Jump to content

గాలి సరస్వతి

వికీపీడియా నుండి
కృష్ణ రాఘవ జయేంద్ర భరత్

శాసనమండలి సభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 జూన్ 2018 - 11 ఆగస్టు 2021
ముందు గాలి ముద్దుకృష్ణమ నాయుడు
తరువాత కృష్ణ రాఘవ జయేంద్ర భరత్
నియోజకవర్గం చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1951
వేలంజేరి గ్రామం, తిరువళ్లూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి గాలి ముద్దుకృష్ణమ నాయుడు
సంతానం భానుప్రకాష్, జగదీష్ ప్రకాష్, లావణ్య
నివాసం తిరుపతి

గాలి సరస్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె 2018లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

గాలి సరస్వతి తన భర్త గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చింది. గాలి ముద్దు కృష్ణమనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో అటవీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఆయన 2018 ఫిబ్రవరి 7న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

గాలి ముద్దు కృష్ణమనాయుడు మృతితో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో ముద్దు కృష్ణమనాయుడు సతీమణి గాలి సరస్వతి ఏకగ్రీవంగా ఎన్నికై [2] 2018 జూన్ 25న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె ఈ పదవిలో 2021 ఆగస్టు 11 వరకు కొనసాగింది.[3]

మూలాలు

[మార్చు]
  1. Vaartha (25 June 2018). "ఎమ్మెల్సీగా గాలి స‌ర‌స్వ‌తి". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  2. Zee News Telugu (5 May 2018). "ఎమ్మెల్సీగా గాలి సరస్వతమ్మ ఏకగ్రీవం..!". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  3. Andhrajyothy (17 November 2021). "ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్‌ విడుదల". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.