గౌహార్ జాన్
గుహార్ జాన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | ఏంజలినా యోవార్డ్ |
జననం | జూన్ 26, 1873 అజంగర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
మరణం | 17 జనవరి 1930 మైసూర్,భారతదేశం |
సంగీత శైలి | గజల్, టుమ్రీ, దాద్రా |
వృత్తి | సంగీత విద్వాంసురాలు, నృత్య కళాకారిణి |
క్రియాశీల కాలం | 1900–1930 |
గౌహార్ జాన్ (జననం 1873 జూన్ 26 – 1930 జనవరి 17) భారతీయ సంగీత విద్వాంసురాలు, నాట్య కళాకారిణి. ఆమె అసలు పేరు ఏంజలినా యోవార్డ్. కలకత్తాకు చెందిన ఈమె, భారతదేశంలో 78rpm లో రికార్డులో పాట పాడిన అతికొద్ది మందిలో గుహార్ ఒకరు.1902 లో గ్రామఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియాయొక్క ఫ్రెడ్ గైస్బర్గ్ చేత రికార్డు చేయబడిన రాగ్ జోగియాలో ఒక ఖాయల్ పాడటం దానిని ఏప్రల్ 1903 న విడుదల చేయటం ద్వారా వారు భారతదేశంలో గ్రామ్ఫోన్ను ప్రాచుర్యంలోకి తెచ్చారు, .[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]26 జూన్ 1873న అజంగర్ లో అర్మేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది గుహార్.[2] ఆమె తండ్రి విలియం రాబర్ట్ యోవార్డ్, డ్రై ఐసు ఫ్యాక్టరీలో ఇంజినీరుగా పనిచేసేవారు. 1872లో ఆమె తల్లి విక్టోరియా హెమ్మింగ్స్ ను వివాహం చేసుకున్నాడు ఆయన. ఇండియాలో పుట్టిన ఆమె తల్లి విక్టోరియా, సంగీతంలో, నాట్యంలో శిక్షణ పొందింది.1887 లో దర్భాంగా రాజ్ రాచరిక కోర్టులలో గౌహార్ జాన్ తన తొలి ప్రదర్శన ఇచ్చారు, కోర్టు సంగీతకారుడిగా నియమితులయ్యారు.
1879లో ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో గుహార్, ఆమె తల్లి కలసి బెనారస్ వెళ్ళిపోయారు. ఖుర్షీద్ అనే ముస్లిం వ్యక్తిని ఆమె తల్లి పెళ్ళి చేసుకుంది. ఆ తరువాత విక్టోరియా ఇస్లాంలోకి మారిపోయి, తన పేరును మల్కా జాన్ గానూ, ఏంజెలినా పేరును గుహార్ జాన్ గానూ మార్చింది.[3].బనారస్ వద్ద ఒక ప్రొఫెషనల్ డాన్సర్ నుండి వ నృత్య, సంగీత శిక్షణ పొందిన తరువాత. గౌహర్ జన్ 1896 లో కలకత్తాలో ప్రదర్శన ఇచ్చారు, ఆమె రికార్డులలో 'మొదటి డ్యాన్స్ గర్ల్' గా పిలిచారు. విక్టోరియా పబ్లిక్ హాల్లో జరిగిన ఒక సంగీత కచేరీ కోసం 1911 లో గౌహర్ జాన్ మొట్టమొదట మద్రాసును సందర్శించాడు, త్వరలో ఆమె హిందూస్థానీ, ఉర్దూ పాటలు తమిళ సంగీత పుస్తకాల్లో ప్రచురించబడ్డాయి.డిసెంబరు 1911 లో, ఢిల్లీ దర్బార్లో కింగ్ జార్జ్ V కి పట్టాభిషేకంలో పాల్గొనడానికి ఆమె ఆహ్వానించారు, అక్కడ ఆమె అలహాబాదులోని జాంకబాయ్తో యుగ హాయ్ తాజ్పోషి కా జల్సా, ముబారక్ హో ముబారక్ హో పాడారు.చివరికి, ఆమె చివరి రోజులలో, మైసూర్ కి చెందిన కృష్ణ రాజా వడయార్ IV యొక్క ఆహ్వానముతొ, మైసూర్ కు వచ్చారు ఆ తరువాత 1928 ఆగస్టు 1 న ప్యాలెస్ సంగీతకారుడిగా నియమితులయ్యారు, ఆమె 18 1930 జనవరి 17 న మైసూర్లో మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ About us Archived 2014-09-25 at the Wayback Machine Sa Re Ga Ma.
- ↑ Savitha Gautam (13 May 2010). "The Hindu : Arts / Music : Recording Gauhar Jaan". Beta.thehindu.com. Retrieved 29 January 2012.
- ↑ The importance of being Gauhar Jan The Tribune, 26 May 2002.