గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Grand Theft Auto
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III నుండి శ్రేణి యొక్క గుర్తింపు చిహ్నం (2001)
జొన్రా(లు)ఎక్షన్-ఎడ్వెన్చర్
డెవలపర్(లు)
  • రొక్‌స్టార్ నొర్త్
  • డిజిటల్ ఇక్లిప్స్
  • రొక్‌స్టార్ లీడ్స్
  • రొక్‌స్టార్ కెనడ
పబ్లిషర్(లు)రొక్‌స్టార్ గెయ్మ్స్
క్రియెయ్టర్(లు)
  • డేవిడ్ జోన్స్[1]
  • మైక్ డైలీ[2]
ప్లెట్‌ఫొర్మ్(లు)
  • ఎన్డ్రొయ్డ్
  • డ్రీమ్‌కాస్ట్
  • ఫైయర్ ఒ.ఎస్
  • గెయ్మ్‌బోయ్ అడ్వాన్స్
  • గెయ్మ్‌ బోయ్ కలర్
  • ఐఓఎస్
  • మ్యాక్ ఓయస్ టెన్
  • ఎంఎస్-డాస్
  • నిన్టెన్డొ డి.ఎస్
  • నిన్టెన్డొ స్విచ్
  • ఒక్యులస్ క్వెస్ట్ 2
  • ప్లెయ్‌స్టెయ్షన్
  • ప్లెయ్‌స్టెయ్షన్ 2
  • ప్లెయ్‌స్టెయ్షన్ 3
  • ప్లెయ్‌స్టెయ్షన్ 4
  • ప్లెయ్‌స్టెయ్షన్ 5
  • ప్లెయ్‌స్టెయ్షన్ పోర్టబౢ
  • విన్డోస్
  • విన్డోస్ ఫోన్
  • ఎక్స్‌బొక్స్
  • ఎక్స్‌బొక్స్ 360
  • ఎక్స్‌బొక్స్ వన్
  • ఎక్స్‌బొక్స్ సియరీస్ X/S
ఫస్ట్ రిలీస్గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో
28 నవంబరు 1997
లెయ్టిస్ట్ రిలీస్గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి – ద డెఫినిటివ్ ఎడిషన్
11 నవంబరు 2021

గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో లేదా గ్రాండ్ థెఫ్ట్ ఆటో (Grand theft auto) అనేది డేవిడ్ జోన్స్, మైక్ డైలీ అనే ఇద్దరు స్కొట్ డెవలపర్లు సృష్టించిన ఎక్షన్-ఎడ్వెన్చర్ వీడియో గేమ్ సియరీస్ (క్రీడా శ్రేణి).[2] శ్రేణిలోని తరువాతి అంకాలు నిర్మాణాన్ని పర్యవేక్షించిన వారు ఆంగ్లేయ వీడియోగేమ్ నిర్మాతలు డెన్ హొవ్సర్, సెమ్ హొవ్సర్ సోదరులూ, స్కొట్ వీడియో గేమ్ నిర్మాత లెస్లి బెన్జిస్, అలాగే ఎయరన్ గెర్‌బట్‌లు. ఆంగ్లేయ వీడియోగేమ్ నిర్మాణ సంస్థ రొక్‌స్టార్ నొర్త్ (ఒకప్పుడు డి.ఎం.ఎ డిజైన్) దీన్ని అభివృద్ధి చెయ్యగా, దీని మాతృసంస్థ ఐన అమెరికా నిర్మాణ సంస్థ రొక్‌స్టార్ ఎన్టర్టైన్‌మెన్ట్స్ దీన్ని విడుదల చేసింది. సియరీస్ పేరు గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో అనేది అమెరికా ఆంగ్లంలో కార్ల చోరీలను సూచించడానికి వాడే పదం.

