గుజ్జు నాగరత్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుజ్జు నాగరత్నమ్మ

గుజ్జు నాగరత్నం భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె 1915లో వెంకటరత్నం, భ్రమరాంబ దంపతులకు నిడదవోలులో జన్మించారు. ఆమె భర్త వెంకటరావు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన సహకారంతో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. డా.బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహంతో రాజమండ్రి లోని రాజవీధిలో, పందిరి వీరన్న కొట్లకు ఎదురుగా ఖద్దరు వస్త్ర దుకాణం నిర్వహించారు. పట్టణం లోని అనేక వీధులలోనూ, పరిసర గ్రామాలలోనూ, నాగరత్నం గారు స్త్రీలతో కలసి విదేశీ వస్తు దహనం, ఖద్దరు అమ్మకం వంటి కార్యాలలో చురుకుగా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, స్త్రీల డిక్టేటర్ల సమావేశంలో పాల్గొన్నందున 1932,1933 సంవత్సరములలో ఏలూరు, గుంటూరు సబ్ జైళ్ళలోనూ, వెల్లూరు కన్ననూరు జైళ్లలోనూ 16 నెలల కఠిన శిక్షను అనుభవించారు. వైశ్యసేవా సదనంలో హరిజనులచే నూతి నీటిని త్రాగించారు.

మూలాలు

[మార్చు]
  1. "Gujuhu Nagarathnam". Archived from the original on 2017-08-09. Retrieved 2015-07-22.

ఇతర లింకులు

[మార్చు]