Jump to content

గూడు వదిలిన గువ్వలు

వికీపీడియా నుండి
గూడు వదిలిన గువ్వలు
గూడు వదిలిన గువ్వలు
కృతికర్త: ఎస్.ఆర్.భల్లం
బొమ్మలు: ఉదయ్ కుమార్
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: తెలుగు కవిత్వం (నానీలు )
ప్రచురణ: రచన సాహితీగృహం, లంకల కోడేరు
విడుదల: 2000
పేజీలు: 56


గూడు వదిలిన గువ్వలు పుస్తకాన్ని ఎస్.ఆర్.భల్లం రచించారు.

రచన నేపథ్యం

[మార్చు]

గూడు వదిలిన గువ్వలు పుస్తకం నానీలు అనే కవితా ప్రక్రియలో రాసిన కవితల సంకలనం. 18-20 అక్షరాల్లో, ఐదారు పాదాల్లో, నాల్గు చిన్న పాదాల్లో రాసే ప్రక్రియను నానీలు అంటారు. ఈ ప్రక్రియ ప్రారంభమై ప్రాచుర్యం పొందుతున్న తొలినాళ్లలో కవి ఎస్.ఆర్.భల్లం ఈ నానీల సంకలనాన్ని రాశారు. క్రీసెంట్ పబ్లికేషన్స్ వారు డిసెంబరు 2000లో గూడు వదిలిన గువ్వలు పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి, నానీ ప్రక్రియకు ఆద్యుడు డా.ఎన్.గోపికి అంకితమిచ్చారు.[1]

రచయిత గురించి

[మార్చు]

గూడు వదిలిన గువ్వలు గ్రంథకర్త ఎస్.ఆర్.భల్లం పూర్తిపేరు భల్లం సూర్యనారాయణరాజు. భల్లం లంకలకోడేరు గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగబాధ్యతల రీత్యా తాడేపల్లిగూడెంలో చిరకాలంగా నివసిస్తున్నారు. నీటిభూమి వంటి కవితా సంకలనాలు, కొల్లేరు అనే దీర్ఘకవిత ప్రచురణ పొందాయి.

ఉదాహరణలు

[మార్చు]

ఊహల్లోనే
ఊరు పచ్చదనం
నిజానికది
గడ్డ కట్టిన రక్తసముద్రం

యాత్ర అంటే
ప్రయాణం కాదు
నీలోకి
నువ్వుగా వెళ్ళే ప్రవాహం

వెదురు కర్రలో
వాయువుకి
ఆయువు పోయడమే
సంగీతం ....!

కొల్లేరు నిండా
కొంగల అక్షరాలు
వలస
మహాకావ్యమంటే యిదే ... !![2]

మూలాలు

[మార్చు]
  1. గూడు వదిలిన గువ్వలు పుస్తకానికి నానీలు బాటలో భల్లం శీర్షికన డా.ద్వానా శాస్త్రి రాసిన ముందుమాట
  2. గూడు వదిలిన గువ్వలు:భల్లం:అక్టోబర్ 2000 ప్రచురణ

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ ఆర్కీవ్స్‌లో పుస్తక ప్రతి