గుడిపూడి శ్రీహరి
గుడిపూడి శ్రీహరి సినిమా జర్నలిస్టు, విశ్లేషకులు. ఆయన 55 ఏళ్లపాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించారు. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ’ అనే పుస్తకాన్ని ఆయన రచించారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన ఎం.ఎ(గణితశాస్త్రం) ను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేసారు. ఆ కాలంలో ఆయన పి.యు.సి విద్యార్థులకు గణితశాస్త్రం, భౌతిక శాస్త్రాలను బోధించేవారు. ఆ తరువాత ఆయన జర్నలిజం వైపు దృష్టి సారించారు. ఆయన 1969 నుండి ద హిందూ పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. అప్పటి నుండి అనేక తెలుగు సినిమాలకు రివ్యూలు వ్రాసేవారు. ఆయన వ్రాసిన హిందూ రివ్యూలన్నింటిని సుందరయ్య విజ్ఞాన కళా మండపం నకు భద్రపరచుటకొరకు అందజేసారు. కానీ వరదల కారణంగా అవి పోయాయి . ప్రతి తెలుగు సినిమా వచ్చిందంటే దానిని చూడడం, రివ్యూ వ్రాయడం ఆయన చేసిన కృషికి నిదర్శనం.
సినిమాలలో అభిరుచి
[మార్చు]1940 లలో ఆయన బాలునిగా ఉన్నప్పుడు అనేక నాటకాలలో పాల్గొనేవారు. భారతదేశం లో సినిమా ఆ సమయంలో వృధ్ధిలోకి వచ్చింది . ధియేటర్ వాతావరణం అందంగా , మనోరంజకంగా ఉండేది. ఆయన సినిమా హాల్ లో ఒక చిత్రం చూడటానికి మైళ్లు , మైళ్ళు నడిచి వెళ్ళవలసి వచ్చేది. ఆయన సినిమాలకు ఆకర్షితులయ్యేవారు. ఆ కాలంలో ఆయన నాగయ్య సినిమాలైన "త్యాగయ్య", "భక్త పోతన" సినిమాలను చూసారు. ఆ కాలంలో సి.హెచ్.నారాయణరావు ఒక పెద్ద హీరో. ఆయన ప్రస్థానం కొనసాగుతున్న కాలంలోఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లు హీరోలుగా సినిమా పరిశ్రమలో ప్రవేశించారు. ఆయనకు ఇష్టమైన సినిమా మాయా బజార్.
అవార్డులు
[మార్చు]ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'పత్రికా రచన' లో "కీర్తి పురస్కారం (2013)" ప్రకటించారు.[1]
మరణం
[మార్చు]86 ఏళ్ల గుడిపూడి శ్రీహరి అనారోగ్యంతో హైదరాబాదులోని తన నివాసంలో 2022 జులై 4న అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు.[2] 2021 నవంబరులో తన శ్రీమతి లక్ష్మి మృతి చెందారు. ఆయనకు కుమారుడు శ్రీరామ్, ఓ కుమార్తె ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
- ↑ "Gudipudi Srihari: సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత". web.archive.org. 2022-07-05. Archived from the original on 2022-07-05. Retrieved 2022-07-05.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)