ఇంద్రాణి రెహమాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంద్రాణి రెహమాన్
జననం
ఇంద్రాణి బాజ్‌పాయ్

(1930-09-19)1930 సెప్టెంబరు 19 [1]
మరణం1999 ఫిబ్రవరి 5(1999-02-05) (వయసు 68)
న్యూయార్క్, అమెరికా
వృత్తిభారత శాస్త్రీయ నృత్యకళాకారిణి, నృత్య దర్శకురాలు
జీవిత భాగస్వామిహబీబ్ రెహమాన్
పిల్లలురాం రెహమాన్, సుకన్యా రెహమాన్
తల్లిదండ్రులు
  • రాగిణీ దేవి (తల్లి)
పురస్కారాలు1969: పద్మశ్రీ
1981:సంగీత నాటక అకాడమీ అవార్డు
ఇంద్రాణి రెహ్మాన్ మిస్ ఇండియా 1952 కిరీటం పొందిన తర్వాత. 1952లో యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన మిస్ యూనివర్స్‌లో పాల్గొన్న మొదటి భారతీయ మహిళ.

ఇంద్రాణి రెహమాన్ (1930 – 1999) ఒక భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి. ఈమె భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ నృత్యాలలో తన ప్రతిభను కనబరచింది. ఈమె 1952లో మొట్టమొదటి మిస్ ఇండియాగా ఎంపిక అయ్యింది.

కుటుంబ నేపథ్యం[మార్చు]

ఇంద్రాణి చెన్నై (నాటి మద్రాసు) లో 1930, సెప్టెంబరు 19న రామలాల్ బలరాం బాజ్‌పాయ్, రాగిణీ దేవి దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి రామ్‌లాల్ బాజ్‌పాయ్ ఉత్తర భారతీయుడు. రసాయన శాస్త్రవేత్త. అతడు ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్ళి అక్కడ అమెరికన్ స్త్రీ ఎస్త్రేర్ ల్యూలా షెర్మన్‌ను వివాహం చేసుకున్నాడు.[2] ఎస్తేర్ వివాహం తరువాత హిందూమతం స్వీకరించి తన పేరును రాగిణీ దేవిగా మార్చుకుంది.[3]

వారు 1920లో భారతదేశానికి తిరిగి వచ్చారు. లాలా లజపతిరాయ్ నడిపిన యంగ్ ఇండియా అనే పత్రికలో రాంలాల్ సహాయ సంపాదకునిగా చేరాడు. భారత స్వాతంత్ర్యం తరువాత అతడు న్యూయార్క్‌లో భారత కాన్సులేట్ జనరల్‌గా నియమించబడ్డాడు.[4] తరువాత ఇండో అమెరికన్ లీగ్‌కు అధ్యక్షుడైనాడు. ఈలోగా రాగిణీ దేవి భారతీయ శాస్త్రీయ నాట్యం పట్ల ఆకర్షితురాలయ్యింది. ఈమె మైసూరు రాజనర్తకి జెట్టి తాయమ్మ వద్ద భరతనాట్యం నేర్చుకుంది. తరువాత మద్రాసులోని దేవదాసి మైలాపూర్ గౌరి అమ్మ వద్ద తన నాట్యాన్ని మెరుగు పరచుకుంది.[5][6][7] రాగిణి 1930లలో పేరున్న భరతనాట్య నర్తకీమణులలో ఒకరిగా గుర్తింపును పొందింది. [8] అదే సమయంలో కథాకళి పునరుద్ధరణకు కూడా పాటుపడింది.

ఇంద్రాణి మిశ్రమ జాతిలో జన్మించి ఎటువంటి ఆంక్షలు లేని స్వేచ్ఛా జీవితాన్ని గడిపింది. తల్లి ప్రోద్బలంతో అందాల పోటీలలో పాల్గొన్నది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అతి కొద్ది మంది పోటీ దారులలో ఈమె 1952లో "మిస్ ఇండియా" కిరీటాన్ని ధరించింది.

భారత కాంగ్రెస్ నాయకుడు ఎస్.కె.పాటిల్ తదితరులతో మిస్ ఇండియా 1952 ఇంద్రాణి రెహమాన్
మిస్ ఇండియా 1952లో పాల్గొన్న వారితో ఇంద్రాణి రెహమాన్ (ఎడమ నుండి 3వ వ్యక్తి)

వృత్తి[మార్చు]

ఇంద్రాణి తన తల్లితో కలిసి తన 9వ యేట నుండి నాట్యం నేర్చుకుంది. తన తల్లితో కలిసి అమెరికా ఐరోపా దేశాలలో పర్యటించింది. ఈమె 1940లలో పి.చొక్కలింగం పిళ్ళై వద్ద పందనల్లూర్ బాణీలో భరతనాట్యాన్ని అభ్యసించింది. తరువాత ఈమె విజయవాడలో ఉన్నప్పుడు కోరాడ నరసింహారావు వద్ద కూచిపూడి నాట్యం అభ్యసించింది. కోరాడ నరసింహారావుతో కలిసి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కూచిపూడి నాట్యప్రదర్శనలు ఇచ్చింది. [9]

1947లో కళా విమర్శకుడు డా.ఛార్లెస్ ఫాబ్రి ప్రోద్బలంతో ఈమె ఒరిస్సా వెళ్ళి ప్రపంచానికి ఎక్కువగా తెలియని ఒడిస్సీ నృత్యాన్ని దేబ ప్రసాద్ దాస్ వద్ద మూడు సంవత్సరాలు అభ్యసించి ఆ శాస్త్రీయ నృత్యంలో మొదటి ప్రొఫెషనల్ కళాకారిణిగా గుర్తించబడింది. ఈమె ఒడిస్సీ నృత్యాన్ని జన బాహుళ్యంలోకి తీసుకుని వచ్చి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఆ నృత్యానికి ప్రచారం కల్పించింది.[10][11]

