Jump to content

ఖదీజా

వికీపీడియా నుండి


ఖదీజాలేదా ఖదీజా బింతె ఖువేలిద్ (అరబ్బీ: خديجة بنت خويلد‎) లేదా ఖదీజా అల్-కుబ్రా. ఈమె ముహమ్మదు ప్రవక్త మొదటి భార్య. ముహమ్మదు ప్రవక్త తన 25 వ ఏట 40 సంవత్సరాల వయసు గల ఈమెను పెళ్ళి చేసుకున్నాడు. ఖదీజా మక్కానగరానికి చెందిన సంపన్నురాలు. అప్పటికే ఆమెకు రెండుసార్లు పెళ్ళి అయింది. మొదటి ఇద్దరు భర్తలూ చనిపోయారు. ఆ రెండు సంబంధాల నుండి ఈమెకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు.

ముహమ్మద్ ప్రవక్తతో పెళ్ళి

[మార్చు]
ముహమ్మద్, ఖాదీజా వూదూ ప్రదర్శిస్తున్న ఇస్లామిక్ సూక్ష్మచిత్రం

ఖదీజా తన స్నేహితురాలు నఫీసాని ముహమ్మద్ దగ్గరికి వెళ్లి పెళ్లి గురించి అడగమని చెప్పింది. [1] నఫీసా ముహమ్మద్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్నీ అడిగినప్పుడు ముహమ్మద్ తన వద్ద భార్యను పోషించేంత డబ్బు లేదని చెబుతాడు.[2] దానికి నఫీసా తనను తానుగా పోషించుకునే సామర్థ్యం ఉన్న స్త్రీ అయితే వివాహం చేసుకుంటావా అని నఫీసా అడిగింది. [3] దానికి ముహమ్మద్ అంగీకరించి ఖదీజాను కలుస్తాడు, తర్వాత వారు తమ తమ మామలను సంప్రదిస్తారు. మామలు వివాహానికి అంగీకరించి ఖదీజాకు అధికారిక ప్రతిపాదన చేయడానికి అతనితో పాటు వెళ్తారు. [4] ఈ ప్రతిపాదనలో ముహమ్మద్‌తో పాటు హంజా ఇబ్న్ అబ్దుల్-ముత్తలిబ్ వెళ్ళాడా, అబూ తాలిబ్ వెళ్ళాడా లేదా ఇద్దరూ వెళ్ళారా అనేది తెలియరాలేదు.[5] ఖదీజా మామ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారు. తర్వాత వీరి వివాహం జరిగింది. వివాహం జరిగిన సమయంలో ముహమ్మద్ వయస్సు దాదాపు 22 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. [6] [7] [8] [9] కొన్ని మూలాల ప్రకారం ఆ సమయంలో ఖదీజా వయస్సు 40 సంవత్సరాలు అని ఉంది. [10] [11] [12] [13] అయితే కొన్నిటిలో ఆమె వయస్సు 28 సంవత్సరాలు అని ఇతర వర్గాలు చెబుతున్నాయి. [14] [15] ముహమ్మద్ పరిణత వయస్కుడు కాకముందే అతని తండ్రి, తాత మరణించారు, దీనివల్ల అతనికి ఆర్థిక వనరులు లేకుండా పోయాయి. ఈ పెళ్ళి ప్రతిపాదన తరువాత, ముహమ్మద్ ఖాదీజా ఇంటికి మారుతాడు.

పిల్లలు

[మార్చు]

ముహమ్మద్, ఖాదీజాలకు ఆరు లేదా ఎనిమిది మంది పిల్లలు ఉండవచ్చు. [16] పిల్లల సంఖ్య గురించి మూలాలు విభేదిస్తున్నాయి.[17] అల్-తబరి ప్రకారం వారికి ఎనిమిది మంది పిల్లలు ఉన్నారని పేర్కొన్నాడు. అయితే ఇబ్న్ ఇషాక్ ప్రకారం ముహమ్మద్ కు ఏడుగురు పిల్లలు ఉన్నారని పేర్కొన్నాడు. అయితే చాలా మూలాలలో వీరికి ఆరుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు అని ఉంది. [18][19]

మూలాలు

[మార్చు]
  1. Lings (1983). Muhammad: His Life Based on the Earliest iiiiSources. New York: Inner Traditions Internationalist. p. 83.
  2. Barboza, Gileno. "Qasim ibn Muhammad". Geneanet. Retrieved 18 March 2020.
  3. Lings (1983). Muhammad: His Life Based on the Earliest Sources. Inner Traditions Internationalist.
  4. Guillaume (1955). The Life of Muhammad. Oxford. p. 83.
  5. "Khadija bint Khuwaylid". Tree of Faith. Archived from the original on 2012-04-07.
  6. Ibn Ishaq. Mustadrak Al-Hakim. Vol. 3. p. 182.
  7. Ibn Sa'd. Tabaqat al-Kubra (in అరబిక్). Vol. 8. أخبرنا هشام بن محمد بن السائب عن أبيه عن أبي صالح عن ابن عباس قال:كانت خديجة يوم تزوجها رسول الله – صلى الله عليه وسلم – ابنة ثمان وعشرين سنة
  8. Abu ‘Abdullah Al-Hakim. al-Mustadrak. Vol. 3. عن محمد بن إسحاق، أن أبا طالب وخديجة بنت خويلد هلكا في عام واحد، وذلك قبل مهاجر النبي صلى الله عليه وسلم إلى المدينة بثلاث سنين، ودفنت خديجة بالحجون، ونزل في قبرها رسول الله صلى الله عليه وسلم، وكان لها يوم تزوجها ثمان وعشرون سنة
  9. Muhammad, Ibn Sa’d. Tabaqat al-Kubra. pp. Vol.8, 13.
  10. Amili. Al Sahih Min Sirat Al Nabi. pp. Vol. 2, P. 114.
  11. Ibn Ishaq. Mustadrak Al Hakim. pp. 3. p. 182.
  12. Ibn Saad. Al Tabaqat Al Kubra.
  13. Abo Abdullah Al Hakim. Al Mustadarak.
  14. Ibn Saad. Al Tabaqat Al Kubra. pp. Vol.8 page 13.
  15. Al-Hakim Abu‘Abdullah. al-Mustadrak. pp. Vol.3, 200 No. 4837.
  16. "Khadijah bint Khuwaylid". Islam's Women. Archived from the original on 18 March 2019.
  17. "Khadija bint Khuwaylid". Tree of Faith. Archived from the original on 2012-04-07.
  18. al-Tabari (trans. Ismail K Poona Walla) (1990). Volume 9: The Last Years of the Prophet (PDF). State University of New York Press. ISBN 0-88706-691-7. Archived from the original (PDF) on 2020-02-06. Retrieved 2020-03-18.
  19. Barboza, Gileno. "Qasim ibn Muhammad". Geneanet. Retrieved 18 March 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖదీజా&oldid=4687946" నుండి వెలికితీశారు