గాలి ముద్దుకృష్ణమ నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాలి ముద్దుకృష్ణమ నాయుడు
జననం(1947-06-09)1947 జూన్ 9
వెంకట్రామాపురం, రామచంద్రాపురం మండలం, చిత్తూరు జిల్లా
మరణం2018 ఫిబ్రవరి 7(2018-02-07) (వయసు 70)
హైదరాబాదు
విద్యబి. ఎస్. సి, ఎం. ఎ, బి. ఎల్
వృత్తిరాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామిగాలి సరస్వతి
పిల్లలుగాలి భానుప్రకాష్, జగదీష్ ప్రకాష్, లావణ్య
తల్లిదండ్రులు
  • రామానాయుడు (తండ్రి)
  • రాజమ్మ (తల్లి)

గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.[1] తెలుగు దేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా పలు పదవులు నిర్వహించాడు. పుత్తూరు శాసనసభ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించాడు. విద్య (1984), అటవీశాఖ (1987), ఉన్నత విద్య (1994) మంత్రిగా సేవలందించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ముద్దుకృష్ణమ నాయుడు 1947, జూన్ 9 న చిత్తూరు జిల్లా, రామచంద్రాపురం మండలం, వెంకట్రామాపురం గ్రామంలో రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించాడు. బి. ఎస్. సి, ఎం. ఎ, బి. ఎల్ చదివాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

గుంటూరు జిల్లా, పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్‌ పిలుపుతో 1983లో రాజకీయ రంగప్రవేశం చేశాడు. పుత్తూరు శాసనసభ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించాడు. విద్య (1984), అటవీశాఖ (1987), ఉన్నత విద్య (1994) మంత్రిగా సేవలందించాడు. 2004 లో తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి శాసన సభ్యుడిగా గెలుపొందాడు. 2008 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి 2009లో నగరి నియోజక వర్గం ఎమ్మెల్యే గా గెలుపొందాడు. 2014 ఎన్నికల్లో వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోజా చేతిలో పరాజయం పాలయ్యాడు. తర్వాత చనిపోయేవరకు తెలుగుదేశం తరపున ఎం. ఎల్. సి గా సేవలందించాడు.

మూలాలు

[మార్చు]
  1. "మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కన్నుమూత". eenadu.net. ఈనాడు. Archived from the original on 7 ఫిబ్రవరి 2018. Retrieved 7 ఫిబ్రవరి 2018.
  2. "Gali Mudddu Krishnamma Naidu(TDP):(LOCAL AUTHORITIES CONSTITUENCIES) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-03-26.