గీతా కపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీతా కపూర్
గీతా కపూర్, కొరియోగ్రాఫర్
2020లో గీతా కపూర్
జననం (1973-07-05) 1973 జూలై 5 (వయసు 51)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1985 – ప్రస్తుతం

గీతా కపూర్ (జననం 1973 జూలై 5) భారతీయ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్, డాన్సర్. ప్రస్తుతం ఆమె మలైకా అరోరా, టెరెన్స్ లూయిస్‌ లతో కలిసి సోనీ టీవీలో డ్యాన్స్ రియాలిటీ షో ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఆమె డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, సూపర్ డ్యాన్సర్, ఇండియా కే మస్త్ కలందర్,.. ఇలా అనేక డ్యాన్స్ రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమెను గీతా మా అనే పేరుతో కూడా పిలుస్తారు.

కెరీర్

[మార్చు]

గీతా కపూర్ తన 15వ ఏట బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ బృందంలో చేరి తన కెరీర్‌ని ప్రారంభించింది.[1] ఆమెతో కలిసి గీతా కపూర్ కుచ్ కుచ్ హోతా హై, దిల్ తో పాగల్ హై, కభీ ఖుషీ కభీ ఘమ్, మొహబ్బతేన్, కల్ హో నా హో, మై హూ నా, ఓం శాంతి ఓం.. వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసింది.[2]

ఇక నేరుగా ఆమె నృత్య దర్శకత్వం వహించింది చిత్రాలలో ఫిజా (2000), అశోకా (2001), సాథియా (2002), హే బేబీ (2007), తోడా ప్యార్ తోడా మ్యాజిక్ (2008), అలాదిన్ (2009), తీస్ మార్ ఖాన్ వంటి అనేక బాలీవుడ్ చిత్రాలను చెప్పుకోవచ్చు.[3][4]

ఆమె టెంప్టేషన్ రీలోడెడ్ వంటి అవార్డు వేడుకలు, కచేరీలకు కొరియోగ్రఫీ చేసింది. పెప్సీ IPL 2013 ప్రారంభ వేడుకలకు కూడా నృత్య దర్శకత్వం వహించింది.

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ప్రదర్శన పాత్ర ఛానెల్
2009 డాన్స్ ఇండియా డ్యాన్స్ (సీజన్ 1) న్యాయనిర్ణేత జీటీవి
2010 డాన్స్ ఇండియా డ్యాన్స్ (సీజన్ 2)
డిఐడి లిల్ మాస్టర్స్ (సీజన్ 1)
డాన్స్ కీ సూపర్ స్టార్స్
2011 డబుల్స్ చేసాడు
డాన్స్ ఇండియా డ్యాన్స్ (సీజన్ 3)
2012 డిఐడి లిల్ మాస్టర్స్ (సీజన్ 2)
డాన్స్ కీ సూపర్‌కిడ్స్
2013 భారతదేశపు డ్యాన్సింగ్ సూపర్ స్టార్ స్టార్ ప్లస్
డ్యాన్స్ క తాషన్ చేసింది జీటీవి
2014 డిఐడి లిల్ మాస్టర్స్ (సీజన్ 3)
2015 డాన్స్ ఇండియా డ్యాన్స్ సూపర్ మామ్ సీజన్ 2
డాన్స్ ఇండియా డ్యాన్స్ (సీజన్ 5) గెస్ట్
2016 సూపర్ డాన్సర్ - డాన్స్ కా కల్ న్యాయనిర్ణేత సోనీ టీవి
2017 సూపర్ డాన్సర్ (చాప్టర్ 2)
2018 సూపర్ డాన్సర్ (చాప్టర్ 3)
ఇండియా కే మస్త్ కలందర్ సోనీ సబ్[5]
2019 డాన్స్ ప్లస్ (సీజన్ 5) గెస్ట్
2020 భారతదేశపు బెస్ట్ డ్యాన్సర్ న్యాయనిర్ణేత సోనీ టీవి[6]
2021 మహారాష్ట్ర బెస్ట్ డ్యాన్సర్ గెస్ట్ సోనీ మరాఠీ
సూపర్ డాన్సర్ (చాప్టర్ 4) న్యాయనిర్ణేత సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్
2021-22 భారతదేశపు ఉత్తమ నర్తకి - 2
2022 బిగ్ బాస్ 15 ప్యానెలిస్ట్ కలర్స్ టీవీ

మూలాలు

[మార్చు]
  1. Kaur, Ravneet (20 March 2009). "Geeta Kapoor makes you dance!". The Times of India. Archived from the original on 19 July 2012.
  2. PLANET BOLLYWOOD Glittering excess rules in Broadway's new 'Bombay Dreams'[permanent dead link] New York Daily News, 25 April 2004.
  3. "Dance India Dance, Watch Geeta Kapur Being Honored in April 18 Episode". Archived from the original on 29 March 2018. Retrieved 5 June 2010.
  4. Saltz, Rachel (2012). "Geeta Kapoor". Movies & TV Dept. The New York Times. Archived from the original on 25 February 2012.
  5. "SAB TV launches two new shows 'India Ke Mast Kalandar' and 'Namune' in the weekend slots". Mumbai Live (in ఇంగ్లీష్). Retrieved 26 December 2019.
  6. "Malaika Arora, Geeta Kapur & Terence Lewis to judge Sony TV's new dance show". BizAsia (in బ్రిటిష్ ఇంగ్లీష్). 20 December 2019. Retrieved 26 December 2019.