గుమాన్ సింగ్ దామోర్
స్వరూపం
గుమాన్ సింగ్ దామోర్ | |||
పదవీ కాలం 23 మే 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | కాంతిలాల్ భూరియా | ||
---|---|---|---|
తరువాత | అనితా నగర్ సింగ్ చౌహాన్ | ||
నియోజకవర్గం | రత్లాం | ||
పదవీ కాలం 2018-2019 | |||
ముందు | శాంతిలాల్ బిల్వాల్ | ||
తరువాత | కాంతిలాల్ భూరియా | ||
నియోజకవర్గం | ఝబువా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉమర్కోట్, ఝబువా , మధ్యప్రదేశ్ | 1957 ఏప్రిల్ 4||
జాతీయత | రాజకీయ నాయకుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | నహర్ సింగ్ దామోర్, సోనాబాయి దామోర్ | ||
జీవిత భాగస్వామి | సూరజ్ దామోర్ | ||
సంతానం | 4 (3 కుమార్తెలు, 1 కుమారుడు) | ||
నివాసం | ఝబువా , మధ్యప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
గుమాన్ సింగ్ దామోర్ (జననం 4 ఏప్రిల్ 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రత్లాంనియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]గుమాన్ సింగ్ దామోర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018లో ఝబువా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రత్లాం నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై నీటి వనరులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయనకు 2024లో టికెట్ దక్కలేదు.[2]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "BJP fields Shivraj from Vidisha, Scindia from Guna for LS polls; 10 MPs dropped". 3 March 2024. Retrieved 12 October 2024.