Jump to content

గడ్డం అరవింద్ రెడ్డి

వికీపీడియా నుండి
గడ్డం అరవింద్‌ రెడ్డి
గడ్డం అరవింద్ రెడ్డి


శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
తరువాత నడిపల్లి దివాకర్ రావు
నియోజకవర్గం మంచిర్యాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958
మంచిర్యాల, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జి. నరసింహ రెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

గడ్డం అరవింద్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు మంచిర్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

గడ్డం అరవింద్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటైన మంచిర్యాల నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొనె హనుమంత రావు గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

గడ్డం అరవింద్‌ రెడ్డి 2014లో తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత  టిఆర్ఎస్ నుం విడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2014లో తెలంగాణ శాసనసభకు జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు చేతిలో ఓడిపోయాడు. ఆయన 2018లో తిరిగి కాంగ్రెస్ టికెట్ ఆశించిన దక్కకపోవడంతో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (29 June 2014). "టీఆర్‌ఎస్‌లోకి అరవిందరెడ్డి..?". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
  2. News18 Telugu (16 November 2018). "మళ్లీ కారెక్కిన అరవింద్‌రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్". Retrieved 17 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)