండి రచనలు చేయడం మొదలు పెట్టాడు. ఇతడు మొదట ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలో కెరీర్ ఎక్స్‌ప్రెస్ అనే పేజీలో "జనరల్ అవేర్‌నెస్" అనే శీర్షికను కొంతకాలం నిర్వహించాడు[4].అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కెరీర్ గైడ్ పేజీలో "కరెంట్ ఎఫైర్స్" శీర్షికను, ఆంధ్రభూమి దినపత్రికలో సాధన పేజీలో "అరిథ్‌మెటిక్", "అంతర్జాతీయ అంశాలు" అనే శీర్షికలను నిర్వహించాడు[4]. ఇతడు 40కి పైగా స్వంత కథలు, 116 అనువాద కథలు వ్రాశాడు. పుస్తక పరిచయాలు, సమీక్షలు చేస్తుంటాడు. ఏడు పుస్తకాలను ప్రచురించాడు.

స్వంత రచనలు[మార్చు]

ఇతడు మొదట పిల్లల కథలు కొన్ని వ్రాశాడు. ఆ కథలు "బాలజ్యోతి" మాసపత్రికలోను, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలోను ప్రచురితమయ్యాయి[4]. తరువాత 2001 నుండి వివిధ పత్రికలలో, అంతర్జాల పత్రికలలో కథలను వ్రాయడం ప్రారంభించాడు. ఇతని కథలు స్వాతి, నవ్య, ఆంధ్రప్రభ, చినుకు, ఆంధ్రభూమి, ప్రజాశక్తి, వార్త, ఈనాడు, ప్రియదత్త మొదలైన పత్రికలలోను[1], పొద్దు, వాకిలి, సారంగ, కినిగె పత్రిక వంటి వెబ్‌జైన్లలోను ప్రచురింపబడ్డాయి. ఇతని కథలు "దేవుడికి సాయం" అనే కథా సంపుటిలోను, 4X5 కథలు అనే కథాసంకలనంలోను ప్రచురింపబడ్డాయి.

ఇతడు వ్రాసిన కథల పాక్షిక జాబితా:

 1. అందగత్తె
 2. అందరూ కూలీలే
 3. అతడు-ఆమె-ఇంటర్‌నెట్
 4. ఆహ్లాదపురం ఆరోవీధి
 5. ఎం.ఆర్.పి.
 6. కొట్టు కనపడుటలేదు
 7. కొడుకే కావాలా?
 8. గట్టిమేలు
 9. గృహగోధికా ప్రహసనం
 10. చోటు
 11. దేవుడికి సాయం
 12. నా మొహం
 13. నిశ్శబ్దానికి మరోవైపు
 14. నువ్వే రైట్ నాన్నా!
 15. పల్లీ...సార్...పల్లీ
 16. పాపులర్ సుబ్బారావు
 17. పురోగామి
 18. ఫ్రెనర్ లా విదా
 19. బేరం
 20. మీ నెంబరు మాకు తెలుసు
 21. ముసుగు వేయద్దు మనసు మీద
 22. రణరంగం కాని చోటు
 23. రాగాల...సరాగాల...సాగే సంసారం
 24. రాయి చరిత్ర
 25. రూపం!
 26. రూపాయల పుస్తకం
 27. రెండు సవర్ల బంగారం
 28. లోపలికి చూడు
 29. విషవలయం
 30. షాక్ లగా
 31. సం..సం…మాయ
 32. సానుభూతి కూడా ఖరీదే...
 33. సున్నాగాడు
 34. సెల్ ఫోన్
 35. స్వర్ణ చతుర్భుజి

అనువాదాలు[మార్చు]