ఈ ఆటలన్నీ ఒపెన్ వర్ల్డ్‌లో నడుస్తాయి. ఒపెన్ వర్ల్డ్‌‌లో (Open World, అనువాదం: తెరిచిన ప్రపంచం) ఆటగాడికి ఆటలోని లక్ష్యాలను కొన్ని పరిమితులకు లోబడి, తనకు నచ్చిన రీతిలో చేరుకునే స్వాతంత్ర్యం ఉంటుంది. ఈ ఆటలో కథనం ముందుకెళ్ళడానికి ఆటగాడు కొన్ని ముఖ్య లక్ష్యాలను ఛేదించాలి. ఇవి కాక కథతో సంబంధం లేని కొన్ని ఉపలక్ష్యాలు కూడా ఉంటాయి. ఆటలో ఎక్కువగా చేసే పనులు బళ్ళు తోలడం, తుపాకులతో కాల్చడం. అప్పుడప్పుడూ రోల్-ప్లే (ఆంగ్ల వికీ లంకె), చాటుగా మసులుకోవడం లాంటి పనులతో లక్ష్యాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 బిట్ కాలం నాటి "బీట్ ఎమ్ అప్" (beat 'em up, అర్థం: కొట్టిపడెయ్ వాళ్ళని) వీడియోగేమ్ ఛాయలు కూడా ఈ శ్రేణిలో కనిపిస్తాయి. దీనిలోని ఆటలన్నీ 1960ల నుండి 2010 వరకు కొన్ని నగరాలలో కనిపించిన వివిధ తీరుతెన్నుల ఆధారంగా రూపొందించిన కాల్పనిక నగరాల్లో ఈ ఆటలు నడుస్తాయి. మొదట్లో ఆటలోని పటంలో మూడు నగరాలు ఉండేవి—లిబర్టి సిటీ (న్యూయార్క్ ఆధారంగా తయారైనది), సెన్ ఎన్డ్రియస్ ( సెన్ ఫ్రన్సిస్కో ఆధారంగా తయారైనది) [గమనిక 1], వైస్ సిటి (Vice city, మైయెమి ఆధారంగా తయారైనది). తరువాత వచ్చిన ఆటల్లో, ఒకే ఆటలో మూడూ ఉండేటట్లు కాకుండా, ఒక ఆటలో ఏదో ఒక నగరం ఉండేటట్లు తయారు చేసారు. ఆ ఒక నగరాన్నీ ఇంకా అభివృద్ధి చేసి చేర్చారు. ప్రతీ ఆటలో ఒక నాయకుడు ఉంటాడు. అతను ఆ నగరపు నేర ప్రపంచంలో ఎదగటానికి ప్రయత్నిస్తుంటాడు. అలా ప్రయత్నించడానికి ప్రతీ ఆటలోనూ వేర్వేరు కారణాలు ఉంటాయి. నాయకుణ్ణో, నాయకుడి సంస్థనో మోసం చేసిన వారో, లేక అతని ఎదుగుదలకు అడ్డం పడేవారో ప్రతినాయకులుగా ఉంటారు. చలనచిత్ర పరిశ్రమా, సంగీత రంగాల్లోని చాలామంది దిగ్గజాలు, ఆటలోని పాత్రలకు గాత్రం ఇచ్చారు. వీరిలో మచ్చుకు కొందరు అమెరికా నటులైన రె లియొత్త, విల్యం ఫిశ్ట్నర్, జెయ్మ్స్ వుడ్స్, పీటర్ ఫొన్డలు, అమెరికా చిత్రనిర్మాత డెనిస్ హొపర్, అమెరికా నిర్మాత సెమ్యుల్ జెక్సన్, అమెరికా గాయని డెబి హెరి, అమెరికా సంగీతకారుడు ఎక్స్ల్ రోజ్.[3]

