Jump to content

గాంధీజనసంఘం (గ్రామం)

వికీపీడియా నుండి

గాంధీజనసంఘం (గ్రామం) శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గాంధీజనసంఘం (గ్రామం) వ్యవస్థాపకుడు వెన్నెలకంటి రాఘవయ్య

గాంధీజనసంఘం గ్రామం, జిల్లాలో పెద్ద గిరిజన గ్రామం. నెల్లూరు గాంధీగా పరిగణించే వెన్నెలకంటి రాఘవయ్య పంతులు, 1940 దశకంలో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసారు. అప్పటివరకూ చెట్టుకొకరు, పుట్టకొకరుగా తిరుగుతున్న గిరిజనులను ఇక్కడకు చేర్చి, గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి పరిస్థితుల ప్రకారం, వీరికి ప్రాథమిక పాఠశాలను మాత్రమే ఏర్పాటుచేశారు. అప్పటి నుండి 1997 వరకూ ఇక్కడ కేవలం పాఠశాల మాత్రమే ఉండేది. ఆ పరిస్థితులలో, సంగం మండలం, పడమటిపాళెం వాసియైన తుమ్మల భక్తవత్సలరెడ్డి , కేవలం ప్రాథమిక విద్యాభ్యాసం తోనే చదువులు ఆగిపోకూడదనీ, ఉన్నత విద్యాభాసం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలనీ ఆశించారు. ఇతని కృషి ఫలితంగా, 1995, మే నెల 12 న, ఉన్నత పాఠశాల ఏర్పడింది. అనంతరం పాఠశాలకు అవసరమైన స్థలాన్ని తుమ్మల భక్తవత్సలరెడ్డి కొనుగోలుచేసి, భవన నిర్మాణానికి తనవంతు విరాళం అందజేశారు. ఈ రకంగా గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పడింది. ప్రస్తుతం 10 గదులున్నవి. న్యూయార్కులో వైద్యుడిగా పనిచేస్తున్న ఇతను, ప్రతియేటా ఇక్కడకు వచ్చి, పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తుంటారు. గత ఏడాది వచ్చినప్పుడు, పాఠశాలకు అవసరమైన ఇన్వర్టరునూ, నీటిశుద్ధి యంత్రాన్నీ విరాళంగా అందజేశారు. ఆ రకంగా తుమ్మల భక్తవత్సలరెడ్డి గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు.

గామ ప్రముఖులు

[మార్చు]
  • మల్లి మస్తాన్ బాబు ప్రపంచప్రసిద్ధిచెందిన పర్వాతారోహకుడు.ఇతని పేరు గిన్నెస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్ లో నమోదయింది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]