Jump to content

ఖుషి కపూర్

వికీపీడియా నుండి
ఖుషి క‌పూర్
2018లో ఒక సంస్థనిర్వహించిన ఫ్యాషన్ వీక్ లో ఖుషి కపూర్
జననం (2000-11-05) 2000 November 5 (age 25)
ముంబై , మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయురాలు
వృత్తిమోడల్, నటి
క్రియాశీలక సంవత్సరాలు2018–ప్రస్తుతం
Parent(s)శ్రీదేవి
బోనీ కపూర్
బంధువులుజాహ్నవి కపూర్ (సోదరి)
అర్జున్ కపూర్ (సవతి సోదరుడు)
అన్షులా కపూర్ (సవతి సోదరి)

ఖుషి కపూర్ (జననం 2000 నవంబరు 5) భారతదేశానికి చెందిన సినిమా నటి.[1]

బాల్యం, విద్య

[మార్చు]

ఖుషీ కపూర్ 2000 నవంబరు 5న మహారాష్ట్రలోని ముంబైలో శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు రెండో సంతానంగా జన్మించింది. ఆమె సోదరి జాహ్నవి. అక్కడే ధీరూబాయ్ అంబానీ స్కూల్​లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది. లండన్‌ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది.

కెరీర్

[మార్చు]

ప్రసిద్ధ ఆర్చీస్ కామిక్స్ సిరీస్‌ ఆధారంగా 2023లో భారతీయ చలనచిత్రం ది ఆర్చీస్ లో సుహానా ఖాన్, రోహిత్ చెత్రీ లతో పాటు ఖుషీ కపూర్ నటించింది.[2] దీనికి జోయా అక్తర్ దర్శకత్వం వహించాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2020 స్పీక్‌ అప్ నైనా షార్ట్ ఫిల్మ్
2023 ది ఆర్చీస్ బెట్టీ కూపర్
2025 లవ్‌యాపా బాణీ శర్మ [3]
నదానియన్ పియా జైసింగ్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు సూచిక నెం.
2024 ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ ఆమె స్వయంగా అతిథి పాత్ర

మూలాలు

[మార్చు]
  1. "అబ్బాయిల్లో ఏం నచ్చుతుందంటే..." Chitrajyothy. 2 February 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
  2. "Janhvi kapoor: నా చెల్లికి నేనిచ్చే సలహా అదే". web.archive.org. 2023-01-04. Archived from the original on 2023-01-04. Retrieved 2023-01-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "తల్లిని గుర్తుచేసుకొని ఖుషీకపూర్‌ ఎమోషనల్‌". Eenadu. 11 January 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.