గోపాల్‌దాస్ అంబైదాస్ దేశాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోపాల్‌దాస్ అంబైదాస్ దేశాయ్ (1887-1951) గోపాల్‌దాస్ దేశాయ్ గా సుపరిచితులు. సౌరాష్ట్రలో ధాసా సింహాసనాన్ని అధిష్టించిన యువరాజు, గాంధేయవాది, సామాజికవేత్త. బ్రిటిష్ రాజ్‌కి వ్యతిరేకంగా స్వాతంత్ర్య సమరయోధుడిగా మారడానికి భారతదేశంలో తన రాజ్యాధికారం వదులుకున్న మొట్టమొదటి రాజుగా పేరు తెచ్చుకున్నాడు.[1]

యువరాజు, పాలకుడు[మార్చు]

గోపాల్‌దాస్ అంబైదాస్ దేశాయ్ ప్రస్తుత గుజరాత్ లోని ఖేడా జిల్లాలోని వాసోలో జన్మించాడు. అతను బరోడా రాష్ట్రానికి ఒక ఇనామ్‌దార్, ఫ్యూడేటరీ, ధాసా రాష్ట్ర పాలకుడు. రాయ్, సంఖలి గ్రామాల జాగీర్దార్. అతను వైష్ణవుడు, పటీదార్ అయినా పేరు ప్రకారం దేశాయ్, అమీన్.[2] అతను తన తల్లి తాత అంబైదాస్ వారసుడిగా సింహాసనం అధిష్టించి ధాసా పాలకుడు అయ్యాడు.[3] అయన మోహన్ దాస్ గాంధీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుదారుడు. వీరికి తరచుగా ఆర్థిక సహాయం అందించేవాడు. అతను ప్రగతిశీల పాలకుడు. ఉచిత విద్యను అందించాడు. మాండెస్ మాంటిస్సోరి ఆలోచనలకు ఆకర్షితుడైన అతను, 1915లో తన గురువు మోతీభాయ్ అమిన్ సహాయంతో వాసోలో మొట్టమొదటి మాంటిస్సోరి పాఠశాలను ప్రారంభించాడు. ఇది గుజరాత్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే మొట్టమొదటి మాంటిస్సోరీ పాఠశాల.[4]

1921 నాటికి, గోపాల్‌దాస్ అంబైదాస్ దేశాయ్ భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా మారాడు. ఆ సంవత్సరం అతను ఖేడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు.[5] మరుసటి సంవత్సరం, జాతీయ ఉద్యమంలో పాల్గొనడం, గాంధీకి ఆర్థిక సహాయాన్ని అందించడంపై బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ హెచ్చరికలు జారీఅయ్యాయి. వీటిని బేఖాతరు చేసిన తరువాత అతని రాష్ట్రం జప్తు చేయబడింది. బ్రిటిష్ వారు అతడిని పాలకుడిగా తొలగించారు. అతనిని తొలగించిన తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వం గోపాల్‌దాస్ అంబైదాస్ దేశాయ్ పెద్ద కుమారుడు సూర్యకాంత్ను కొత్త పాలకుడిగా ప్రతిపాదించారు. అయితే అతను తన తండ్రి వలనే రాజకీయ అభిప్రాయాలను కలిగి ఉన్నానని ప్రతిపాదనను తిరస్కరించాడు. 1922 నుండి భక్తిబాగా ప్రసిద్ధి చెందిన అతని భార్య భక్తి లక్ష్మి చురుకైన స్వాతంత్ర్య సమరయోధులు అయ్యింది. ఆ తర్వాత అతని మరో ముగ్గురు కుమారులకు రాజ్యాధికారి అవకాశం వచ్చినా, వారందరూ తమ తండ్రి అడుగుజాడలను అనుసరించి ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు.[6]

స్వాతంత్ర సమరయోధుడు[మార్చు]