1952లో ఈమె మొట్టమొదటి "ఫెమినా మిస్ ఇండియా"గా ఎంపికయ్యింది. ఆ సమయానికి ఆమెకు వివాహం అయ్యి ఒక సంతానం కూడా ఉంది.[12][13]తరువాత కాలిఫోర్నియాలో జరిగిన "మిస్ యూనివర్స్ 1952" పోటీలలో పాల్గొన్నది.[14] ఈమె తన తల్లితో కలిసి ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో నాట్యప్రదర్శనలు ఇచ్చింది.[15] 1961లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అమెరికా సందర్శించినప్పుడు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడి, నెహ్రూల సమక్షంలో ఈమె నృత్యప్రదర్శన గావించింది.[8] తరువాతి కాలంలో ఈమె ఎలిజబెత్ రాణి, మావో జెడాంగ్, నికిటా కృశ్చేవ్, ఫిడెల్ కాస్ట్రో వంటి ప్రపంచ నాయకుల సమక్షంలో తన నాట్య ప్రదర్శనలు ఇచ్చింది.[3][16] 1970లో ఈమె న్యూయార్క్‌లోని ఒక పాఠశాలలో నృత్య గురువుగా చేరి తరువాత అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలలో నృత్యాన్ని నేర్పించింది. తన చివరి రెండు దశకాలు ఈమె అమెరికాలో నివసించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈమె తన 15వ యేట పారిపోయి హబీబ్ రెహమాన్‌ను వివాహం చేసుకుంది. రెహమాన్ పేరుపొందిన ఆర్కిటెక్ట్. ఈ జంటకు రాం రెహమాన్ అనే కుమారుడు, సుకన్య రెహమాన్[17] అనే కుమార్తె కలిగారు. సుకన్య కూడా నృత్య కళాకారిణి. తన తల్లి, అమ్మమ్మలతో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది.

మరణం[మార్చు]

ఈమె 1999, ఫిబ్రవరి 5వ తేదీన మన్‌హట్టన్, న్యూయార్కులో మరణించింది.

అవార్డులు[మార్చు]

ఇవీ చదవండి[మార్చు]

  • Dancing in the Family, by Sukanya Rahman. 2001, Harper Collins India, ISBN 81-7223-438-4.
  • Dance dialects of India, by Ragini Devi. Motilal Banarsidass Publ., 1990. ISBN 81-208-0674-3, ISBN 978-81-208-0674-0.

మూలాలు[మార్చు]

  1. "Remembering Indrani". 24 September 2009. Retrieved 1 April 2021.
  2. Ragini Devi Biography Notable American Women: A Biographical Dictionary Completing the Twentieth Century, by Susan Ware, Stacy Lorraine Braukman, Radcliffe Institute for Advanced Study. Harvard University Press, 2004. ISBN 0-674-01488-X, 9780674014886. Page 172-173.
  3. 3.0 3.1 Obituary: Indrani Rehman Archived 15 సెప్టెంబరు 2008 at the Wayback Machine by Kuldip Singh, The Independent (London), 18 February 1999
  4. Ramalal Balram Bajpai – Biography[permanent dead link]
  5. Rhythm of the new millennium Archived 2010-07-21 at the Wayback Machine Leela Venkatraman, The Hindu, 28 October 2001.
  6. Dancing through their lives Archived 2012-11-07 at the Wayback Machine The Hindu, 22 September 2002.
  7. HINDU DANCES PRESENTED; Ragini Devi Seen in Theatre of All Nations Performance New York Times, 9 December 1944.
  8. 8.0 8.1 Indrani, Performer of Classical Indian Dance, Dies at 68 New York Times, 8 February 1999.
  9. Indrani Rahman Kuchipudi: Kūcipūdi : Indian Classical Dance Art, by Sunil Kothari, Avinash Pasricha. Abhinav Publications, 2001. ISBN 81-7017-359-0, ISBN 978-81-7017-359-5. 190.
  10. Indrani Rahman India's Dances: Their History, Technique, and Repertoire, by Reginald Massey. Abhinav Publications, 2004. ISBN 81-7017-434-1. page 210.
  11. Guests Archived 19 జూలై 2011 at the Wayback Machine Stuttgart – Bharatiya Mujlis.
  12. MISS INDIA' IS PICKED; Architect's Wife Wins Boycotted Beauty Contest's Final New York Times, 4 April 1952.
  13. Indian Press Hails National Beauty Contest Won by Shapely Half-American in Her Sari New York Times, 5 April 1952.
  14. "Miss India". Archived from the original on 26 అక్టోబరు 2009. Retrieved 11 నవంబరు 2010.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  15. Indrani Rahman National Library of Australia.
  16. In Remembrance Archived 21 జూలై 2010 at the Wayback Machine Indian Express, 15 April 1999.
  17. Sukanya Rahman Website
  18. Padma Shri – Indrani Rahman Archived 31 జనవరి 2009 at the Wayback Machine Padma Shri Official listing at Govt. of India website.
  19. Sangeet Natak Akademi Award – “Bharata Natyam Archived 12 ఫిబ్రవరి 2009 at the Wayback Machine Sangeet Natak Akademi Award official listing.

బయటి లింకులు[మార్చు]