Jump to content

కౌతా రామమోహన శాస్త్రి

వికీపీడియా నుండి
కౌతా రామమోహన శాస్త్రి
జననండిసెంబర్ 23 1905
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం
మరణంఫిబ్రవరి 16 1976
నివాస ప్రాంతంమచిలీపట్నం
వృత్తికావలిలో జవహర్‌ భారతి ఆర్జు స్కూలులో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు
ప్రసిద్ధిసుప్రసిద్ధ చిత్రకారులు.
మతంహిందూ మతము
తండ్రికౌతా శ్రీరామశాస్త్రి
తల్లిశేషమ్మ


కౌతా రామమోహన శాస్త్రి (1905 - 1976) సుప్రసిద్ధ చిత్రకారులు.[1]

వీరు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం లో కౌతా శ్రీరామశాస్త్రి, శేషమ్మ దంపతులకు 1905 డిసెంబరు 23న జన్మించారు. ప్రాథమిక విద్యానంతరం అక్కడి జాతీయ కళాశాలలో విద్యార్ధిగా చేరి ప్రమోద కుమార్ ఛటర్జీ వద్ద చిత్రలేఖనం లో నాలుగు సంవత్సరాలు శిక్షణ పొందారు. అనంతరం లండన్లోని రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ లో నాలుగు సంవత్సరాలు ప్రముఖ కళాకారుల వద్ద చిత్రలేఖనంలో శిక్షణపొందారు. వీరు బ్రిటిష్ ఎంపైర్ సొసైటీ సభ్యునిగా పేరొందారు. రాయల్ సొసైటీలో ఆంధ్రా ఫెల్లోగా ఎంపిక కావడం వీరితోనే ప్రారంభం అయింది. లండన్, న్యూయార్క్, కెనడా వంటి పలు ప్రాంతాలలో వీరి చిత్రాలు నేటికి మనం చూడవచ్చు. మద్రాసుకు చెందిన సంస్కత అకాడమీ 1933లో ప్రచురించిన వాల్మీకి రామాయణ సంస్కత గ్రంథంలో వీరి నూనెరంగుల చిత్రాలు 17 వరకు ప్రచురించబడి మిక్కిలి ప్రచారం పొందాయి. డైపాయింట్‌ ఎచ్చింగ్‌ పద్ధతిలో సర్వేపల్లి రాధాకృష్ణ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, గాంధీ, నెహ్రూ, రవీంద్రనాధ్‌ టాగూర్‌ వంటి ప్రముఖుల చిత్రాలను అత్యంత సహజంగా చిత్రించి, ప్రశంసలు పొందారు. 1965లో వీరు చిత్రించిన చిత్రాన్ని డాక్టర్ జాకీర్ హుస్సేన్ ప్రారంభించి అభినందించారు. వీరు చిత్రించిన 14 మంది ప్రముఖుల రూప చిత్రాలను 'Fourteen Portraits of Outstanding Personalities' పేరుతో పుస్తకంగా ప్రచురించబడింది. కావలిలో జవహర్‌ భారతి ఆర్జు స్కూలులో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లోగోను (ముద్రికను) రూపకల్పన చేశారు. సుప్రసిద్ధ చిత్రకారులు కౌతా ఆనందమోహనశాస్త్రి వీరి సోదరులే.

వీరు 1977 ఫిబ్రవరి 16 న మరణించారు.

పేర్కొనదగిన చిత్రాలు

[మార్చు]
  • కేశాలంకరణ
  • నిరీక్షణ టఫాల్లర్‌ స్వ్వేర్‌
  • ఆపిల్‌ సెల్లర్‌
  • సరస్వతి
  • ఓల్డ్‌ ట్రీ


మూలాలు

[మార్చు]
  1. రామమోహన శాస్త్రి, కౌతా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 44-45.