1997లో "గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో"ను విడుదల చేయడంతో ఈ శ్రేణి మొదలైంది. 2020 నాటికి ఈ శ్రేణిలో ఏడు ప్రధాన ఆటలూ, నాలుగు ఎక్స్‌పెన్షన్ పెక‌లూ (Expansion pack) ఉన్నాయి. ప్రధాన ఆటల్లో మూడోది ఐన "గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III" (Grand Theft Auto III) 2001లో వచ్చింది. త్రీ డైమెన్షనల్ సెటింగ్‌ను శ్రేణిలోకి మొదటిసారిగా తీసుకురావడంతో ఈ ఆట, ఆటగాళ్ళను బాగా ఆకట్టుకుంది. కనుక ఈ ఫ్రెన్చైజ్ ప్రస్థానంలో ఈ ఆటను ఒక మైలురాయిగా భావిస్తారు. ఈ ఆట తీరుతెన్నులను తరువాతి విడుదలల్లో కూడా కొనసాగించి, ఈ శ్రేణిలోని తరువాతి ఆటలు కూడా మన్ననలు అందుకున్నాయి. ఇతర ఒపెన్ వర్ల్డ్ ఆటలపై కూడా ఈ శ్రేణి ప్రభావం ఉంది. ఈ శ్రేణి తీరుతెన్నులతో వచ్చిన ఇతర ఆటలను "గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో క్లోన్"‌లుగా (Grand theft auto clone) పిలుస్తారు.

ఈ శ్రేణి విమర్శకుల మనన్నలు అందుకుంది. దీనిలో త్రీడిలో వచ్చిన ఆటలన్నీ కూడా "అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వీడియోగేములు", "అత్యధికంగా అమ్ముడైన వీడియోగేములు" జాబితాల్లో చోటు దక్కించుకున్నాయి. ఇప్పటి వరకు 3.7 కోట్ల యూనిట్ల అమ్మకాలతో ఈ ఫ్రన్చైజ్ అత్యధికంగా అమ్ముడైన వీడియోగేమ్ ఫ్రన్చైజ్‌లలో ఐదో స్థానంలో నిలిచింది. 2006లో ఆంగ్లేయ వార్తాసంస్థ బిబిసి, లన్డన్‌లో కళామందిరం ఐన డిజైన్ మ్యూజ్యం (Design museum)లు కలిసి నిర్వహించిన "గ్రెయ్ట్ బ్రిటిష్ డిజైన్ క్వెస్ట్" (Great British Design Quest) అనే కార్యక్రమంలో విడుదల చేయబడ్డ బ్రిటిష్ డిజైన్ ఐకాన్ (British Design Icon) జాబితాలో చోటు దక్కించుకుంది.[4] 2013లో ద టెలిగ్రాఫ్ అనే ఆంగ్లేయ పత్రిక బ్రిటన్ అత్యంత విజయవంతమైన ఎగుమతుల్లో ఒకటిగా "గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో"ను పేర్కొంది. ఈ ఆటల శ్రేణి దానిలో ఉన్న అశ్లీలతకూ, హింసకూ వివాదాస్పదమైంది.

అంకాలు[మార్చు]

