కోత రవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. కోత రవి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 ఏప్రిల్ 1 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1966-04-12) 1966 ఏప్రిల్ 12 (వయసు 58)
కోటపాడు, సంతబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాసం అస్సాం
వృత్తి ఐ.ఎ.ఎస్ ఆఫీసర్

కోత రవి భారతదేశానికి చెందిన 1993వ బ్యాచ్‌ అస్సాం-మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన 2024 ఏప్రిల్ 1న అస్సాం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కోత రవికుమార్‌ 1966 ఏప్రిల్‌ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, కోటపాడు గ్రామంలో జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం కొత్తూరు కోటపాడులో, ఉన్నత విద్యాభ్యాసం దండుగోపాలపురంలో, ఇంటర్మీడియట్‌ టెక్కలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, డిగ్రీ టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసి ఆ తరువాత బాపట్లలో ఏజీబీఎస్సీ, అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ, కొన్నాళ్ల తరువాత ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (న్యూఢిల్లీ)లో పీహెచ్‌డీని పూర్తి చేశాడు. రవి 1993లో ఐఏఎస్ గా ఎంపికై, అస్సాం-మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా నియమితుడయ్యాడు.[3]

వృత్తి జీవితం[మార్చు]

కోత రవి ఐఏఎస్‌గా తన మొదటి పోస్టింగ్‌ అసోంలోని గొసాయిగాంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధుల్లో చేరి ఆ తరువాత జ్వరాఘాట్‌, సివసాగర్‌ జిల్లాల కలెక్టర్‌గా, అసోంలో అగ్రికల్చర్‌ జాయింట్‌ సెక్రటరీగా పని చేసి ఆ తరువాత డెప్యూటేషన్ పై న్యూఢిల్లీలోని మానవ వనరుల శాఖ, మైన్స్‌ శాఖల మంత్రుల వద్ద ఓఎస్‌డీగా, సౌత్‌ ఇండియాలో ఎఫ్‌సీఐలో సీనియర్‌ రీజనల్‌ మేనేజర్‌గా, అమెరికావాషింగ్టన్‌ డీసీలోని భారతీయ రాయబార కార్యాలయంలో మినిస్టరీ ఆఫ్‌ ఎకనమిక్స్‌ విభాగంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధిగా, 15వ ఆర్థిక సంఘానికి సంయుక్త కార్యదర్శిగా, న్యూ ఢిల్లీలోని అస్సాం భవన్‌లో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.

అస్సాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న పబన్‌కుమార్‌ బోర్తకుర్‌ పదవీ విరమణ చేయడంతో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం సీఎస్‌గా నియమించగా రవి 2024 ఏప్రిల్ 1న అస్సాం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. Eenadu (2 April 2024). "అస్సాం సీఎస్‌గా తెలుగు ఐఏఎస్‌ అధికారి". Archived from the original on 2 April 2024. Retrieved 2 April 2024.
  2. ThePrint (31 March 2024). "Ravi Kota assumes charge as new chief secretary of Assam". Archived from the original on 2 April 2024. Retrieved 2 April 2024.
  3. Andhrajyothy (1 April 2024). "అసోంం చీఫ్‌ సెక్రటరీగా జిల్లా వాసి". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
  4. "అస్సాం సర్కారులో సిక్కోలు వాసి". 2 April 2024. Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
  5. "Major reshuffle in Assam bureaucracy, Ravi Kota to be next chief secretary". 19 January 2024. Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=కోత_రవి&oldid=4178722" నుండి వెలికితీశారు