Jump to content

చంద్రభాగ దేవి

వికీపీడియా నుండి
ఉభయకర్ కృష్ణారావు చంద్రభాగ దేవి
భర్త యు.ఎస్.కృష్ణారావుతో కలిసి చంద్రభాగ దేవి
వ్యక్తిగత సమాచారం
జననం(1921-08-11)1921 ఆగస్టు 11
పుత్తూరు, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక రాష్ట్రం
మరణం1997 ఏప్రిల్ 14(1997-04-14) (వయసు 75)
బెంగళూరు
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్యం కళాకారిణి
జీవిత భాగస్వామియు.ఎస్.కృష్ణారావు

చంద్రభాగ దేవిభరతనాట్య కళాకారిణి, నాట్యగురువు. ఈమె తన భర్త యు.ఎస్.కృష్ణారావుతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చింది.

విశేషాలు

[మార్చు]

ఈమె దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో రామానందరాయ్ పడుకోనె, సీతాదేవి పడుకోనె దంపతులకు 1921, ఆగష్టు 11వ తేదీన జన్మించింది. ఈమె రసాయనశాస్త్రంలో బి.ఎస్.సి. డిగ్రీ చదివింది.[1] శివరామ కారంత్ వద్ద ఫ్రీస్టైల్ నృత్యం అభ్యసించింది. 1943లో తన భర్త యు.ఎస్.కృష్ణారావుతో కలిసి తంజావూరులో పందనల్లూర్ మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందింది.[2] ఆ కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు కాని, యువతి కాని భరతనాట్యం నేర్చుకోవడం నిజంగా ఒక సాహసోపేతమైన చర్య. అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఈ దంపతులు భారతీయ శాస్త్రీయ నృత్యంలో ఒక ఉత్కృష్టమైన జంటగా నిలదొక్కుకున్నారు. ఈ జంట మద్రాసులోని మ్యూజియమ్‌ థియేటర్లో 1944లో తొలి ప్రదర్శన గావించారు. తరువాత వీరు దేశవిదేశాలలో 1500కు పైగా జంటగా ప్రదర్శనలు ఇచ్చారు.[3]

శృతి ముఖచిత్రంపై చంద్రభాగ దేవి దంపతుల నృత్య భంగిమ

రతీ మన్మథ, రాధాకృష్ణ, ది టెంప్టేషన్ ఆఫ్ బుద్ధ, రాణి శాంతల, గీతాగోవిందం, కామదహనం వంటి సంగీత నృత్యరూపకాలను ఈ జంట ప్రదర్శించింది.

ఈ జంట భరతనాట్యానికి ప్రాచుర్యాన్ని కల్పించింది. న్యూయార్క్, లండన్, హాంగ్ కాంగ్, హవాయ్, సింగపూర్ వంటి ప్రదేశాలలో ఉపన్యాసాలు, ప్రదర్శనలు ఇచ్చారు. 1942లో వీరు బెంగళూరులో మహామాయ అనే నృత్య పాఠశాలను స్థాపించారు. వీరి వద్ద నాట్యం నేర్చుకున్న కళాకారులు ప్రపంచం నలుమూలలా విస్తరించి ఉన్నారు. వీరి వద్ద శిక్షణ పొందిన వారిలో ఇంద్రాణి రెహమాన్, సోనాల్ మాన్ సింగ్, సుధారాణి, ప్రతిభా ప్రహ్లాద్, రేవతి సత్యు, ఆశాగోపాల్, శారదారుద్ర, దీప్తి దివాకర్ మొదలైన వారున్నారు. ఈమె 1973 నుండి 1977 వరకు భారతీయ విద్యాభవన్‌లో నాట్యంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. కర్ణాటక సంగీత నృత్య అకాడమీ అధ్యక్షురాలిగా కొంతకాలం పనిచేసింది.

రచనలు

[మార్చు]
  • గజ్జెయ హెజ్జె నుడి : కళా యాత్రెయ ప్రవాస చరిత్రె
  • ఎ పనోరమా ఆఫ్ ఇండియన్ డ్యాన్స్ (యు.ఎస్.కృష్ణారావుతో కలిసి)
  • నృత్యకళె (యు.ఎస్.కృష్ణారావుతో కలిసి)
  • అభినయకళె (యు.ఎస్.కృష్ణారావుతో కలిసి)
  • ఆధునిక భారతదల్లి నృత్యకళె (యు.ఎస్.కృష్ణారావుతో కలిసి)
  • విష్ణు నారాయణ భక్త కాండె మొదలైనవి.

పురస్కారాలు

[మార్చు]

మరణం

[మార్చు]

ఈమె 1997, ఏప్రిల్ 14వ తేదీన బెంగళూరులో తన 75వ యేట మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. web master. "ಚಂದ್ರಭಾಗಾದೇವಿ". ಕಣಜ. ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ. Retrieved 16 April 2021.
  2. Lalitha Venkat. "U S Krishna Rao (1912 – 2005)". Narthaki. Dr.Anita Ratnam. Retrieved 16 April 2021.
  3. web master. "ಯು.ಎಸ್.ಕೃಷ್ಣರಾವ್-ಯು.ಕೆ. ಚಂದ್ರಭಾಗಾದೇವಿ". ಕಣಜ. ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ. Retrieved 16 April 2021.