సంవత్సరం ఆట నిర్మాణ సంస్థ ఆట లభ్యమయ్యే పరికరాలు యూనివర్స్[5]
హోమ్ కన్సోల్ కంప్యూటర్ హెన్డ్‌హెల్డ్ మొబైల్ ఇతర పరికరాలు
ప్రధాన ఆటలు
1997 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో డి.ఎమ్.ఎ డిజైన్ పి.ఎస్ 1 గెయ్మ్ బొయ్ కలర్ (జి.బి.సి) 2డి
1999 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో 2
  • పి.ఎస్ 1
  • డ్రీమ్‌కాస్ట్
విన్డోస్ జి.బి.సి
2001 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III
  • పి.ఎస్ 2
  • ఎక్స్‌బొక్స్
3డి
2002 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: వైస్ సిటి రొక్‌స్టార్ నోర్త్
  • పి.ఎస్2
  • ఎక్స్‌బొక్స్
  • విన్డోస్
  • మ్యాక్ ఓయస్ టెన్
2004 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: సెన్ ఎన్డ్రియస్
  • పి.ఎస్ 2
  • ఎక్స్‌బొక్స్
  • పి.ఎస్3[A]
  • ఎక్స్‌బొక్స్ 360[B]
  • విన్డోస్
  • మ్యాక్ ఓయస్ టెన్
  • ఎన్డ్రొయ్డ్
  • ఐఓఎస్
  • విన్డోస్ ఫోన్
  • ఫైయర్ ఒఎస్
ఒక్యులస్ క్వెస్ట్ 2[C]
2008 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV
  • పి.ఎస్ 3
  • ఎక్స్‌బొక్స్ 360
విన్డోస్ ఎచ్.డి
2013 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో V
  • పి.ఎస్ 3
  • ఎక్స్‌బొక్స్ 360
  • పి.ఎస్ 4
  • ఎక్స్‌బొక్స్ 1
  • పి.ఎస్ 5
  • ఎక్స్‌బొక్స్ సియరీస్ X/S
విన్డోస్
ఇంకా ప్రకటించలేదు పేరు పెట్టవలసి ఉన్న ఆట ఇంకా ప్రకటించలేదు
ఎక్స్‌పెన్షన్ పెక్స్
1999 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లన్డన్ 1969 రొక్‌స్టార్ కెనడా పి.ఎస్ 1
  • విన్డోస్
  • ఎంఎస్-డాస్
2డి
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లన్డన్ 1961
  • విన్డోస్
  • ఎంఎస్-డాస్
2009 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV: ద లొస్ట్ అన్డ్ డెమ్డ్ రొక్‌స్టార్ నోర్త్
  • పి.ఎస్3
  • ఎక్స్‌బొక్స్ 360
విన్డోస్ ఎచ్.డి
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద బెలడ్ ఒఫ్ గెయ్ టోని
  • పి.ఎస్3
  • ఎక్స్‌బొక్స్ 360
విన్డోస్
హెన్డ్‌హెల్డ్ గెయ్మ్స్ (Handheld games)
2004 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో అడ్వాన్స్ డిజిటల్ ఇక్లిప్స్ గెయ్మ్‌బొయ్ అడ్వాన్స్ 3డి
2005 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లిబర్టి సిటి స్టోరీస్ రొక్‌స్టార్ లీడ్స్ పి.ఎస్2 ప్లెయ్ స్టెయ్షన్ పోర్టబౢ (పి.ఎస్.పి)
  • ఐఒఎస్
  • ఎన్డ్రొయ్డ్
  • ఫైయర్ ఒఎస్
2006 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: వైస్ సిటి స్టోరీస్ పి.ఎస్2 పి.ఎస్.పి
2009 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: చైనాటౌన్ వార్స్
  • పి.ఎస్.పి
  • నిన్టెన్డొ డిఎస్
  • ఐఒఎస్
  • ఎన్డ్రొయ్డ్
  • ఫైయర్ ఒఎస్
ఎచ్‌డి
కొవ్మ్పలెయ్షన్స్ అన్డ్ రీమాస్టర్స్ (Compilations and remasters)
1999 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: డైరెక్టర్స్ కట్[D] డి.ఎమ్.ఎ డిజైన్ /
