అక్షాంశ రేఖాంశాలు: 51°25′24″N 0°11′21″W / 51.42333°N 0.18917°W / 51.42333; -0.18917

గణపతి దేవాలయం (వింబుల్డన్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గణపతి దేవాలయం (వింబుల్డన్)
స్థానం
దేశం:ఇంగ్లాండు
ప్రదేశం:వింబుల్డన్
భౌగోళికాంశాలు:51°25′24″N 0°11′21″W / 51.42333°N 0.18917°W / 51.42333; -0.18917
వెబ్‌సైటు:https://ghanapathy.co.uk/

గణపతి దేవాలయం, ఇంగ్లాండ్‌ నైరుతి లండన్‌లోని వింబుల్డన్ ప్రాంతంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. 1980లలో స్థాపించబడిన ఈ దేవాలయంలో గణేశుడు ప్రధాన దైవంగా కొలువై ఉన్నాడు. దుర్గాదేవి(పార్వతి), హనుమంతుడు, కృష్ణుడు మొదలైన ఇతర దేవతలు కూడా ఉన్నారు. 1981లో సాయి మందిరం ప్రారంభించబడింది. ఐరోపాలోని మొదటి హిందూ దేవాలయమిది.[1] హిందూమతం గురించి యువ తరానికి అవగాహన కల్పించడానికి గత కొన్ని సంవత్సరాలుగా సాయిమందిరంలో ఆధ్యాత్మిక తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఆధ్యాత్మిక విద్య, సంస్కృత ప్రార్థనలు, ఇతర మతాల గురించి కూడా నేర్చుకోవడంతోపాటు భజనలు ఎలా పాడాలో ఇక్కడ నేర్పుతారు. సంగీతం, నృత్యం, యోగ మొదలైన తరగతులను అందిస్తుంది.

దేవాలయంలోని గణపతి మందిరం
దేవాలయంలోని సాయి మందిరం

సంస్థ

[మార్చు]

1986లో శ్రీలంక నుండి వచ్చిన శరణార్థులకు ఈ దేవాలయంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. 1986 బిబిసి[2] వారి డోమ్స్ డే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ సమాచారాన్ని రికార్డు చేసింది. యుకెలోలో స్కౌట్ గ్రూప్‌కు నిలయంగా ఉన్న యూరోప్‌లోని మొదటి హిందూ దేవాలయంగా ఇది గుర్తింపు పొందింది. 23వ వింబుల్డన్[3] ని స్కౌట్ లీడర్, గీతా మహేశ్వరన్ 2012 శరదృతువులో స్థాపించారు. మెర్టన్ కౌన్సిల్ డైరెక్టరీ[4] లో పాఠశాల అన్ని వయస్సుల వారికి హిందూ మత, సామాజిక, సాంస్కృతిక సేవలను అందిస్తోంది.

పునర్నిర్మాణాలు

[మార్చు]

గణపతి దేవాలయం అధికారికంగా చర్చి, కమ్యూనిటీ సెంటర్‌గా ఉన్న భవనాన్ని ఉపయోగిస్తోంది. దాంతో లోపలి భాగం చతురస్రాకారంలో ఉంది. 2014 ప్రారంభంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి,[5] 2015 జనవరిలో పూర్తయ్యాయి. ఇది దక్షిణ భారత సంప్రదాయ దేవాలయాల శైలిపై నిర్మించబడింది.

మూలాలు

[మార్చు]
  1. "Ghanapathy | Shree Ghanapathy Temple". Archived from the original on 2017-12-27. Retrieved 2022-05-11.
  2. "BBC Domesday Project 1986 entry".
  3. "Feature on Scouting Magazine (Uk)". Archived from the original on 3 మార్చి 2016. Retrieved 17 January 2015.
  4. "School Visits at Temple". Archived from the original on 6 సెప్టెంబరు 2012. Retrieved 17 January 2015.
  5. "Young Reporter-Local Guardian - Wimbledon". Archived from the original on 2018-09-12. Retrieved 2022-05-11.

బయటి లింకులు

[మార్చు]