ముజ్తార్ ఖైరాబాదీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముజ్తార్ ఖైరాబాదీ
Muztar Khairabadi.jpg
పుట్టిన తేదీ, స్థలంఇఫ్తీకర్ హుస్సేన్
1865
ఖైరాబాద్‌, ఉత్తరప్రదేశ్, బ్రిటీష్ ఇండియా
మరణం1927 మార్చి 27(1927-03-27) (వయస్సు 64–65)
గ్వాలియర్, మధ్యప్రదేశ్‌, బ్రిటీష్ ఇండియా
వృత్తికవి
భాషఉర్దూ
జాతీయతభారతీయుడు
సంతానంజాన్ నిసార్ అక్తర్
బంధువులుఫజల్-ఎ-హక్ ఖైరాబాదీ (తాత)
జావేద్ అక్తర్ (మనవడు)
సల్మాన్ అక్తర్ (మనవడు)
ఫర్హాన్ అక్తర్ (మునిమనవడు )
జోయా అక్తర్ (మనవరాలు)
కబీర్ అక్తర్ (మనవడు)

ఇఫ్తీకర్ హుస్సేన్ (1865 - 1927) ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉర్దూ కవి.[1][2] ఇతని కలంపేరు ముజ్తార్ ఖైరాబాదీ.

జీవిత విషయాలు[మార్చు]

ఖైరాబాది 1865లో ఉత్తరప్రదేశ్ లోని ఖైరాబాద్‌లో జన్మించాడు.[3] కవి, తత్వవేత్త, మత పండితుడు, అరబిస్ట్, పర్షియన్, ఉర్దూ రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడైన ఫజల్-ఎ-హక్ ఖైరాబాదీ మనవడు. ఖైరాబాదీ తల్లి మొదటి గురువుగా అన్ని విషయాలను నేర్పించింది.[4] ఖైరాబాద్, టోంక్, గ్వాలియర్, ఇండోర్, భోపాల్, రాంపూర్ లలో తన జీవితాన్ని గడిపాడు.

కుటుంబం[మార్చు]

ఖైరాబాదీకి ఒక కుమారుడు (కవి-గీత రచయిత జాన్ నిసార్ అక్తర్), ఇద్దరు మనవళ్ళు (జావేద్ అక్తర్, సల్మాన్ అక్తర్),[5][4] మునిమనవళ్ళు ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, కబీర్ అక్తర్ ఉన్నారు.[5]

బిరుదులు[మార్చు]

ఖైరాబాదీ ఇఫ్తీకర్-ఉల్-షౌరా, ఈత్బర్-ఉల్-ముల్క్ బిరుదులను అందుకున్నాడు.[4]

రచనా ప్రస్థానం[మార్చు]

ఖైరాబాది అనేక కవితా పుస్తకాలు రాశాడు. కరిషామా-ఎ-దిల్బార్ పేరుతో ఒక సాహిత్య పత్రికను కూడా ప్రచురించాడు.[4]

రచనలు[మార్చు]

రాసిన వాటిలో కొన్ని:[4]

  • నజ్ర్-ఎ-ఖుదా (దేవుని స్తుతిలో కవితా సంకలనం)
  • మీలాడ్-ఇ-ముస్తఫా
  • బెహర్-ఎ-తవీల్ (పద్యం)
  • మార్గ్-ఎ-ఘలత్ కి ఫరియాద్ (గజల్)

మరణం[మార్చు]

ఖైరాబాది 1927, మార్చి 27న గ్వాలియర్‌లో మరణించాడు.[4][3]

మూలాలు[మార్చు]

  1. "Incorrect verses". The Tribune India.com. 2005-01-02. Retrieved 2022-01-16.
  2. "A vein of grief". The Hindu. 2002-06-23. Archived from the original on 2003-07-03. Retrieved 2022-01-16.
  3. 3.0 3.1 Mohammad Shamsul Haq, Paimana-e-Ghazal, vol. 1, pg 241
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "Muztar Khairabadi: Grand father of noted lyricist Jawed Akhtar". rekhta.org. Retrieved 2022-01-16.
  5. 5.0 5.1 "Muztar Khairabadi". Sher-o-Sukhan. Retrieved 2022-01-16.

ఇతర గ్రంథాలు[మార్చు]

  • ఖలీల్ ఉల్లా ఖాన్, ముజ్తర్ ఖైరాబాదీ: హయత్ ఔర్ షైరీ (ఉర్దూ పబ్లిషర్స్, నజీర్ అబాద్, లక్నో, 1979).
  • మహ్మద్ అబ్దుల్ షాహిద్ ఖాన్ షేర్వానీ, బాఘీ హిందుస్థాన్ (అల్మజ్మా అల్-ఇస్లామీ, ముబారక్‌పూర్, 1947).
  • నష్టర్ ఖైరాబాది, ed., ఇల్హామాత్ (1934).