గోపీకృష్ణా కంబైన్స్
స్వరూపం
(గోపీకృష్ణ మూవీస్ నుండి దారిమార్పు చెందింది)
ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు | |
|---|---|
![]() | |
| వృత్తి | నిర్మాత, గోపీకృష్ణా కంబైన్స్ అధినేత |
}} గోపీకృష్ణా కంబైన్స్ సినీ నిర్మాణ సంస్థ. [1]దీనికి అధిపతి సినీ నటుడి కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- కృష్ణవేణి (1974) - వి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించారు.
- భక్త కన్నప్ప (1976) - బాపు దర్శకత్వం వహించగా, కృష్ణంరాజు, వాణిశ్రీ, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు.
- అమరదీపం (1977) - రాఘవేంద్రరావు, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఈ చిత్రం నిర్మించింది.
- మధుర స్వప్నం (1982) - ఎజె క్రోనిన్ నవల ది సిటాడెల్ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు.
- బొబ్బిలి బ్రహ్మన్న (1984) - కృష్ణంరాజు, జయసుధ, రావు గోపాలరావు ప్రధాన పాత్రధారులుగా రాఘవేంద్రవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించారు.
- ధరమ్ అధికారి (1986)
- తాండ్ర పాపారాయుడు (1986) -18 వ శతాబ్దపు యోధుడు తాండ్ర పాపారాయుడు జీవితం ఆధారంగా నిర్మించారు.
- ప్రాణ స్నేహితులు (1988)[1] - రాకేశ్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన తొలిచిత్రం 'ఖుద్ గర్జ్' కు తెలుగు రూపం ఈ చిత్రం.
- మా ఇంటి మహరాజు (1988) - కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించిన సినిమా.
- యమధర్మరాజు (1990) - ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, సుహాసిని మణిరత్నం లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు
- బిల్లా (2009) - మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉప్పలపాటి ప్రభాస్ రాజు, అనుష్క, ఉప్పలపాటి కృష్ణంరాజు, నమిత, హన్సిక, జయసుధ తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2025-07-12.
