క్రొవ్విడి రామం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రొవ్విడి రామం
జననంక్రొవ్విడి రామం
1914
విశాఖపట్టణం
మరణం2003
వృత్తిఉపాధ్యాయ వృత్తి ,
ప్రసిద్ధిరచయిత, సాహితీ వేత్త

క్రొవ్విడి రామం (1914 - 2003) ప్రముఖ తెలుగు సాహితీవేత్త.

వీరు చిన్నంరాజు, కామేశ్వరమ్మ దంపతులకు విశాఖపట్టణంలో జన్మించారు. విజయనగరంలో ఉన్నత పాఠశాల, కళాశాలలో చదివి బి.ఏ. పట్టా పొండారు. మద్రాసులో న్యాయవాదిగా పట్టా పొందారు. స్వంత అభిరుచిగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. చిన్నతనం నుండి సాహితీ అభిలాష మూలంగా వ్యవహారిక భాషావేత్త గిడుగు రామమూర్తి, బుర్రా శేషగిరిరావు మొదలైన వారి ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు.

వీరు ఒక్క రాత్రిలో 'సహస్ర చరణాల గీతా మాలిక'ను రాసి పరమేశ్వరునికి అంకితం ఇచ్చిన భక్తులు. వీరు 'అష్టోత్తర శతబంజిక మాల', 'శేషాద్రి నాథసేవ', 'కాశీ విశ్వేశ్వర స్తవం' లాంటి గ్రంథాలు రచిమ్చారు. 'కావ్యాంజలి' వంటి కథా సంకలనాలు, 'సాహిత్య సౌరభం' వంటి సమీక్ష, వ్యాస సంపుటాలు, 'వ్యాస పారిజాతం' వంటి వ్యాస పరంపరను లోకానికి అందించారు. సుప్రసిద్ధ సాహితీ సంస్థ "కౌముదీ పరిషత్" అధ్యక్షునిగా శతావధానం నిర్వహించారు. విజయనగరం సాహితీ వైభవాన్ని దూరదర్శినిలో ప్రదర్శించారు.

సాహిత్యంలో అన్ని రంగాలను సృశించిన వీరు 2003లో పరమపదించారు.

మూలాలు[మార్చు]