గోపాల్ గాడ్సే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోపాల్ గాడ్సే ఆర్.ఎస్.ఎ.స్. కార్యకర్త. ఇతను గాంధీ హత్య కేసులోని నిందితులలో ఒకరు. ఇతను నాథూరామ్ గాడ్సేకి తమ్ముడు. ఇతన్ని పూనేలోని ఇతని స్వగృహంలో అరెస్ట్ చేశారు. గాంధీ హత్యలో ఇతను తన అన్నకి సహకరించినందుకు ఇతనికి 18 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇతను జైలు నుంచి బయటకి వచ్చిన తరువాత తాను గాంధీని చంపినందుకు ఏమాత్రం విచార పడడం లేదని చెప్పుకున్నాడు. గోపాల్ గాడ్సే మొదట ఢిల్లీలో ప్రార్థనా సభ వద్ద బాంబు పెట్టి గాంధీని హత్య చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. ఈ హత్యాయత్నం కేసులో మదన్ లాల్ పాహ్వా అనే పంజాబీయుడు దొరికిపోయాడు. తాను కూడా దొరికిపోయేలోపే గాంధీని చంపాలనుకుని తన అన్న నాథూరామ్ గాడ్సేకి గాంధీ పై కాల్పులు జరపడానికి సహాయం చేశాడు.

.