సుహానా ఖాన్
సుహానా ఖాన్ | |
---|---|
జననం | ముంబై, భారతదేశం | 2000 మే 22
విద్యాసంస్థ | ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, ముంబై ఆర్డింగ్లీ కాలేజీ, ఇంగ్లాండు పింక్‌విల్లా టిస్చ్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్, న్యూయార్క్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2022 - ప్రస్తుతం |
బంధువులు | ఆర్యన్ ఖాన్, అబ్రమ్ ఖాన్ (తోబుట్టువులు) |
సుహానా ఖాన్ (జననం 2000 మే 22) భారతీయ నటి, థియేటర్ ఆర్టిస్ట్. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఆమె హిందీ సినిమా నటుడు షారుఖ్ ఖాన్, నిర్మాత గౌరీ ఖాన్ ల కూతురు.
జోయా అక్తర్ దర్శకత్వంలో వస్తున్న ది ఆర్చీస్ సినిమాతో సుహానా ఖాన్ తో పాటు ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనువడు అగస్త్య నంద ప్రధాన పాత్రల్లో అరంగేట్రం చేయనున్నారు.[1][2][3]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె ముంబైలో 2000 మే 22న షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులకు జన్మించింది.[4] ఆమె ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె చిన్నతనం నుండి క్రీడలలో నైపుణ్యం కలిగి ఉంది. ఆమె పాఠశాలలో అండర్-14 బాలికల ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉండేది.
2019లో, ఆమె ఇంగ్లాండులోని ఆర్డింగ్లీ కాలేజీ నుండి డిగ్రీ పూర్తిచేసింది. అప్పటి నుంచే, ఆమె అనేక డాక్యుమెంటరీలను రూపొందించింది. ఆర్డింగ్లీ కాలేజీ గ్రాడ్యుయేషన్ వేడుకలో, ఆమె నాటకానికి రస్సెల్ కప్ లభించింది. ఆ తరువాత, ఆమె ఉన్నత విద్యలకై న్యూయార్క్ విశ్వవిద్యాలయం కు చెందిన పింక్‌విల్లా టిస్చ్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ లో చేరింది.
మూలాలు
[మార్చు]- ↑ "Suhana Khan: నాలాగే వెరోనికా ఉంది: సుహానా ఖాన్ |". web.archive.org. 2023-10-21. Archived from the original on 2023-10-21. Retrieved 2023-10-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Hazra, Priya (May 14, 2022). "Here's A Look At The Cast Of Zoya Akhtar's 'The Archies' & The Characters They Are Playing". ScoopWhoop. Mumbai. Retrieved May 14, 2022.
- ↑ "The Archies starring Suhana Khan, Agastya Nanda, Khushi Kapoor to premiere on Netflix on December 7, 2023". Bollywood Hungama. 29 August 2023. Retrieved 29 August 2023.
- ↑ "rediff.com: Shah Rukh has a new(born) heroine in his life". m.rediff.com. Archived from the original on 18 October 2018. Retrieved 6 December 2018.