Jump to content

పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు

వికీపీడియా నుండి
(గోదావరి కృష్ణా అనుసంధాన కాలువ నుండి దారిమార్పు చెందింది)
నిర్మాణదశ లో పట్టిసీమ ఎతిపోతల ప్రాజెక్ట్
పట్టిసీమ వద్ద అంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

పట్టిసీమ ఎత్తిపోతల పధకం గోదావరి, కృష్ణ నదులని అనుసంధానిస్తూ నిర్మించినా ఎత్తిపోతల పధకం [1].దేశ చరిత్రలో మొదటిసారిగా ఎటువంటి అంచనా వ్యయల పెంపు లేకుండా అనుకున్న సమయానికి పూర్తియి లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. పోలవరం రిజర్వాయరు ప్రాజెక్టు కు ఎక్కువ సమయం పట్టుతున్నందున రాష్ట్రప్రభుత్వం ఎత్తిపోతల పథకం ద్వారా త్వరగా నీరు అందించటానికి ఇది చేబట్టింది.

ప్రాజెక్ట్ సమాచారం

[మార్చు]
పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ (విహంగ వీక్షణం )

24 పంపులతో 7,476 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు . ఆసియ ఖండంలోనే అతిపెద్ద పంపింగ్ వ్యవస్థలు కలిగిన ప్రాజెక్టుల్లో ఇదిఒకటి . ఈ ప్రాజెక్ట్ యొక్క గరిష్ట తరలింపు సామర్ధ్యం 240 cumecs(క్యూబిక్ మీటర్ /సెకండ్). ఈ 24 పంపుల ద్వార గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వలోకి ఎతిపోసి కృష్ణ డెల్టా రైతులకి లబ్ది చేకూరుచాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం.బచావత్ ట్రిబ్యునల్, మధ్యప్రదేశ్,మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన అంతరాష్ట్ర ఒప్పందం ప్రకారం 80 TMC ల గోదావరి నీటిని కృష్ణ నదిలోకి తరలించవాచ్చు. ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు [2] .పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తొలి నాళ్ళలో ఎన్నో అవాంతరాలను ఎదురుకుంది. నీటి నిల్వ సామర్ధ్యం లేదు అంటూ ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ దానిని తీవ్రంగా వ్యతిరేకించింది [3]


మూలాలు

[మార్చు]
  1. "Krishna meets Godavari in first river linkage". 2015-09-17. Archived from the original on 2023-02-11. Retrieved 2023-02-16.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-11. Retrieved 2017-11-21.
  3. "YSRC opposed to Pattiseema: Jagan". 2015-09-04. Archived from the original on 2018-08-04.

వెలుపలి లింకులు

[మార్చు]

https://www.youtube.com/watch?v=8H96R7_RIPY