గుండయ పాళెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
నిర్దేశాంకాలు: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05Coordinates: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఒంగోలు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523182 Edit this on Wikidata


గుండయ పాళెం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం లోని గ్రామం[1]. పిన్ కోడ్: 523 182., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ వివరణ[మార్చు]

మండలం పేరు ఒంగోలు
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్రపదేశ్
భాష తెలుగు
ఎత్తు: సముద్రమట్టానికి 12 మీటర్లు
పిన్‌కోడ్ 523182.
తపాలా కార్యాలయం

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన మద్దిపాడు మండలం, తూర్పున కొత్తపట్నం మండలం, ఉత్తరాన నాగులుప్పలపాడు మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి సంకె వెంకటేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, మనగుడి కార్యక్రమంలో భాగంగా, ఈ ఆలయంలో,2017,ఆగస్టు-12వతేదీ శనివారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 13వతేదీ ఆదివారంనాడు, గ్రామములో, భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు కోలాట ప్రదర్శన చేసారు. గ్రామస్థులు ప్రత్యేకపూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషం[మార్చు]

ఈ తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో మద్యం తాగే అవకాశమే లేదు. గొడవలకు ఆస్కారమే లేదు. సంపాదించిన సొమ్ముతో సుఖంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఈ సమూల మార్పునకు మహిళా సంకల్పమే కారణం. స్త్రీలంతా ఐక్యంగా కదిలి అధికారుల సాయంతో గొలుసు దుకాణాలను మూయించారు. తమ గ్రామాన్ని తీర్చి దిద్దుకుంటున్నారు. [3]

2016-17 సంవత్సరానికి సంబంధించి, ఈ గ్రామానికి చెందిన ఎం.పి.టి.సభ్యుడు శ్రీ శింగోతు వెంకటేశ్వర్లు, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఎం.పి.టి.సి.సభ్యుడుగా ఎంపికైనారు. 2017,ఏప్రిల్-24న, రాష్ట్ర రాజధాని వెలగపూడిలో నిర్వహించు పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలలో భాగంగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతుల మీదుగా, ఈయనకు ఈ పురస్కారం అందజేసెదరు. [5]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామసంభదిత వివరాలకు ఇక్కడ చూడండి [1] [2] ఈనాడు ప్రకాశం; 2013,ఆగస్టు-3; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014,జనవరి-17; 8వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,అక్టోబరు-6; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,ఏప్రిల్-24; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,ఆగస్టు-13&14; 1వపేజీ.