అతని ఎస్టేట్లను జప్తు చేసిన తరువాత, గోపాల్‌దాస్ అంబైదాస్ దేశాయ్ బోర్సాడ్‌కు మకాం మార్చాడు. అక్కడ అతను బోర్సాద్, బార్డోలి సత్యాగ్రహాలలో పాల్గొన్నాడు. 1930 శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో, గోపాల్‌దాస్ అంబైదాస్ దేశాయ్ అతని భార్య భక్తిబా, ఇద్దరు పెద్ద కుమారులు మహేంద్ర, సూర్యకాంత్, వారి భార్యలు, వారి నవజాత కుమారుడు, కేవలం ఆరు నెలల వయస్సు గల బరీంద్రతో సహా మొత్తం దేశాయ్ కుటుంబం జైలు పాలైంది. దాంతో బరీంద్ర అతి పిన్న వయస్కుడైన స్వాతంత్ర్య సమరయోధుడు అని చెప్పవచ్చు.[7] 1930లో శిశువును సబర్మతి జైలుకు తీసుకెళ్లడానికి భక్తిబా బాధ్యత వహించింది. దేశమంతా క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న వేళ ఆమె చురుకుగా పాల్గొన్నారు. భక్తిబా ప్రఖ్యాత సామాజిక కార్యకర్త, గాంధేయ వాధి.[8]

సామాజిక కార్యకర్త[మార్చు]

అస్పృశ్యత నిర్మూలనకు, మహిళల విద్య కోసం, గాంధేయ వాధం కోసం గోపాల్‌దాస్ అంబైదాస్ దేశాయ్, భక్తిబా అవిశ్రాంతంగా కృషి చేశారు. గుజరాత్, సౌరాష్ట్రలో, ముఖ్యంగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల్లో మహిళా అక్షరాస్యతను పెంపొందించడంలో వారు మార్గదర్శకులు.[9] వారు 1935లో నాడియాడ్‌లో విఠల్ కన్యా విద్యాలయాన్ని, తరువాత 1946లో రాజ్‌కోట్‌లో వల్లభ కన్యా విద్యాలయాన్ని స్థాపించారు. ఈ రెండూ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1947లో మహాత్మాగాంధీ స్మారక చిహ్నం కీర్తి మందిరం, అతని జన్మస్థలం అయిన పోర్‌బందర్‌లో శంకుస్థాపన చేసే అవకాశం, గౌరవం దర్బార్ గోపాల్‌దాస్‌కు లభించింది.[10]

అతను బరోడా నుండి భారత రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు.[11] స్వాతంత్య్రం అనంతరం గోపాల్‌దాస్ తిరిగి రాజ్యాధికారిగా నియమించబడ్డాడు. దాదాపు 550 సంస్థానాలను స్వచ్ఛందంగా, బేషరతుగా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన మొదటి యువరాజుగా ఆయన చరిత్ర సృష్టించారు.[12]

ఇటీవల, మహాత్మా గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ దర్బార్ గోపాలదాస్ దేశాయ్ జీవిత చరిత్ర 'ది ప్రిన్స్ ఆఫ్ గుజరాత్' అనే పుస్తకాన్ని విడుదల చేశారు.[13]

మూలాలు[మార్చు]

 1. "Wanderings in wonderland". The Hindu. 25 August 2012. Retrieved 18 May 2018.
 2. "Yog Sunder: A true Prince of Dance".
 3. McLeod, John (1999). Sovereignty, Power, Control: Politics in the State of Western India, 1916–1947. Netherlands: Brill. p. 232. ISBN 9789004113435.
 4. "Vaso Heritage Village". Archived from the original on 2013-12-02. Retrieved 2021-10-19.
 5. Heredia, Ruth (1997). The Amul India Story. New Delhi: Tata Mc Graw Hill. ISBN 9780074631607.
 6. McLeod, John (1999). Sovereignty, Power, Control: Politics in the State of Western India, 1916–1947. Netherlands: Brill. p. 235. ISBN 9789004113435.
 7. Sunder, Yog. "Thus Youngest Freedom Fighter in India's Struggle for Independence" (PDF).
 8. Kumar, Ravindra (1999). Sardar Vallabhbhai Patel and Comrade Mao Tse-Tung: A Comparative Study. New delhi: Mittal Publications. p. 105. ISBN 9788170997146.
 9. "When Gandhians pioneered female literacy in S'rashtra". The Times of India. 21 January 2010. Archived from the original on 3 December 2013.
 10. "Gandhi Bapu Kirti mandir".
 11. "Constituent Assembly Debate on 28 April, 1947".
 12. McLeod John, Sovereignty, Power, Control: Politics in the State of Western India, 1916-1947
 13. "Remembering a prince". The Hindu. 3 December 2014. Retrieved 5 December 2014.