రొక్‌స్టార్ కెనడ
  • పి.ఎస్1
  • విన్డోస్
  • ఎం.ఎస్-డాస్
2డి
2003 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద క్లాసిక్స్ కలక్షన్[E]
  • పిఎస్1
  • విన్డోస్
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: డబల్ పెక్[F] రొక్‌స్టార్ నోర్త్
  • పి.ఎస్2
  • ఎక్స్‌బొక్స్
3డి
2005 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి[G]
  • ఎక్స్‌బొక్స్
  • పి.ఎస్ 2
  • విన్డోస్
  • మ్యాక్ ఒఎస్ టెన్
2009 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: డబల్ పెక్[H] రొక్‌స్టార్ లీడ్స్
  • పిఎస్ 2
పి.ఎస్.పి
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ఎపిసోడ్స్ ఫ్రం లిబర్టి సిటి[I] రొక్‌‌స్టార్ నోర్త్
  • ఎక్స్‌బొక్స్ 360
  • పి.ఎస్3
విన్డోస్ ఎచ్‌డి
2010 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV: కంప్లీట్ ఎడిషన్[J]
  • ఎక్స్‌బొక్స్ 360
  • పి.ఎస్3
విన్డోస్
2021 గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి – ద డిఫినిటివ్ ఇడిషన్[K] గ్రోవ్ స్ట్రీట్ గెయ్మ్స్
  • నిన్టెన్డొ స్విచ్[L]
  • పిఎస్4
  • పిఎస్5
  • ఎక్స్‌బొక్స్ 1
  • ఎక్స్‌బొక్స్ సియరీస్ X/S
విన్డోస్ స్విచ్[L]
  • ఎన్డ్రొయ్డ్
  • ఐఒఎస్
3డి
గమనికలు:
  1. ఈ ఆట మొదట ప్లెయ్‌స్టెయ్షన్ 3లో ప్లెయ్‌స్టెయ్షన్ నెట్‌వర్క్‌ ద్వారా ప్లెయ్‌స్టెయ్షన్ 2 క్లాసిక్స్‌లో భాగంగా వచ్చింది కానీ, తరువాత దాని స్థానంలో నెయ్టివ్ ఎచ్‌డి రిలీస్‌‌ని దింపారు.[6]
  2. ఎక్స్‌బొక్స్ 360లో ఈ ఆట మొదట ఎక్స్‌బొక్స్ లైవ్ మార్కెట్‌ప్లేస్ ద్వారా ఎక్స్‌బొక్స్ ఒరిజినల్స్ అనే లైన్‌లో ఉండేది. తరువాత దాని స్థానంలో నెయ్టివ్ రిలీస్‌ను దించారు.[7]
  3. సెన్ ఎన్డ్రియస్ది వర్చువల్ రియాలిటీ వెర్షన్ తయారీలో ఉంది.[8]
  4. దీనిలో గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో, లన్డన్ 1969 ఉంటాయి.
  5. దీనిలో గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో, లన్డన్ 1969, గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో 2 ఉన్నాయి
  6. దీనిలో గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III, వైస్ సిటీ ఉంటాయి
  7. దీనిలో గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III, వైస్ సిటీ, సెన్ ఎన్డ్రియస్ ఉంటాయి
  8. దీనిలో లిబర్టి సిటీ స్టోరీస్, వైస్ సిటీ స్టోరీస్ ఉంటాయి
  9. దీనిలో ద లొస్డ్ అన్డ్ డెమ్డ్ ద బెలడ్ ఒఫ్ గెయ్ టోనీ ఉంటాయి
  10. Includes దీనిలో ద లొస్డ్ అన్డ్ డెమ్డ్, గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV, ద బెలడ్ ఒఫ్ గెయ్ టోనీ ఉంటాయి
  11. దీనిలో గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III, వైస్ సిటీ, సెన్ ఎన్డ్రియస్ల రీమాస్టర్డ్ వెర్షన్లు ఉంటాయి.
  12. 12.0 12.1 నిన్టెన్డొ స్విచ్ అనేది హైబ్రిడ్ కన్సోల్. అంటే హోమ్ సిస్టమ్, హెన్డ్‌హెల్డ్ సిస్టమ్‌ల రెండిటి లక్షణాలూ గల కన్సోల్.