ఇతడు తెలుగు కథలను హిందీ భాషలోనికి, హిందీ, ఇంగ్లీషు భాషలనుండి తెలుగులోనికి అనువదించాడు. కేవలం కథలే కాక “The Adventures of Pinocchio” అనే పిల్లల నవలను "కొంటెబొమ్మ సాహసాలు" అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన Warp and Weft అనే నవలని “నారాయణీయం” అనే పేరుతోను, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ “One Life to Ride” ను "ప్రయాణానికే జీవితం" అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన “The Idea of Justice”ను మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించాడు. అనువాద కథలతో "మనీప్లాంట్", "నాన్నా తొందరగా వచ్చేయ్!" అనే సంపుటాలుగా వెలువరించాడు. ఇంకా "వెదురు వంతెన" అనే ఇ-బుక్‌ను వెలువరించాడు. ఇవి కాక ఇతడు తన ఉద్యోగ బాధ్యతలలో భాగంగా ఎన్నో ట్రైనింగ్ మాన్యువల్స్‌ని ఆంగ్లం, హిందీ నుంచి తెలుగులోకి అనువదించాడు. అలాగే, తెలుగు నుంచి, ఆంగ్లంలోకి, హిందీలోకి తర్జుమా చేసాడు. వివిధ స్వచ్చంద సంస్థల హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్సురెన్స్, మైక్రో ఫైనాన్స్ లోని వివిధ అంశాలలో ట్రైనింగ్ మెటీరియళ్ళను తెలుగులోకి అనువదించాడు.

తెలుగులోనికి అనువదించిన కథల పాక్షిక జాబితా:

 1. బాకీ
 2. అన్వేషణ (ఉర్దూ మూలం: మహమూద్ షాహిద్)
 3. అక్క (హిందీ మూలం: జైనందన్)
 4. కంపు (హిందీ మూలం: సుశాంత్ సుప్రియ్)
 5. కథలు కాసే చెట్టు (హిందీ మూలం: సుశాంత్ సుప్రియ్)
 6. రావత్ టీ స్టాల్ (హిందీ మూలం: వర్షా ఠాకూర్)
 7. చెరువు (అనువాదం)
 8. విచారగ్రస్తుడు (ఆంగ్ల మూలం: జాన్ గార్డినర్)
 9. బొమ్మ (తమిళ కథ)
 10. ఇజంలో ఇంప్రిజన్(ఆంగ్ల మూలం: ఎన్.ఆర్.కె)
 11. తనవి కాని కన్నీళ్ళు (ఆంగ్ల మూలం: అమల్ సింగ్)
 12. అన్ని నక్షత్రాలు లేవు (ఆంగ్ల మూలం: విభోర్ అగర్వాల్)
 13. శూన్యం నుంచి పూర్ణం వరకు (ఆంగ్ల మూలం: అజయ్ పత్రి)
 14. నీది ఎదిగే వయసోయ్ (ఆంగ్ల మూలం: ఎస్.పి. లాజరస్)
 15. ఎవరు ఏమైపోతే మాకేం (మణిపురి కథ ఆంగ్ల మూలం:తయేన్‌జమ్‌ బిజయ్‌కుమార్ సింగ్)
 16. మృత్యువు ముంగిట మౌనం (అరబిక్‌ మూలం:ఆలీ బాదర్)
 17. ఓ మనిషీ, ఎందుకిలా?
 18. అమ్రికావాలా
 19. ఉద్యోగం పోయింది (కజక్ మూలం: జౌరె బతయెవా)
 20. చీకటి (పర్జియన్ మూలం: హుస్సెన్‌ మోర్తెజాయిన్‌ అబ్కేనార్‌)

తెలుగు నుండి హిందీలోనికి అనువదించిన కథల జాబితా:

 1. టెడీబేర్ (తెలుగు: బొమ్మ)
 2. ఝాడూ (తెలుగు: చీపురు - కె.వి.నరేందర్)
 3. శబ్ద్ (తెలుగు: శబ్దం - మాన్యం రమేష్‌కుమార్)
 4. లడ్‌కా-లడ్‌కీ-ఇంటర్‌నెట్ (తెలుగు:అతడు-ఆమె-ఇంటర్‌నెట్)

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "రచయిత: కొల్లూరి సోమశంకర్". కథానిలయం. కా.రా. Retrieved 24 April 2018.[permanent dead link]
 2. "పొద్దు అంతర్జాల మాసపత్రికలో రచయిత పరిచయం". Archived from the original on 2015-03-21. Retrieved 2018-04-24.
 3. "సంచిక తెలుగు సాహిత్య వేదికలో కొల్లూరి సోమశంకర్ పరిచయం". Archived from the original on 2018-05-27. Retrieved 2018-04-24.
 4. 4.0 4.1 4.2 ఎ.వి.రమణమూర్తి; టి.చంద్రశేఖరరెడ్డి; అరిపిరాల సత్యప్రసాద్ (30 April 2014). "ఆలోచించేలా రాయగలిగితే చాలు : సోమశంకర్". సారంగ సాహిత్య వారపత్రిక. Retrieved 24 April 2018.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]