Jump to content

కోళ్ల అప్పలనాయుడు

వికీపీడియా నుండి
కోళ్ల అప్పలనాయుడు

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 2004
1967 - 1972
నియోజకవర్గం ఉత్తరపల్లి శాసనసభ నియోజకవర్గం
శృంగవరపుకోట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1928
ఖాశాపేట, లక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2014 ఆగష్టు 10
విశాఖపట్నం
విశ్రాంతి స్థలం ఖాశాపేట
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
బంధువులు కోళ్ల లలిత కుమారి (మనవరాలు)[1]
సంతానం ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు
వృత్తి రాజకీయ నాయకుడు

కోళ్ల అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తర పల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కోళ్ల అప్పలనాయుడు 1962లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రేవిడి నియోజకవర్గం నుండి,[2] ఆ తరువాత 1967లో శృంగవరపుకోట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983 నుండి 2004 వరకు ఉత్తరాపల్లి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై 1985, 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా, 1999లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా పని చేశాడు.

మరణం

[మార్చు]

కోళ్ల అప్పలనాయుడు అస్వస్థతకు గురై విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి 2014 ఆగష్టు 10న మరణించాడు. ఆయనకు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. HMTV (29 June 2019). "తాతకు తగ్గ మనవరాలిగా లలిత ఎందుకు అనిపించుకోలేకపోయారు?". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
  2. Elections (2019). "Revidi assembly election results in Andhra Pradesh". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  3. The Hindu (10 August 2014). "Former Minister Kolla Appala Naidu passes away" (in Indian English). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  4. Sakshi (10 August 2014). "మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూత". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.