రమణ గోగుల
రమణ గోగుల | |
---|---|
జన్మ నామం | రమణ గోగుల |
జననం | 13 జూన్ |
మూలం | విశాఖపట్నం, భారతదేశం |
సంగీత శైలి | భారతీయ పాప్ సంగీతం సినిమా సంగీతం |
వృత్తి | గాయకుడు, పాటల రచయిత, సంగీతకారుడు, ప్రపంచ సంగీత దర్శకుడు, రచయిత |
క్రియాశీల కాలం | 1995 నుండి |
రమణ గోగుల తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, సంగీతకారుడు, ప్రపంచ సంగీత దర్శకుడు, రచయిత.[1] 1996 లో అతని బృందం మిస్టి రిథమ్స్ ఇండీ పాప్‌ను స్టూడియో ఆల్బమ్ "అయే లైలా" తో పాటు, మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఇది భారతదేశంలోని MTV, ఛానల్ [V] వంటి ప్రధాన సంగీత ఛానెళ్లలో చార్ట్ బస్టర్‌గా మారింది. ఆ తర్వాత, తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి, మూడు దక్షిణ భారత భాషలలో సుమారు 25 చిత్రాలకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశాడు. తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, యువరాజు వంటి చిత్రాలు ఈయన యొక్క అత్యంత ముఖ్యమైన విజయాలలో ఉన్నాయి.
ఈయన, ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎం.టెక్ తో పాటు బాటన్ రూజ్‌లోని లూసియానా స్టేట్ యూనివర్శిటీ (LSU) నుండి కంప్యూటర్ సైన్సులో ఎం.ఎస్ కూడా చేసాడు.
ఎంఎన్‌సి సైబేస్ కోసం దక్షిణాసియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.[2] [3] [4] [5]
చిత్ర సమాహారం
[మార్చు]- వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (2013)
- బోణీ (2009)
- వియ్యాలవారి కయ్యాలు (2007)
- యోగి (2007)
- అన్నవరం (2006)
- చిన్నోడు (2006)
- సీతారాముడు (2006)
- లక్ష్మి (2006)
- రిలాక్స్ (2005)
- మౌనమేలనోయి (2004)
- జానీ (2003)
- యువరాజు (2000)
- బద్రి (2000)
- తమ్ముడు (1999)
- ప్రేమంటే ఇదేరా (1998)
మూలాలు
[మార్చు]- ↑ "నా పాట కోసం ఎదురు చూశారు". Eenadu. 18 December 2024. Retrieved 18 December 2024.
- ↑ Interview with Ramana Gogula: idlebrain.com
- ↑ Interview with Ramana Gogula: idlebrain.com
- ↑ Want to set up a successful IT firm? Work hard!
- ↑ Exclusive Interview with Ramana Gogula on TotalTollywood Archived 2011-07-17 at the Wayback Machine
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Ramana Gogula పేజీ