జోయా అక్తర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోయా అక్తర్
2016లో ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డులలో జోయా అక్తర్
జననం (1972-10-14) 1972 అక్టోబరు 14 (వయసు 51)
విద్యాసంస్థ
  • సెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై
  • న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్
వృత్తి
  • దర్శకురాలు
  • స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
  • లక్ బై ఛాన్స్
  • జిందగీ నా మిలేగీ దొబారా
  • దిల్ ధడక్నే దో
  • గల్లీ బాయ్
తల్లిదండ్రులు

జోయా అక్తర్ (జననం 1972 అక్టోబరు 14) భారతీయ చలనచిత్ర దర్శకురాలు, కథారచయిత. ఆమె హిందీ సినిమాల్లో పనిచేస్తుంది.[1]

న్యూయార్క్ విశ్వవిద్యాలయం(NYU) నుండి ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ఆమె స్వయంగా రచయిత, దర్శకురాలిగా మారింది. దీనికి ముందు మీరా నాయర్, టోనీ గెర్బర్, దేవ్ బెనెగల్ వంటి దర్శకులకు సహాయకురాలిగా చేసింది. ఆమె ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకుంది.[2] ఆమె, రీమా కగ్తీతో కలిసి టైగర్ బేబీ ఫిల్మ్స్ అనే ఫిల్మ్ అండ్ వెబ్ స్టూడియోను అక్టోబరు 2015లో స్థాపించింది.

ఆమె లక్ బై ఛాన్స్ (2009), జిందగీ నా మిలేగీ దొబారా (2011), బాంబే టాకీస్ (2013) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించింది. ఆమె రీమా కగ్తీతో కలిసి తలాష్ (2012)కి సహ రచయితగా ఉంది. ఆమె తర్వాత దిల్ ధడక్నే దో (2015), గల్లీ బాయ్ (2019) చిత్రాలకు దర్శకత్వం వహించింది.

ఆమె ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ బోర్డు సభ్యురాలుగా ఉంది.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కవి, గీత రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్, స్క్రీన్ రైటర్ హనీ ఇరానీలకు ఆమె జన్మించింది. ఆమె సవతి తల్లి నటి షబానా అజ్మీ. ఆమె తమ్ముడు నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్.[4]

ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తిచేసింది. తరువాత, ఆమె ఫిల్మ్ ప్రొడక్షన్ నేర్చుకోవడానికి న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరింది.[5]

ఆమె ముత్తాత, ఫజల్-ఎ-హక్ ఖైరాబాదీ, ఇస్లామిక్ అధ్యయనాలు, వేదాంతశాస్త్రంలో పండితుడు. ఆమె ఉర్దూ కవి ముజ్తర్ ఖైరాబాదీకి మనవరాలు, కవి జాన్ నిసార్ అక్తర్ కి కూడా మనవరాలు.[6][7]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ నోట్స్
2007 హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి. లిమిటెడ్ - - అవును
2009 లక్ బై ఛాన్స్ అవును అవును ఎగ్జిక్యూటివ్ దర్శకురాలిగా పరిచయం
2011 జిందగీ నా మిలేగీ దోబారా అవును అవును - సహ రచయిత: రీమా కగ్టి
2012 తలాష్ - అవును - సహ రచయిత: రీమా కగ్టి
2013 బాంబే టాకీస్ అవును అవును - సంకలన చిత్రం; విభాగం: షీలా కీ జవానీ
2015

దిల్ ధడక్నే దో

అవును అవును - సహ రచయిత: రీమా కగ్టి
2018 లస్ట్ స్టోరీస్ అవును అవును - సంకలన చిత్రం
2019 గల్లీ బాయ్ అవును అవును అవును సహ రచయిత: రీమా కగ్టి
2019 మేడ్ ఇన్ హెవెన్ అవును అవును - సహ-సృష్టికర్త: రీమా కగ్టి, టీవీ సిరీస్

దర్శకురాలు, 2 భాగాలు

2020 ఘోస్ట్ స్టోరీస్ అవును అవును - సంకలన చిత్రం; విభాగం: కథ 1
2023 దహాద్ - అవును అవును సహ-సృష్టికర్త: రీమా కగ్టి
2023 ది ఆర్చీస్ అవును - - లైవ్-యాక్షన్ మ్యూజికల్ ఫిల్మ్ అనుసరణ[8]

మూలాలు

[మార్చు]
  1. "బాలీవుడ్‌ వారసుల 'ది ఆర్చీస్‌' |". web.archive.org. 2023-07-27. Archived from the original on 2023-07-27. Retrieved 2023-07-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Filmfare Awards Winners From 1953 to 2020". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31.
  3. "Mumbai Academy of Moving Image - Trustees Site". www.mumbaifilmfestival.com.
  4. "Shabana Azmi- Farhan and Zoya Akhtar - Bollywood stepmothers who share a beautiful bond with their step kids". The Times of India. Retrieved 2019-09-19.
  5. Jan Nisar Akhtar Biography The Encyclopaedia of Indian Literature (Volume Two) (D -J). by Amaresh Datta. Sahitya Akademi, 2006. ISBN 81-260-1194-7. p. 1796-97.
  6. "10 Self-Proclaimed Celebrity Atheists | Entertainment | iDiva.com | Page 4". iDiva.com. 3 June 2013. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 16 December 2013.
  7. "Celebs who are atheist". Times of India. Retrieved 16 September 2016.
  8. "Netflix and Archie Comics Partner for the Live-Action Musical Film, The Archies, to be Directed By Zoya Akhtar". Netflix Media Center (Press release). November 11, 2021.