Jump to content

గంగా ప్రసాద్

వికీపీడియా నుండి
గంగా ప్రసాద్
గంగా ప్రసాద్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 అగస్టు 2018 - 2023 ఫిబ్రవరి 12
ముందు శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్
తరువాత లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య

మణిపూర్ గవర్నర్
పదవీ కాలం
12 ఆగస్టు 2021 – 26 ఆగస్టు 2021
ముందు నజ్మా హెప్తుల్లా
తరువాత లా. గణేశన్

17వ మేఘాలయ గవర్నర్
పదవీ కాలం
5 అక్టోబరు 2017 – 25 ఆగస్టు 2018
ముందు భన్వారీలాల్ పురోహిత్
తరువాత తాతాగత రాయ్

వ్యక్తిగత వివరాలు

జననం (1939-07-08) 1939 జూలై 8 (వయసు 85)
పాట్నా, బీహార్, బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కమలాదేవి
సంతానం 5, సంజీవ్ చౌరాసియా తో సహా
నివాసం రాజ్ భవన్, గాంగ్ టాక్
పూర్వ విద్యార్థి పాట్నా పాఠశాల
కాలేజ్ ఆఫ్ కామర్స్ పాట్నా
వృత్తి రాజకీయ నాయకుడు

గంగా ప్రసాద్ చౌరాసియా, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2018 ఆగస్టు 26 నుండి 2023 ఫిబ్రవరి 12 వరకు సిక్కిం రాష్ట్ర గవర్నర్‌గా విధులు నిర్వహించాడు.[1] ఇంతకు పూర్వం మేఘాలయ గవర్నరుగా 2017 అక్టోబరు 5 నుండి 2018 ఆగస్టు 25 వరకు పని చేశాడు.[2] ఇతను బీహార్ శాసన మండలి సభ్యుడు, ఆరె.జె.డి హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. బీహార్‌లో ఎన్‌డిఎ పాలనలో ఆయన బీహార్ శాసన మండలి నాయకుడిగా కూడా ఉన్నాడు [3]రాజకీయాల్లో ప్రసాద్ 'గంగా బాబు' అనే పేరుతో పేరు గాంచాడు.[4]

ప్రారంభ జీవితం

[మార్చు]

ప్రసాద్ ఒక వ్యాపార కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి ముండార్ సాహ్ (వయస్సు 109 సంవత్సరాలు) ఒక విజయవంతమైన వ్యాపారవేత్త, భారతదేశం, బంగ్లాదేశ్ రాష్ట్రాల ప్రజలతో సమన్వయంతో ముండార్ వ్యాపార కార్యకలాపాలను విస్తర్ణచాడు. ప్రసాద్ సామాజికంగా చాలా చురుకుగా ఉండేవాడు. బీహార్ రాష్ట్రంలో రాజకీయాల ప్రాముఖ్యతను గుర్తించిన ముండార్ తన కుమారుడు ప్రసాద్‌ను రాజకీయాల వైపు ప్రోత్సహించాడు వీరి భావాలను జనసంఘ్‌తో పోలి ఉంటాయి.

ప్రసాద్ దధీచి దేహ్దాన్ సమితి అనే స్వచ్ఛంద సంస్థ బీహార్ అధ్యాయానికి చైర్మన్గా ఉన్నాడు. ఈ సంస్థ అవయవ దానాన్ని ప్రోత్సహిస్తుంది.

వృత్తి జీవితం

[మార్చు]

ప్రసాద్ 1994 లో బీహార్ శాసన మండలికి ఎన్నికై, ఆ తరువాత నుండి 18 సంవత్సరాలు ఆ స్థానంలో కొనసాగాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "In Gangtok, Ganga Prasad takes oath as new Governor of Sikkim, replaces Shriniwas Patil". FirstPost. 27 August 2018. Retrieved 28 August 2018.
  2. "President Kovind Appoints 5 New Governors, Tamil Nadu Gets Its Own After A Year". NDTV. Retrieved 30 September 2017.
  3. "Ganga Prasad Chaurasia | Raj Bhavan Sikkim | India" (in ఇంగ్లీష్). Retrieved 2024-09-13.
  4. "बिहार : हरिद्वार में थे गंगा बाबू, जब मिली राज्यपाल बनने की जानकारी, जानिए उनके बारे में".
  5. "New governors appointed: All you need to know". The Times of India. 30 September 2017. Retrieved 30 September 2017.
  6. "Profiles of new Governors of TN, Assam, Bihar, Meghalaya and Arunachal Pradesh". The Hindu. Retrieved 30 September 2017.
  7. "Who is Ganga Prasad?". Indian Express. 30 September 2017. Retrieved 30 September 2017.

బాహ్య లింకులు

[మార్చు]