ప్రధాన ఆటలు[మార్చు]

విడుదలైన సంవత్సరాలు
           2డి యూనివర్స్              3డి యూనివర్స్              ఎచ్.డి యూనివర్స్[5]
1997గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో
1998
1999గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లన్డన్ 1969
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లన్డన్ 1961
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో 2
2000
2001గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III
2002గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: వైస్ సిటీ
2003గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: డబల్ పెక్
2004గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: సెన్ ఎన్డ్రియస్
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో అడ్వాన్స్
2005గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లిబర్టి సిటీ స్టోరీస్
2006గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: వైస్ సిటీ స్టోరీస్
2007
2008గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV
2009గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV: ద లోస్ట్ అన్డ్ డెమ్డ్
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: చైనాటౌన్ వార్స్
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద బెలడ్ ఒఫ్ గెయ్ టోని
2010
2011
2012
2013గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో V
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో ఒన్‌లైన్
2014
2015
2016
2017
2018
2019
2020
2021గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి - ద డెఫినిటివ్ ఎడిషన్
2022

The Grand Theft Auto series is split into separate fictional universes, named after the primary level of graphics capability used in each era.

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

  1. తరువాత వచ్చిన ఆటల్లో సెన్ ఎన్డ్రియస్‌ని రాష్ట్రంగా చూపించారు. ఈ ఆటల్లో దీనికి కెలఫొర్న్య, నవెడ రాష్ట్రాలు ఆధారమయ్యాయి. సెన్ ఫ్రన్సిస్కో ఆధారంగా సెన్ ఫియెర అనే ఇంకో నగరం కనిపిస్తుంది. దీనితో పాటు లోస్ సెన్టొస్ (లోస్ ఎన్జలస్ ఆధారంగా తయారైనది), లాస్ వెన్చురస్ (లాస్ వెయ్గస్ ఆధారంగా తయారైనది) అనే ఇంకో రెండు కొత్త నగరాలు చేర్చబడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. David Jones Returns To APB – Edge Magazine Archived 24 సెప్టెంబరు 2014 at the Wayback Machine. Edge-online.com (12 May 2011). Retrieved on 6 September 2012.
  2. 2.0 2.1 "GTA: "Max Clifford made it all happen"". GamesIndustry.biz. 22 October 2012. Archived from the original on 2 June 2015. Retrieved 22 June 2013.
  3. Orland, Kyle (14 September 2011). "Grand Theft Auto IV Passes 22M Shipped, Franchise Above 114M". Gamasutra. Archived from the original on 12 September 2015. Retrieved 21 September 2011.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; British design icons అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. 5.0 5.1 Rockstar. "Grand Theft Auto III: Your Questions Answered – Part One (Claude, Darkel & Other Characters)". Archived from the original on 10 April 2016. Retrieved 8 November 2012. Rockstar: The "universes" are the worlds interpreted at different definitions, 2D, 3D and high definition, so we felt brands and radio/back ground characters would exist in both, but 3 dimensional characters would not. [రొక్‌స్టార్: "యూనివర్స్‌లు" అంటే ప్రపంచాలే వేర్వేరు డెఫినిషన్‌లలో ఉండటం—2డి, 3డి, ఎచ్‌డి. కనుక బ్రెన్డ్లూ, రెడియో/నేపథ్య పాత్రలూ రెండిటిలోనూ ఉంటాయి కానీ, 3 డైమెన్షనల్ పాత్రలు ఉండవన్నది మా లెక్క.]
  6. Harradence, Michael (16 November 2015). "GTA San Andreas for PS3 gets rated for upcoming re-release". psu.com. Archived from the original on 17 November 2015. Retrieved 18 November 2015.
  7. Makuch, Eddie (23 October 2014). "GTA: San Andreas Re-Release Coming to Xbox 360 [UPDATE]". GameSpot. CBS Interactive. Archived from the original on 25 October 2014. Retrieved 25 October 2014.
  8. Fenlon, Wes (28 October 2021). "Grand Theft Auto: San Andreas is coming to VR". PC Gamer. Future plc. Archived from the original on 29 October 2021. Retrieved 29 October 2021.